తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. ప్రతి సంవత్సరం మార్చిలో నిర్వహించే తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెడుతాడు.

 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
Submitted toతెలంగాణ శాసనసభ
Parliamentతెలంగాణ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి

సంవత్సరాల వారిగా

మార్చు
 
శాసనసభలో 2019-2020 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్

తొలి బడ్జెట్ (2014-2015) :

2014-15 వార్షిక సంవత్సరంలో పది నెలల కాలానికి 2014 నవంబరు 5న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[1] తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తొలి బడ్జెటును ప్రవేశపెడుతున్నందుకు గర్వపడుతున్నానని పేర్కొంటూ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. సమావేశ ప్రారంభంలోనే విపక్షాలు నిరసన తెలుపగా, ఆ నిరసనల మధ్యే రాజేందర్ గంటపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.[2]

తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,00,637.96 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం: రూ.48,648.47 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం: రూ.51,989.49 కోట్లుగా అంచనా వేయబడింది.[3] ఈ బడ్జెటులో నీటిపారుదల రంగానికి రూ. 9,407 కోట్లు, వ్యవసాయరంగానికి రూ. 8,511 కోట్లు, రైతుల రుణమాఫీకి రూ. 4,250 కోట్లు, చెరువుల పునరుద్ధరణకు రూ. 2,000 కోట్లు, రహదారుల అభివృద్ధికి రూ. 4,000 కోట్లు, ఆరోగ్యరంగానికి రూ. 2,282 కోట్లు, అమరవీరుల కుటుంబాలకు రూ. 100 కోట్లు, పింఛన్లకు రూ. 6,580 కోట్లు, నియోజకవర్గం అభివృద్ధి నిధులు కోటిన్నర, విద్యారంగానికి రూ. 10,956 కోట్లు, సామాజికరంగానికి రూ. 23,000 కోట్లు, ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 20,000 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ మొత్తం ఆదాయం రూ. 80,090.33 కోట్లుగా, రాష్ట్ర ప్రభుత్వ మొత్తం వ్యయాన్ని రూ. 79,789.31 కోట్లుగా చూపించారు.[4][5]

రెండవ బడ్జెట్ (2015-2016) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2015 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2015 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ తన తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[6] తెలంగాణ బడ్జెట్ విలువ రూ.1,15,689.19 కోట్లు కాగా, ప్రణాళిక వ్యయం: రూ.52,383.19 కోట్లుగా, ప్రణాళికేతర వ్యయం: రూ.63,306 కోట్లుగా అంచనా వేయబడింది.[7]

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలకు ఈ బడ్జెట్‌లో రూ.11,450 కోట్లు కేటాయించారు. దళిత సంక్షేమశాఖకు రూ. 5547 కోట్లు (విద్యాభివృద్ధికి రూ. 2832 కోట్లు, కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.157 కోట్లు), గిరిజనులకు రూ. 2878 కోట్లు (కళ్యాణ లక్ష్మి పథకానికి రూ. 80 కోట్లు), బీసీ కార్పొరేషన్‌కు రూ. 114 కోట్లు (రాజీవ్ అభ్యుదయ పథకానికి రూ.41 కోట్లు, వసతి గృహాలకు రూ.111 కోట్లు, బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.20 కోట్లు), మైనారిటీ సంక్షేమానికి రూ.1100 కోట్లు (షాదీ ముబారక్ పథకంకు రూ. 100 కోట్లు, బహుళ అభివృద్ధి పథకానికి రూ. 105 కోట్లు) గా కేటాయించబడ్డాయి.[8]

మూడవ బడ్జెట్ (2016-2017) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2016 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2016 మార్చి 14న ఉదయం 11.35 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[9] 1,30,415.87 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టగా, 62,785 కోట్ల రూపాయలు ప్రణాళికేతర వ్యయం, 67,630 కోట్లు రూపాయలు ప్రణాళిక వ్యయంగా అంచనా వేయబడింది. రెవెన్యూ మిగులు 3,318 కోట్ల రూపాయలు, ద్రవ్యలోటు అంచనా 23,467 కోట్ల రూపాయలుగా ఉంది.[10] స్థూల ఉత్పత్తి 11.47 శాతం నమోదైంది.[11]

