తాయారమ్మ బంగారయ్య ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు కలిసి నిర్మించిన చిత్రం. ఈ చిత్రాన్ని 1982లో బి.నాగిరెడ్డి గారి విజయా ప్రొడక్షన్స్ సంస్థ హిందీలో శ్రీమాన్ శ్రీమతి పేరుతో పునర్మించింది.

తాయారమ్మ బంగారయ్య
(1979 తెలుగు సినిమా)
Tayaramma Bangarayya.jpg
దర్శకత్వం కొమ్మినేని శేషగిరిరావు
తారాగణం కైకాల సత్యనారాయణ ,
షావుకారు జానకి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథసవరించు

అనాదిగా వస్తున్న సంప్రదాయాలను మన్నించి అదే పోకడలో పోవాలనుకునే యువతీయువకులు రాణి, మధు కాగా ఆధునిక నాగరికత మోజులో పడిపోయినవారు సుధాకర్, అరుణలు. వారికి వారే జీవిత భాగస్వాములైతే కథే లేదు. ఎటొచ్చి తారుమారు అయినప్పుడే వచ్చే తంటా అల్లా. తమకు సరిపడని వారితో వివాహాలు జరిగిపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురై సుఖశాంతులకు దూరం అవుతారు. ఆ రెండు కుటుంబాలకు అదృష్టవశాత్తు తాయారమ్మ, బంగారయ్యల జంట వారికి దగ్గరై ఎన్నో ప్రయత్నాలు చేసి వారిని సరిదిద్దగలుగుతారు. వారి చేతలు, మాటలు ఒకసారి కడుపుబ్బ నవ్వించగా, మరొక సారి జీవితాలకు ఒక అర్థాన్ని చెప్పేవిగా ఉంటాయి.

తన పట్టుదలతో చివరకు ఒక యువకునిచే భంగపడే స్థితి వరకు వచ్చిన అరుణ, తన పోరువల్లే నాగరికత పేరుతో దురవాట్లను నేర్చుకుంటూ చివరకు పండగనాడు కూడా పాత మొగుడేనా అని తన భార్య ఎదురు ప్రశ్నించే స్థితి వచ్చాక కాని సుధాకర్ లకు తమ తప్పిదాలేమిటో తెలిసి రాలేదు.

తాయారమ్మ, బంగారయ్యలు ఆ కుటుంబాలను సరిదిద్దడానికి వెనుకగల ప్రబల కారణాలేమిటి అనేది కథ చివరలో తెలుస్తుంది[1].

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  1. ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని ఆటబొమ్మగ చేశాడు మగవాడు - పి.సుశీల, జి.ఆనంద్
  2. ఒరే ఒరే ఒరే ఊరుకోరా ఊరడించేందుకు అమ్మ లేదురా ఉయ్యాల ఉన్నది - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  3. గుడిసె పీకి మేడమీద వెయ్యాలి లేదా మేడోచ్చి గుడిసెతోటి కలవాలి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  4. నీకోసం కాదురా నిన్ను మోసికన్నది పేగుతెంచుకున్న ( బిట్ ) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  5. మై నేమ్ ఈజ్ బంగారయ్య నే చెప్పిందే బంగారమయ్య - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల

మూలాలుసవరించు

  1. ఎం.ఎస్. (20 January 1979). "చిత్రసమీక్ష - తాయారమ్మ బంగారయ్య". ఆంధ్రపత్రిక దినపత్రిక (సంపుటి 65, సంపుటి 285). Retrieved 8 December 2017. CS1 maint: discouraged parameter (link)

బయటిలింకులుసవరించు