తెలంగాణ ప్రెస్ అకాడమీ

తెలంగాణ ప్రెస్ అకాడమీ, తెలంగాణ రాష్ట్రంలో జర్నలిజాన్ని ప్రోత్సమించడంకోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంస్థ. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం చారిత్రాత్మకంగా ఏర్పడిన వెంటనే మీడియా అకాడమీ ఆఫ్ తెలంగాణ (ఆంగ్లం: Media Academy Of Telangana) స్థాపించబడింది. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ “ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, 2001 కింద రిజిస్ట్రేషన్ నంబర్: 570/2014 కింద రిజిస్టర్ చేయబడింది. దీనికి ప్రఖ్యాత జర్నలిస్ట్ అల్లం నారాయణను ప్రభుత్వం చైర్మన్‌గా నియమించింది.

తెలంగాణ ప్రెస్ అకాడమీ
Telangana State Press Academy Logo.jpg
తెలంగాణ ప్రెస్ అకాడమీ లోగో
స్థాపన2014
రకంతెలంగాణ ప్రభుత్వ సంస్థ
కేంద్రీకరణజర్నలిస్టుల సంక్షేమం
కార్యస్థానం
ముఖ్యమైన వ్యక్తులుఅల్లం నారాయణ (చైర్మన్)
జాలగూడుwww.pressacademy.telangana.gov.in

విధి విధానాలుసవరించు

 
2015లో జర్నలిస్టుల కోసం నల్గొండలో నిర్వహించిన మీడియా వర్క్‌షాప్ లో ప్రసంగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

జర్నలిజంలో అత్యున్నతమైన ప్రమాణాలను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. కమ్యూనికేషన్ మీడియా ద్వారా సమాజానికి సహాయపడే విలువలను పెంపొందించడం కూడా దీని ఉద్దేశం. ఈ రంగంలో తెలంగాణ నుండి తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషలలో అనేక వార్తాపత్రికలు, పత్రికలు, మీడియా సంస్థలు దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందాయి. ఈ ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు జాతీయ పత్రికలలో సంపాదకులుగా పనిచేశారు. విదేశాలలో కూడా అవార్డులు గెలుచుకున్నారు.

చైర్మన్ పదవిసవరించు

2014 జూలై 14న తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ గా అల్లం నారాయణ నియమితులయ్యారు.[1] జర్నలిస్టులకు ఇండ్లు, హెల్త్‌కార్డులు, అక్రెడిటేషన్ల మంజూరు విషయమై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి నుండి ప్రెస్ అకాడమీకి వచ్చిన రూ.20 కోట్ల నిధులతో జర్నలిస్టుల సంక్షేమనిధిని ఏర్పాటుచేసారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికాలం 2016 జూలై 13తో ముగియడంతో, అతని పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు ప్రభుత్వం పొడిగించింది.[2] ఆ తరువాత తిరిగి ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ పదవీకాలాన్ని పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.[3] 2022 జూన్ 30వ తేదీతో ముగిసిన ఈ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. 2022, జులై 1 నుంచి 2024 జూన్ 30 వ‌ర‌కు మీడియా అకాడమీ చైర్మన్‌గా పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌ పదవిని పొడిగించ‌డం ఇది మూడోసారి.[4]

వర్క్ షాప్ 2022సవరించు

చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన తెలంగాణ ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పాత్రికేయులకు 2022 ఏప్రిల్ 23, 24 తేదీలలో రెండ్రోజుల వర్క్ షాప్ నిర్వహించారు.

ఈ కార్యక్రమం ప్రారంబోత్సవంలో రాష్ట్ర మం త్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి వారు కృషి చేస్తామన్నారు.[5] ముగింపు కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం హర్షణీయమని కవిత వెల్లడించారు. జర్నలిస్టులు విశ్వసనీయతకు కట్టుబడి వార్తలు రాయాలన్నారు.[6]

ఇవీ చదవండిసవరించు

మూలాలుసవరించు

  1. నమస్తే ఆంధ్ర. "ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ". namastheandhra.com. Retrieved 18 November 2016.[permanent dead link]
  2. www.namasthetelangaana.com (14 July 2016). "అల్లం నారాయణ పదవీకాలం పొడిగింపు". Archived from the original on 15 జూలై 2016. Retrieved 18 November 2016.
  3. Telugu, TV9 (2019-07-30). "ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవీకాలం పొడిగింపు". TV9 Telugu. Retrieved 2022-04-25.
  4. telugu, NT News (2022-08-08). "మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ పదవీ కాలం పొడిగింపు". Namasthe Telangana. Archived from the original on 2022-08-08. Retrieved 2022-08-09.
  5. telugu, NT News (2022-04-24). "మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి". Namasthe Telangana. Retrieved 2022-04-25.
  6. "మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ప్రారంభం". Sakshi. 2022-04-23. Retrieved 2022-04-25.

బయటి లింకులుసవరించు