తీగల అనితారెడ్డి
తీగల అనితారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్యురాలు, రాజకీయ నాయకురాలు. ఆమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గా పని చేస్తుంది.[2]
తీగల అనితారెడ్డి | |||
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 నుండి ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 10 జూన్ 1949 అనాజ్‌పూర్ గ్రామం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | తీగల హరినాథ్ రెడ్డి | ||
బంధువులు | తీగల కృష్ణారెడ్డి (మామ) [1] | ||
నివాసం | తిరుమల హిల్స్, ఆస్మాన్ గడ్ , మలక్‌పేట, హైదరాబాదు |
జననం,విద్యాభాస్యం
మార్చుతీగల అనితారెడ్డి తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, అనాజ్‌పూర్ గ్రామంలో ఆండాళమ్మ, స్వామిరెడ్డి దంపతులకు జన్మించింది. ఆమె కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గాలోని ఎంఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ పూర్తి చేసింది.
వృత్తి జీవితం
మార్చుడా. తీగల అనితారెడ్డి కర్ణాటక లో ఎంబీబీఎస్ పూర్తి చేశాక హైదరాబాద్ లోని ఓవైసీ ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న దక్కన్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేసింది. ఆమె తర్వాత రెండేళ్లు మహబూబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసింది. అనిత 2010లో హైదరాబాద్ దిల్‍సుఖ్‍నగర్ లో టీకేఆర్ ఐకాన్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని పెట్టింది. ఆమె ఆసుపత్రిలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించేది.[3]
రాజకీయ జీవితం
మార్చురాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన తీగల అనితారెడ్డి 2016లో జరిగిన గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో ఆర్‌కేపురం డివిజన్ కార్పోరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యింది. ఆమె ఆర్ట్ (అనితారెడ్డి తీగల) ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వివిధ సామజిక కార్యక్రమాలు నిర్వహించింది. తీగల అనితారెడ్డి 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహేశ్వరం జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచి రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయింది.[4]
తీగల అనితారెడ్డి 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల అనంతరం 2024 ఫిబ్రవరి 25న బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది.[5]
మూలాలు
మార్చు- ↑ Sakshi (11 June 2019). "నాకు రాజకీయ జన్మనిచ్చింది మామే." Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ The Hans India (5 July 2019). "ZP chairperson, ZPTC members swear-in". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ Sakshi (16 June 2019). "కొడుకు లేని లోటును తీరుస్తున్నాం." Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ Sakshi (30 June 2019). "వైద్యురాలిగా.. ప్రజా ప్రతినిధిగా." Sakshi. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ V6 Velugu (25 February 2024). "బీఆర్ఎస్కు తీగల కృష్ణారెడ్డి రాజీనామా". Archived from the original on 25 February 2024. Retrieved 25 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)