నాల్గవ బడ్జెట్ (2017-2018) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2017 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2017 మార్చి 13న ఉదయం 11.35 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ నాలుగవసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[12] నాలుగోసారి తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపాడు.[13]

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త విధానంలో 2017-18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న ప్రణాళికా బడ్జెట్‌, ప్రణాళికేతర బడ్జెట్‌ పద్దులను రద్దుచేసి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా కింద బడ్జెట్‌ పద్దులు చూపారు.[14]

ఐదవ బడ్జెట్ (2018-2019) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2018 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2017 మార్చి 15న ఉదయం 11గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్, ఐదవసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు. తొలి ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్.[15][16]

ఆరవ బడ్జెట్ (2019-2020) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2020 సెప్టెంబరులో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 2019, సెప్టెంబరు 9న ఉదయం గం. 11.30 ని.లకు రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు, శాసనసభలో దాదాపు 40 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించాడు.[17] తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వహిస్తూ తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.[18]

2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదిత వ్యయం 1,46,492.30 కోట్ల రూపాయలు కాగా, ఇందులో రెవెన్యూ వ్యయం 1,11,055.84 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 17,274.67 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. బడ్జెట్ అంచనాలలో మిగులు 2,044.08 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 24,081.74 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేయబడింది.[19][20]

ఏడవ బడ్జెట్ (2020-2021) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2020 మార్చి 6న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. తొలిసారిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ 2020, మార్చి 8న ఉదయం 11:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు మొదటిసారి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[21] 2020-21 మొత్తం బడ్జెట్ అంచనా రూ. 1,82,914.42 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 22,061.18 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు, ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లుగా అంచనా వేయబడింది.[22] 2020 మార్చి 7న సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 2020-21 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రివర్గం పరిశీలించి ఆమోదించింది.

ఎనమిదవ బడ్జెట్ (2021-2022) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2021 మార్చి 18న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు.[23][24] 2021-2022 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ విలువ రూ.2,30,825.96 కోట్లు కాగా, అందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు, ఆర్థిక లోటు అంచనా రూ.45,509.60 కోట్లుగా ఉంది. పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ. 6,743.5 కోట్లుగా అంచనా వేయబడింది.[25] మంత్రి హరీశ్‌రావుకు ఇది రెండో బడ్జెట్‌. రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు 2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నాడు.

తొమ్మిదవ బడ్జెట్ (2022-2023) :

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2022 మార్చి 7న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞత చెబుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. ఉద‌యం 11:30 గంట‌ల‌కు బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభం కాగా, మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌ వరకు 2 గంట‌లపాటు హ‌రీశ్‌రావు బడ్జెట్ ను చ‌దివి వినిపించాడు.

2022-2023 సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రూ. 2,56,958.51 కోట్లు కాగా రెవెన్యూ వ్య‌యం రూ. 1.89 ల‌క్ష‌ల కోట్లు, క్యాపిట‌ల్ వ్య‌యం రూ. 29,728 కోట్లుగా అంచనా వేయబడింది. మంత్రి హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌.

