టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా
క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా 10,000 కంటే ఎక్కువ పరుగులు చేయడాన్ని ఒక ముఖ్యమైన విజయంగా పరిగణిస్తారు.[1] అత్యధిక స్కోర్‌లను సాధించే ప్రయత్నంలో, వెస్ట్ ఇండియన్ గార్ఫీల్డ్ సోబర్స్ 1974లో మొత్తం 8,032 పరుగులతో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసి రిటైరయ్యాడు [2] 1982లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జెఫ్రీ బాయ్‌కాట్ దాన్ని బద్దలుకొట్టే వరకు ఈ రికార్డు తొమ్మిదేళ్లపాటు కొనసాగింది. [3] [4] రెండు సంవత్సరాల తర్వాత 1983లో భారత బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ ఆ స్కోరును అధిగమించాడు.[5] [6] 1987 మార్చిలో, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గవాస్కర్ టెస్టుల్లో 10,000 పరుగుల మార్కును దాటిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. [7] 2022 డిసెంబరు నాటికి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో పూర్తి సభ్యదేశాలుగా ఉన్న ఏడు జట్లకు చెందిన పద్నాలుగు మంది ఆటగాళ్ళు-టెస్టులలో 10,000 పరుగులు సాధించారు. వీరిలో ముగ్గురేసి ఆస్ట్రేలియాకు, భారత్‌కూ చెందినవారు కాగా, ఇద్దరేసి ఇంగ్లండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందినవారు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల నుండి ఒక్కో ఆటగాడు ఈ ఘనత సాధించారు. [7] బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్, జింబాబ్వేల నుంచి ఇప్పటి వరకు ఎవరూ టెస్టుల్లో 10,000 పరుగుల గీతను చేరలేదు.
ఇన్నింగ్స్ విషయానికొస్తే, వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర అత్యంత వేగంగా (195) 10,000 పరుగుల మార్క్‌ను చేరుకోగా, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ వా ఈ ఫీట్‌ను (244) సాధించడంలో నిదానంగా నిలిచాడు. [7] టెండూల్కర్‌కు అనేక రికార్డులున్నాయి-అత్యధిక మ్యాచ్‌లు (200 మ్యాచ్‌లు), అత్యధిక పరుగులు (15,921) అత్యధిక సెంచరీలు (51), అర్ధ సెంచరీలు (68) మొదలైనవి [5] ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ 9 సంవత్సరాల 174 రోజుల వ్యవధిలో అత్యంత వేగంగా ఈ గీత చేరగా, వెస్టిండీస్ ఆటగాడు శివనారాయణ్ చంద్రపాల్‌కు 18 సంవత్సరాల 37 రోజులు పట్టింది. జో రూట్, అలిస్టర్ కుక్ 10,000 పరుగులు చేసిన అతి పిన్న వయస్కులుగా రికార్డును పంచుకున్నారు, ఇద్దరూ 31 సంవత్సరాల 157 రోజుల వయస్సులో ఈ మైలురాయిని చేరుకున్నారు. [8]
కీ
మార్చు- ప్రధమ - రంగప్రవేశంచేసిన సంవత్సరాన్ని సూచిస్తుంది
- చివరిది - తాజా మ్యాచ్ జరిగిన సంవత్సరాన్ని సూచిస్తుంది
- మ్యా - ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను సూచిస్తుంది
- ఇన్. - బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్‌ల సంఖ్యను సూచిస్తుంది
- తేదీ - ఆటగాడు 10,000 పరుగుల మార్కును చేరుకున్న తేదీని సూచిస్తుంది
- ^ - ఆటగాడు ఒకప్పుడు టెస్టుల్లో అత్యధిక రన్ స్కోరర్ అని సూచిస్తుంది
- † - ఆటగాడు టెస్టుల్లో చురుకుగా ఉన్నాడని సూచిస్తుంది
10,000 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్లు
మార్చుNo. | ఆటగాడు | చిత్రం | జట్టు | తొలి | చివరి | మ్యా | ఇన్నిం | పరు
గులు |
సగ | 100 | 50 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1 | సచిన్ టెండూల్కర్[5][9] ^ | భారతదేశం | 1989 | 2013 | 200 | 329 | 15,921 | 53.78 | 51 | 68 | |
2 | రికీ పాంటింగ్[5][10] | ఆస్ట్రేలియా | 1995 | 2012 | 168 | 287 | 13,378 | 51.85 | 41 | 62 | |
3 | జాక్ కాలిస్[5][11] | దక్షిణాఫ్రికా | 1995 | 2013 | 166 | 280 | 13,289 | 55.37 | 45 | 55 | |
4 | రాహుల్ ద్రవిడ్[5][12] | భారతదేశం | 1996 | 2012 | 164 | 286 | 13,288 | 52.31 | 36 | 63 | |
5 | అలిస్టయిర్ కుక్[5][13] | ఇంగ్లాండు | 2006 | 2018 | 161 | 291 | 12,472 | 45.35 | 33 | 57 | |
6 | కుమార సంగక్కర[5][14] | శ్రీలంక | 2000 | 2015 | 134 | 233 | 12,400 | 57.40 | 38 | 52 | |
7 | బ్రయాన్ లారా[5][15] ^ | వెస్ట్ ఇండీస్ | 1990 | 2006 | 131 | 232 | 11,953 | 52.88 | 34 | 48 | |
8 | శివనారాయణ్ చందర్‌పాల్ [5][16] | వెస్ట్ ఇండీస్ | 1994 | 2015 | 164 | 280 | 11,867 | 51.37 | 30 | 66 | |
9 | మహేల జయవర్ధనే[5][17] | శ్రీలంక | 1997 | 2014 | 149 | 252 | 11,814 | 49.84 | 34 | 50 | |
