తాన్యా హోప్

దక్షిణ భారత చలనచిత్ర నటి
(తాన్యా హోప్‌ నుండి దారిమార్పు చెందింది)

తాన్యా హోప్‌ దక్షిణ భారత చలనచిత్ర నటి.[1] 2016లో వచ్చిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో సినిమారంగంలోకి అడుగుపెట్టింది.

తాన్యా హోప్‌
Tanya Hope audio launch.jpg
తడమ్ సినిమా పాటల ఆవిష్కరణలో తాన్యా హోప్‌
జననంసెప్టెంబరు 11, 1996
బెంగళూరు, కర్నాటక, భారతదేశం
నివాసంముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతదేశం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2015–ప్రస్తుతం
కుటుంబంరవి పురవంకర (తండ్రి)

జననం - విద్యాభ్యాసంసవరించు

తాన్యా హోప్ 1996, సెప్టెంబరు 11న కర్నాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తండ్రి రవి పురవంకర వ్యాపారవేత్త. బెంగళూరులోని సేక్రేడ్ హార్ట్ గర్ల్స్ హైస్కూలులో పాఠశాల విద్యను పూర్తిచేసిన తాన్యా, ఇంగ్లాండులోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాల కోర్సులో గ్రాడ్యుయేషన్ చదివింది.[2]

మోడలింగ్ రంగంసవరించు

పూణేలో టియారా ట్రైనింగ్ స్టూడియోలో మోడలింగ్‌లో శిక్షణకు తీసుకున్న తాన్యా, 2015లో ఫెమినా మిస్ ఇండియా కోల్‌కతాను గెలుచుకుంది.[3][4] అదే సంవత్సరం ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్‌గా నిలిచింది.

సినిమారంగంసవరించు

2016 సంవత్సరంలో అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో నిత్య పాత్రతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.[5][6] ఆ తర్వాత 2017లో జగపతి బాబు నటించిన పటేల్ సర్ సినిమాలో ఏసిపి కాథరీన్ పాత్రలో నటించింది. మాడిజ్ తిరుమేని దర్శకత్వం వహించిన తడమ్ చిత్రంతో తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టి విద్యా ప్రదీప్, స్మృతి వెంకట్‌లతో పాటు ముగ్గురు హీరోయిన్లలో ఒకరుగా నటించింది.[7] సుజయ్ కె శ్రీహరి దర్శకత్వంలో ఉపేంద్ర నటించిన తెలుగు, కన్నడ ద్విభాష చిత్రం హోమ్ మినిస్టర్ సినిమాలో జెస్సీ పాత్రలో నటించింది.[8] పేపర్ బాయ్ సినిమాలో సంతోష్ శోభన్‌తో కలిసి నటించింది.

దర్శన్ నటించిన 51వ చిత్రం యజమానలో ప్రధానపాత్రలో నటించింది. పాట బసన్నీలో పాత్రలో కనిపించింది.[9]

నటించిన సినిమాలుసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు మూలాలు
2016 అప్పట్లో ఒకడుండేవాడు నిత్య తెలుగు తెలుగు తొలి చిత్రం [10]
నేను శైలజ తాన్యా హోప్ అతిథి పాత్ర [11]
2017 పటేల్ సర్ ఏసిపి కాథరీన్ [12]
2018 పేపర్ బాయ్ మేఘ ప్రధాన పాత్రలో తొలిచిత్రం [13]
2019 తడమ్ దీపిక తమిళం తమిళ తొలిచిత్రం [14]
యజమాన గంగ కన్నడ కన్నడ తొలిచిత్రం [15]
ఉద్గర్శ కరిష్మా
అమర్ బాబీ
2020 ఖాకీ లాస్య కన్నడ
డిస్కో రాజా[16][17] పరిణితి తెలుగు [18]
హోమ్ మినిస్టర్ జెస్సీ కన్నడ నిర్మాణంలో ఉంది [19]
దారాల ప్రభు తమిళం చిత్రీకరణలో ఉంది

మూలాలుసవరించు

 1. "Tanya Hope Biography". filmibeat.com. మూలం నుండి 20 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 2. "India Times - Miss India Kolkata". indiatimes.com. మూలం నుండి 15 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 3. "Interview – Indiatimes". beautypageants.indiatimes.com. మూలం నుండి 20 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 4. "India Times - Miss India Kolkata". indiatimes.com. మూలం నుండి 15 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 5. "Appatlo Okadundevadu was challenging: Tanya Hope". thehansindia.com. మూలం నుండి 15 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 6. "Tanya Hope to make Telugu debut with 'Appatlo Okadundevadu'". timesofindia.indiatimes.com. మూలం నుండి 20 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 7. "India Glitz Three Heroines in Thadam". indiaglitz.com. మూలం నుండి 17 October 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 8. "Tanya Hope's going Places". deccanchronicle.com. మూలం నుండి 12 February 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 9. "Tanya Hope as Basanni in Darshan's Yajamana". The New Indian Express. మూలం నుండి 15 August 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020.
 10. "review – 123telugu". 123telugu.com. మూలం నుండి 4 February 2017 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 11. "Tanya Hope In Ravi Teja's Next - 123telugu.com". www.123telugu.com. మూలం నుండి 2 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020.
 12. "review – Deccanchronicle". deccanchronicle.com. మూలం నుండి 20 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 13. "review –Thehindu". thehindu.com. మూలం నుండి 2 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 14. "review – Timesofindia". timesofindia.com. మూలం నుండి 2 April 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 15. "review – Newindianexpress". newindianexpress.com. మూలం నుండి 15 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)
 16. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)
 17. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". మూలం నుండి 25 జనవరి 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 24 January 2020. Cite news requires |newspaper= (help)
 18. "Tanya Hope to play scientist in Ravi Teja's Disco Raja". The New Indian Express. మూలం నుండి 15 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020.
 19. "review – newindianexpress". newindianexpress.com. మూలం నుండి 20 March 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 25 January 2020. Cite web requires |website= (help)

ఇతర లంకెలుసవరించు