తీగలపహాడ్

భారతదేశంలోని గ్రామం

తీగలపహాడ్, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలానికి చెందిన జనగణన పట్టణం, రెవిన్యూ గ్రామం. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని మంచిర్యాల మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన నస్పూర్ మండలం లోకి చేర్చారు. [2]ఈ పట్టణం నస్పూర్ పురపాలక సంఘంలో భాగంగా ఉంది.[3]

తీగలపహాడ్
తీగలపహాడ్ is located in Telangana
తీగలపహాడ్
తీగలపహాడ్
తెలంగాణలో ప్రాంతం ఉనికి
తీగలపహాడ్ is located in India
తీగలపహాడ్
తీగలపహాడ్
తీగలపహాడ్ (India)
నిర్దేశాంకాలు: 19°40′00″N 78°32′00″E / 19.6667°N 78.5333°E / 19.6667; 78.5333
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామంచిర్యాల జిల్లా
విస్తీర్ణం
 • మొత్తం2.80 km2 (1.08 sq mi)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం12,656
 • సాంద్రత4,500/km2 (12,000/sq mi)
భాష
 • అధికార భాషతెలుగు
కాలమానంUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్

భౌగోళికం సవరించు

తీగలపహాడ్ పట్టణ విస్తీర్ణం 2.80 కి.మీ2 (1.08 చ. మై) గా ఉంది.

సమీప ప్రాంతాలు సవరించు

ఇక్కడికి సమీపంలో నస్పూర్, తిలక్ నగర్, మంచిర్యాల, శ్రీశ్రీ నగర్, ర్యాలి, నాగారం, గధ్‌పూర్, గుడిపేట, సుబ్బపల్లి, పెద్దంపేట, దొనబండ, కర్ణమామిడి, కొండేపల్లి, రాపల్లి, హాజీపూర్, చందనాపూర్, వేంపల్లి గ్రామాలు ఉన్నాయి.[4]

జనాభా గణాంకాలు సవరించు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం,[5] తీగలపహాడ్ పట్టణంలో 33,070 మంది జనాభా ఉన్నారు. అందులో పురుషులు 51% మంది కాగా స్త్రీలు 49% మంది ఉన్నారు. తీగలపహాడ్ సగటు అక్షరాస్యత రేటు 64% కాగా, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 71% కాగా, స్త్రీల అక్షరాస్యత 55% గా ఉంది. తీగలపహాడ్‌లోని జనాభాలో 11% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సుగలవారు ఉన్నారు.

ప్రార్థనా మందిరాలు సవరించు

  • పోచమ్మ దేవాలయం
  • శ్రీ సిద్ధి వినాయక దేవాలయం
  • జామ్ మసీదు
  • నూరి మసీదు

రవాణా సవరించు

ఇక్కడికి సమీపంలోని మంచిర్యాల, రవీంద్రఖని ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మంచిర్యాల నుండి తీగల్‌పహాడ్‌కు రోడ్డు కనెక్టివిటీ ఉంది.[6]

మూలాలు సవరించు

  1. 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. pp. 13, 30. Retrieved 10 June 2016.
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. "నస్పూర్ మున్సిపాలిటీ పరిధి లో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు". www.publicvibe.com. Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  4. "తీగలపహాడ్(CT)(గ్రామము) | INS Media". www.ins.media (in ఇంగ్లీష్). Archived from the original on 2021-10-27. Retrieved 2021-10-27.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
  6. "Teegalpahad Village". www.onefivenine.com. Retrieved 2021-10-27.

వెలుపలి లంకెలు సవరించు