టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ వీరుల పట్టిక
టెస్ట్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్సులో బ్యాట్స్‌మెన్ 300 పరుగులకు పైగా స్కోరు సాధించిన వారి పేర్లు ఈ పట్టికలో ఇవ్వబడింది. ఈ ఘనతను 6 టెస్ట్ క్రికెట్ ఆడే దేశాలకు చెందిన 19 గురు బ్యాట్స్‌మెన్లు 21 సందర్భాల్లో సాధించారు. బంగ్లాదేశ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ల నుంచి ఇంతవరకు ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఒకే ఇన్నిగ్సులో 300 పరుగులు సాధించలేడు. న్యూజీలాండ్ కు చెందిన మార్టిన్ 1991 క్రో లో శ్రీలంక పై ఆడుతూ 299 పరుగుల వద్ద అవుటై ఈ అవకాశాన్ని వదులుకున్నాడు.
టెస్ట్ క్రికెట్ లో మొట్టమొదటి ట్రిపుల్ సెంచరీ సాధించిన ఘనత ఇంగ్లాండుకు చెందిన ఆండీ సాంధమ్కు దక్కింది. 1930 ఇతడు లో వెస్టిండీస్‌పై ఆడుతూ 325 పరుగులు సాధించాడు. కాగా భారత్ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్. 2004లో పాకిస్తాన్ పై ఆడుతూ 309 పరుగులు సాధించాడు. ఈ ఘనతను సాధించిన తాజా ఆటగాడు శ్రీలంకకు చెందిన మహేలా జయవర్థనే . 2005 ఇతను జూలైలో దక్షిణాఫ్రికా పై 374 పరుగులు చేసి ఈ ఘనత పొందాడు. బ్యాట్స్‌మెన్లు టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీలు సాధించడం బౌలర్లు హాట్రిక్ చేసిన సందర్భాల కన్నా తక్కువగా ఉన్నాయి. టెస్ట్ క్రికెట్ లో బౌలర్లు 36 పర్యాయాలు హాట్రిక్ లు సాధించగా బ్యాట్స్‌మెన్ల ట్రిపుల్ సెంచరీల సంఖ్య 21 మాత్రమే.
టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు ట్రిపుల్ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్లు ఆస్ట్రేలియాకు చెందిన డోనాల్డ్ బ్రాడ్‌మెన్, వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారా లు. వీరిరువురు చెరో 2 సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించారు. 1932లో బ్రాడ్‌మెన్ దక్షిణాఫ్రికాపై ఆడుతూ 299 పరుగుల వద్ద ఉండగా చివరి బ్యాట్స్‌మెన్ సున్నాకే అవుటవడంతో మరో ట్రిపుల్ సెంచరీ సాధించే అవకాశం కోల్పోయాడు.
బ్రియాన్ 2004 లారా లో ఇంగ్లాండు పై ఆడుతూ 400 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చి తన రెండో ట్రిపుల్ సెంచరీ ఘనతనే కాకుండా టెస్ట్ క్రికెట్ చరిత్ర లోనే ఏకైక క్వాడ్రుపుల్ సెంచరీ (400 పైబడి పరుగులు ) సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ గా చరిత్ర సృష్టించాడు.
ట్రిపుల్ సెంచరీల పట్టిక
మార్చుసంఖ్య | స్కోర్ | బ్యాట్స్‌మెన్ | దేశం | ప్రత్యర్థి | ఇన్నింగ్స్ | టెస్ట్ | వేదిక | తేది |
---|---|---|---|---|---|---|---|---|
30 | 303* | కరుణ్ నాయర్ | భారతదేశం | ఇంగ్లాండు | తొలి | 5 వ | చెన్నై | 2016 డిసెంబరు 16 |
29 | 302* | అజర్ అలి | పాకిస్తాన్ | వెస్ట్‌ఇండీస్ | తొలి | 1 వ | దుబాయ్ | 2016 అక్టోబరు 13 |
28 | 302 | బ్రెండన్ మెక్కల్లమ్ | న్యూజీలాండ్ | భారతదేశం | రెండవ | 2 వ | వెల్లింగ్ టన్ | 2014 ఫిబ్రవరి 18 |
27 | 319 | కుమార సంగక్కర | శ్రీలంక | బంగ్లాదేశ్ | తొలి | 2 వ | చిట్టగాంగ్ | 2014 ఫిబ్రవరి 05 |