10 | జో రూట్[5][18] † | ఇంగ్లాండు | 2012 | 2023 | 132 | 242 | 11,196 | 50.43 | 30 | 58 | |
11 | అలన్ బార్డర్[5][19] ^ | ఆస్ట్రేలియా | 1978 | 1994 | 156 | 265 | 11,174 | 50.56 | 27 | 63 | |
12 | స్టీవ్ వా[5][20] | ఆస్ట్రేలియా | 1985 | 2004 | 168 | 260 | 10,927 | 51.06 | 32 | 50 | |
13 | సునీల్ గవాస్కర్[5][21] ^ | భారతదేశం | 1971 | 1987 | 125 | 214 | 10,122 | 51.12 | 34 | 45 | |
14 | యూనిస్ ఖాన్[5][22] | పాకిస్తాన్ | 2000 | 2017 | 118 | 213 | 10,099 | 52.05 | 34 | 33 | |
References:[7][5] Last updated : 02 July 2023 |
దేశం వారీగా
మార్చుజట్లు | 10,000 పైచిలుకు పరుగులు |
---|---|
ఆస్ట్రేలియా | 3 |
భారతదేశం | |
ఇంగ్లాండు | 2 |
శ్రీలంక | |
వెస్ట్ ఇండీస్ | |
పాకిస్తాన్ | 1 |
దక్షిణాఫ్రికా | |
మొత్తం | 14 |
ఇవి కూడా చూడండి
మార్చు- టెస్ట్ క్రికెట్ రికార్డుల జాబితా
- అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితా
మూలాలు
మార్చు- ↑ Ugra, Sharda (24 December 2009). "1987-Gavaskar is the first to score 10,000 test runs: A 10 tonne toast". India Today. Archived from the original on 22 August 2015. Retrieved 23 April 2017.
- ↑ "Gary Sobers: Cricket's greatest genius". Rediff.com. 28 July 2010. Archived from the original on 24 January 2013. Retrieved 20 January 2013.
- ↑ "Third Test Match — India vs. England 1981–82". Wisden Cricketers' Almanack. Retrieved 22 August 2015.
- ↑ Botham, Ian (15 September 2009). Head On — Ian Botham: The Autobiography. Random House. ISBN 978-0-091-92149-1.
- ↑ 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 "Records / Test matches / Batting records / Most runs in career". ESPNcricinfo. Archived from the original on 9 October 2018. Retrieved 21 August 2015.
- ↑ Finlay, Ric (29 October 2008). "Record-holders for most Test runs". ESPNcricinfo. Archived from the original on 22 July 2012. Retrieved 29 January 2013.
- ↑ 7.0 7.1 7.2 7.3 "Records / Test matches / Batting records / Fastest to 10000 runs". ESPNcricinfo. Retrieved 31 May 2016.
- ↑ "Joe Root: England batter passes 10,000 Test runs". BBC Sport. 5 June 2022. Retrieved 6 June 2022.
- ↑ "Virat Kohli | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 31 December 2011. Retrieved 22 August 2015.
- ↑ "Ricky Ponting | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 26 August 2015. Retrieved 22 August 2015.
- ↑ "Jacques Kallis | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 22 August 2015. Retrieved 22 August 2015.
- ↑ "Rahul Dravid | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 31 December 2011. Retrieved 22 August 2015.
- ↑ "Alastair Cook | Cricket Players and Officials". ESPNcricinfo. Retrieved 3 September 2018.
- ↑ "Kumar Sangakkara | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 22 August 2015. Retrieved 22 August 2015.
- ↑ "Brian Lara | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 8 September 2013. Retrieved 22 August 2015.
- ↑ "Shivnarine Chanderpaul | Cricket Players and Officials". ESPNcricinfo. Retrieved 22 August 2015.
- ↑ "Mahela Jayawardene | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 24 August 2015. Retrieved 22 August 2015.
- ↑ "Joe Root | Cricket Players and Officials". ESPNcricinfo. Retrieved 5 June 2022.
- ↑ "Allan Border | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 1 August 2011. Retrieved 22 August 2015.
- ↑ "Steve Waugh | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 17 July 2012. Retrieved 22 August 2015.
- ↑ "Sunil Gavaskar | Cricket Players and Officials". ESPNcricinfo. Archived from the original on 16 August 2014. Retrieved 22 August 2015.
- ↑ "Younis Khan | Cricket Players and Officials". ESPNcricinfo. Retrieved April 24, 2017.