తాళ్ల ప్రొద్దుటూరు

ఆంధ్ర ప్రదేశ్, వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలంలోని గ్రామం

తాళ్ల ప్రొద్దుటూరు, వైఎస్‌ఆర్ జిల్లా, కొండాపురం మండలానికి చెందిన గ్రామం.

తాళ్ల ప్రొద్దుటూరు
—  రెవిన్యూ గ్రామం  —
తాళ్ల ప్రొద్దుటూరు is located in Andhra Pradesh
తాళ్ల ప్రొద్దుటూరు
తాళ్ల ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 14°50′21″N 78°09′05″E / 14.839221°N 78.151363°E / 14.839221; 78.151363
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం కొండాపురం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,431
 - పురుషులు 2,213
 - స్త్రీలు 2,218
 - గృహాల సంఖ్య 1,157
పిన్ కోడ్ 516474
ఎస్.టి.డి కోడ్

కడప-తాడిపత్రి మార్గంపైన ఉన్న ఈ గ్రామం కొండాపురం మండలంలోని ప్రముఖ పట్టణం.

2001 జనగణనలో ఈ గ్రామం యొక్క జనాభా 3,780. మండలాలేర్పడక ముందు జమ్మలమడుగు తాలూకాలో తాళ్ళ ప్రొద్దుటూరు ఫిర్కాకు ముఖ్యపట్టణంగా ఉన్నది. 1985లో మండలాలేర్పడిన తర్వాత మండలకేంద్రము కొండాపురానికి మార్చారు.

గ్రామ చరిత్రసవరించు

చారిత్రకంగా మండలంలో కొండాపురం కంటే తాళ్ళప్రొద్దుటూరే ప్రముఖమైనది. తాళ్ళప్రొద్దుటూరు విజయనగర కాలం నాటి శాసనాలలో ప్రస్తావించబడింది. ఇక్కడ కాకతీయుల కాలంనుండి విజయనగరరాజుల వరకు అనేక శాసనాలు కూడా లభ్యమయ్యాయి.[1][2] ఇది మండల కేంద్రమైన కొండాపురం నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాడిపత్రి నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1157 ఇళ్లతో, 4431 జనాభాతో 1123 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2213, ఆడవారి సంఖ్య 2218. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 592 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 21. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 592799[3].పిన్ కోడ్: 516 474.

మండలాలేర్పడక ముందు జమ్మలమడుగు తాలూకాలో తాళ్ళ ప్రొద్దుటూరు ఫిర్కాకు ముఖ్యపట్టణంగా ఉన్నది. 1985లో మండలాలేర్పడిన తర్వాత మండల కేంద్రము కొండాపురానికి మార్చారు.

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామ పంచాయతీసవరించు

ఎన్నికైన మాజీ సర్పంచులుసవరించు

1934 నుండి 2001 వరకు మిట్ట కుటుంబీకులు 67 ఏళ్లపాటు నిరవధికంగా గ్రామానికి సర్పంచులుగా, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 • మిట్టా మల్లారెడ్డి (1934 - 1952)
 • మిట్టా చిన్నమల్లారెడ్డి (1952 - 1981)
 • మిట్టా చిన్న అంకిరెడ్డి (1981 - 2001)
 • ఆదినారాయణ యాదవ్ (2001 - 2005)
 • ఏ. రమాదేవి (2005 - 2013)
 • ఎస్.రామసుబ్బారెడ్డి (2013 - )

విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల తాళ్ళప్రొద్దటూరు లోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల‌లు , మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం తాడిపత్రి లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కడప లోనూ, సమీప వైద్య కళాశాల అనంతపురం లోను, ఉన్నాయి.