26 | 311* | హషీం ఆమ్లా | దక్షిణాఫ్రికా | ఇంగ్లాండు | తొలి | 1 వ | లండన్ | 2012 జులై 19 |
25 | 329* | మైకెల్ క్లార్క్ | ఆస్ట్రేలియా | భారతదేశం | తొలి | 2 వ | సిడ్నీ | 2012 జనవరి 03 |
24 | 333 | క్రిస్ గేల్ | వెస్ట్‌ఇండీస్ | శ్రీలంక | తొలి | 1 వ | గల్లె | 2010 నవంబరు 15 |
23 | 313 | యూనిస్ ఖాన్ | పాకిస్తాన్ | శ్రీలంక | తొలి | 1 వ | కరాచి | 2009 ఫిబ్రవరి 21 |
22 | 319 | వీరేంద్ర సెహ్వాగ్ | భారతదేశం | దక్షిణాఫ్రికా | తొలి | 1 వ | చెన్నై | 2008 మార్చి 26 |
21 | 374 | మహేలా జయవర్థనే | శ్రీలంక | దక్షిణాఫ్రికా | తొలి | 1 వ | కొలంబో | 2006 జూలై (27,28,29) |
20 | 317 | క్రిస్ గేల్ | వెస్ట్‌ఇండీస్ | దక్షిణాఫ్రికా | తొలి | 4 వ | ఆంటిగ్వా | 2005 మే (1,2) |
19 | 400* | బ్రియాన్ లారా | వెస్ట్‌ఇండీస్ | ఇంగ్లాండు | తొలి | 4 వ | ఆంటిగ్వా | 2004 ఏప్రిల్ (10,11,12) |
18 | 309 | వీరేంద్ర సెహ్వాగ్ | భారతదేశం | పాకిస్తాన్ | తొలి | 1 వ | ముల్తాన్ | 2004 మార్చి(28,29) |
17 | 380 | మాథ్యూ హేడెన్ | ఆస్ట్రేలియా | జింబాబ్వే | తొలి | 1 వ | పెర్త్ | 2003 అక్టోబరు (9,10) |
16 | 329 | ఇంజమామ్-ఉల్-హక్ | పాకిస్తాన్ | న్యూజీలాండ్ | తొలి | 1 వ | లాహోర్ | 2002 మే (1,2) |
15 | 334* | మార్క్ టేలర్ | ఆస్ట్రేలియా | పాకిస్తాన్ | తొలి | 2 వ | పెషావర్ | 1998 అక్టోబరు (15,16) |
14 | 340 | సనత్ జయసూర్య | శ్రీలంక | భారతదేశం | తొలి | 1 వ | కొలంబో | 1997 ఆగస్టు (4,5,6) |
13 | 375 | బ్రియాన్ లారా | వెస్ట్‌ఇండీస్ | ఇంగ్లాండు | తొలి | 5 వ | ఆంటిగ్వా | 1994 ఏప్రిల్ (16,17,18) |
12 | 333 | గ్రాహం గూచ్ | ఇంగ్లాండు | భారతదేశం | తొలి | 1 వ | లార్డ్స్ | 1990 జూలై (26,27) |
11 | 302 | లారెన్స్ రో | వెస్ట్‌ఇండీస్ | ఇంగ్లాడు | తొలి | 3 వ | బ్రిడ్జిటౌన్ | 1974 మార్చి (7,9,10) |
10 | 307 | బాబ్ కావ్‌పర్ | ఆస్ట్రేలియా | ఇంగ్లాడు | తొలి | 5 వ | మెల్బోర్న్ | 1966 ఫిబ్రవరి (12,14,16) |
9 | 310* | జాన్ ఎడ్రిచ్ | ఇంగ్లాండు | న్యూజీలాండ్ | తొలి | 3 వ | లీడ్స్ | 1965 జూలై (7,8,9) |
8 | 311 | బాబ్ సింమ్సన్ | ఆస్ట్రేలియా | ఇంగ్లాండు | తొలి | 4 వ | మాంచెస్టర్ | 1964 జూలై (23,24,25) |
7 | 365* | గారీఫీల్డ్ సోబర్స్ | వెస్ట్‌ఇండీస్ | పాకిస్తాన్ | తొలి | 3 వ | కింగ్‌స్టన్ | ఫిబ్రవరి (27,28), మార్చి (1)1958 |
6 | 337 | హనీఫ్ మహ్మద్ | పాకిస్తాన్ | వెస్ట్‌ఇండీస్ | రెండవ | 1 వ | బ్రిడ్జిటౌన్ | 1958 జనవరి (20,21,22,23) |
5 | 364 | లెన్ హట్టన్ | ఇంగ్లాండు | ఆస్ట్రేలియా | తొలి | 5 వ | లండన్ | 1938 ఆగస్టు (20,22,23) |
4 | 304 | డోనాల్డ్ బ్రాడ్‌మన్ | ఆస్ట్రేలియా | ఇంగ్లాడు | తొలి | 4 వ | లీడ్స్ | 1934 జూలై (21,23) |
3 | 336* | వాలీ హమ్మండ్స్ | ఇంగ్లాండు | న్యూజీలాండ్ | తొలి | 2 వ | ఆక్లాండ్ | 1933 మార్చి (31) ఏప్రిల్ (1) |
2 | 334 | డోనాల్డ్ బ్రాడ్‌మన్ | ఆస్ట్రేలియా | ఇంగ్లాండు | తొలి | 3 వ | లీడ్స్ | 1930 జూలై (11,12) |
1 | 325 | ఆండీ సాంధమ్స్ | ఇంగ్లాండు | వెస్ట్‌ఇండీస్ | తొలి | 4 వ | కింగ్‌స్టన్ | 1930 ఏప్రిల్ (4,5) |