తిరుగుబాటు (1950 సినిమా)

1950 సినిమా

తిరుగుబాటు 1950, మార్చి 19న విడుదలైన తెలుగు సినిమా.

తిరుగుబాటు
(1950 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
శాంతకుమారి,
సి.కృష్ణవేణి,
లలిత,
పద్మిని,
ముక్కామల కృష్ణమూర్తి
గీతరచన సముద్రాల రాఘవాచార్య
నిర్మాణ సంస్థ రాగిణీ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ
సినిమా ప్రకటన

నటీనటులు

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

సంక్షిప్త చిత్రకథ

మార్చు

మధ్యతరగతికి చెందిన ప్రసాద్, ఆనందమయి తమ ఇద్దరు పిల్లలతో హాయిగా జీవితం సాగిస్తుంటారు. మైకా వ్యాపారం చేయాలన్న ప్రయత్నంలో పడి ఆస్తి సర్వస్వం కోల్పోయి నిరుపేదలౌతారు. కానీ భగవంతుని కృపవల్ల పరిస్థితులు మెరుగుపడి సంపన్నులవుతారు. కానీ అనూరాధ అనే వేశ్య మోజులో పడి ప్రసాద్, తన భార్యాబిడ్డలని నిరాదరిస్తాడు. వారు విధిలేక మద్రాసు వెళ్ళి అనాథాశ్రమం నడిపే రామదాసు పంతులు పంచన చేరుతారు. కోర్టులో కేసు వేసి పిల్లలను తన వద్దకు రప్పించుకుంటాడు ప్రసాద్. తల్లి మీద బెంగతో పిల్లలు చిక్కిపోతారు. ప్రసాద్ కూడా క్షయవ్యాధికి గురి అవుతాడు. ఇంటి పెత్తనం చెలాయించే అనూరాధ ఆస్తినంతా కాజేయడానికి కుట్ర పన్నుతుంది. దీనిని గ్రహించిన మైకా గని కార్మికులంతా ఆనందమయి తరఫున నిలబడి ప్రసాద్‌పై తిరుగుబాటు చేస్తారు. అనూరాధను తన్ని తరిమేస్తారు. ప్రసాద్ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి తిరిగి ఆనందమయిని స్వీకరిస్తాడు. అందరూ కలుసుకోవడంతో కథ సుఖాంతమౌతుంది.[1]

పాటలు

మార్చు

ఈ చిత్రంలో మొత్తం 15 పాటలున్నాయి. ఈ పాటలన్నింటినీ సముద్రాల సీనియర్ రచించాడు.

మూలాలు

మార్చు
  1. వి.వి.రామారావు (2009). జీవితమే సఫలము 2వ సంపుటి (1 ed.). హైదరాబాదు: క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్. p. 49.

బయటిలింకులు

మార్చు