వైద్య సౌకర్యంసవరించు

ప్రభుత్వ వైద్య సౌకర్యంసవరించు

తాళ్ళప్రొద్దటూరులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యంసవరించు

గ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరుసవరించు

గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యంసవరించు

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలుసవరించు

తాళ్ళప్రొద్దటూరులో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగుసవరించు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, వారం వారం సంత ఉన్నాయి. పౌర సరఫరాల వ్యవస్థ దుకాణం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలుసవరించు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. గ్రామంలో సినిమా హాలు ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. అంగన్ వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

విద్యుత్తుసవరించు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగంసవరించు

తాళ్ళప్రొద్దటూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 24 హెక్టార్లు
 • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 67 హెక్టార్లు
 • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 71 హెక్టార్లు
 • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 31 హెక్టార్లు
 • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 20 హెక్టార్లు
 • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 55 హెక్టార్లు
 • బంజరు భూమి: 129 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 726 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 427 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 483 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలుసవరించు

తాళ్ళప్రొద్దటూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • బావులు/బోరు బావులు: 483 హెక్టార్లు

ఉత్పత్తిసవరించు

తాళ్ళప్రొద్దటూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలుసవరించు

వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

1. తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామానికి ఉత్తరదిశలో మూడుమైళ్ళ దూరంలో ఉన్న బాలప్పకోన దక్షిణ భూకైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి భూగర్భంలో ఉన్న బాలమల్లేశ్వరాలయం ప్రసిద్ధి చెందినది.[4] మిట్టా కుటుంబీకులు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటు వచ్చారు.[5] ఈ కోనలో, 2014, జూన్-19, గురువారం నాడు, శ్రీ దత్తాత్రేయ, శ్రీ షిర్డీ సాయిబాబా వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. [ఈనాడు కడప/జమ్మలమడుగు; 2014,జూన్-20;2వ పేజీ]

2. తాళ్ళ ప్రొద్దుటూరు సమీప రైల్వేస్టేషను ఉన్న రేగడిపల్లెకు రెండు మైళ్ళు ఉత్తరాన పెన్నానది దక్షిణపు ఒడ్డున ఉన్నది. గ్రామంలో తొగట, పద్మశాలి, ముస్లిం నేత వృత్తికారులు నివసిస్తున్నారు. గ్రామానికి పశ్చిమాన రెండు మహమ్మదీయ సమాధులు ఉన్నాయి. వీటి గురించి ఒక విచిత్రమైన కథ ప్రచారంలో ఉన్నది. అందులో ఒక సమాధి ఒక సూఫీ ఔలియాది, రెండవది ఆయన ఏలుక సమాధి. ఔలియా నిరంతరం నమాజు చేస్తూ గడిపేవాడంట. ఒక రోజు ఔలియా ఏలుక ఒక మహమ్మదీయుని ఇంటికి వెళ్ళి తినటానికి వండుకున్న అన్నాన్ని తినేసిందట. దానితో కోపోద్రిక్తుడైన మహమ్మదీయుడు ఒక కట్టెతో ఎలుకను బాది చంపివేశాడట. తరువాత తేరుకుని, ఔలియా ప్రతిస్పందనకు బయపడి, ఎలుక శరీరంతో పాటు ఔలియా వద్దకు వచ్చి జరిగిన సంఘటనను వివరించాడట. అది విని నిశ్తేజితుడై ఔలియా ప్రాణాలు విడచాడట. ఆ పాపానికి మహమ్మదీయుడు పశ్చాత్తాపపడి ఆ రెండు సమాధులను కట్టించాడని కథనం. ఇప్పటికీ ఈ రెండు సమాధుల నిర్వహణను ఆ మహమ్మదీయుని సంతతి వారు చూసుకుంటున్నారు..[6][1]

3. శ్రీ గంగమ్మ తల్లి ఆలయం.

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 4,431 - పురుషుల సంఖ్య 2,213 - స్త్రీల సంఖ్య 2,218 - గృహాల సంఖ్య 1,157

మూలాలుసవరించు

 1. The Kakatiyas of Warangal By Putcha Vasudeva Parabrahma Sastry పేజీ.110 [1]
 2. The early history of the Deccan By Ghulam Yazdani
 3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-04. Retrieved 2010-10-10.
 5. http://balappakona.com/Presidents.htm[permanent dead link]
 6. District gazetteer, Cuddapah By C. F. Brackenbury

వెలుపలి లంకెలుసవరించు

https://web.archive.org/web/20150207104629/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20