మూలాలు

మార్చు
  1. "Telangana State Budget 2014-2015" (PDF). www.finance.telangana.gov.in. Archived from the original (PDF) on 2022-04-12. Retrieved 2022-12-23. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. Srinivas (2014-11-05). "తెలంగాణ బడ్జెట్: 2014-2015 కేటాయింపులు". www.telugu.oneindia.com. Archived from the original on 2022-04-12. Retrieved 2022-12-23.
  3. "Telangana Finance Minister presents maiden Budget". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2014-11-05. Archived from the original on 2021-06-15. Retrieved 2022-12-23.
  4. "'భారీ' ఆశల బడ్జెట్!". Sakshi. 2014-11-05. Archived from the original on 2022-04-12. Retrieved 2022-12-23.
  5. "Telangana government presents over Rs 1 lakh crore maiden budget". The Economic Times. 2014-11-05. Archived from the original on 2021-05-29. Retrieved 2022-12-23.
  6. "తెలంగాణ బడ్జెట్ 2015-16". Sakshi Education. 2015-03-12. Archived from the original on 2022-06-15. Retrieved 2022-12-23.
  7. Delhi, IndiaToday in New (2015-03-11). "Telangana Finance Minister Etela Rajendar presented State Budget 2015-16: Highlights". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-15. Retrieved 2022-12-23.
  8. Reddy, B. Dasarath (2015-03-11). "Telangana govt presents first full year budget with ambitious targets". Business Standard India. Archived from the original on 2018-05-10. Retrieved 2022-12-23.
  9. IANS (2016-03-14). "Telangana presents Rs 1.30 lakh crore budget for 2016-17". Business Standard India. Archived from the original on 2018-05-14. Retrieved 2022-12-23.
  10. "Telangana Budget 2016: K Chandrashekar Rao govt presents tax-free budget". Financialexpress (in ఇంగ్లీష్). 2016-03-14. Archived from the original on 2018-03-20. Retrieved 2022-12-23.
  11. "తెలంగాణ బడ్జెట్ 2016-17 హైలైట్స్". Sakshi. 2016-03-14. Archived from the original on 2016-06-22. Retrieved 2022-12-23.
  12. Rahul, N. (2017-03-13). "Rs 19,000-crore jump in Telangana Budget". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-11. Retrieved 2022-12-23.
  13. "తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18". Sakshi. 2017-03-13. Archived from the original on 2022-07-25. Retrieved 2022-12-23.
  14. "తెలంగాణకు ఈ బడ్జెట్ ప్రత్యేకం!". Samayam Telugu. 2021-03-13. Archived from the original on 2022-07-25. Retrieved 2022-12-23.
  15. Maitreyi, M. l Melly (2018-03-15). "Telangana Budget 2018-19 accords priority to agriculture, irrigation and power sectors". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-10-12. Retrieved 2022-12-23.
  16. "తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే: వ్యవసాయం-సంక్షేమం". www.telugu.oneindia.com. 2018-03-15. Archived from the original on 2018-03-15. Retrieved 2022-12-23.
  17. "రైతులకు శుభవార్త.. పంట రుణాల మాఫీకి బడ్జెట్‌లో కేటాయింపు". Samayam Telugu. 2019-09-09. Archived from the original on 2021-05-21. Retrieved 2022-12-23.
  18. V, Ramakrishna (2019-09-09). "CM presents Budget 2019-20 - Sri K. Chandrashekar Rao". www.cm.telangana.gov.in/. Archived from the original on 2022-06-02. Retrieved 2022-12-23.
  19. "Telangana State Portal CM presents Budget 2019-20". www.telangana.gov.in. 2019-09-10. Archived from the original on 2022-06-02. Retrieved 2022-12-23.
  20. "ఆర్థిక విధానాలపై ఆత్మపరిశీలన అవసరం (ఎడిటోరియల్)". Vaartha. 2019-09-10. Archived from the original on 2022-03-08. Retrieved 2022-12-23. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  21. ashok.kumar (2020-03-08). "తొలిసారి తెలంగాణ బడ్జెట్‌ 2020-21 ప్రవేశపెట్టిన హరీష్ రావు". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2022-05-04. Retrieved 2022-12-23.
  22. Rajeev, M. (2020-03-08). "Telangana's Budget 2020-21 pegged at ₹ 1.82 lakh crore". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2021-03-24. Retrieved 2022-12-23.
  23. "తెలంగాణ 2021-22 బడ్జెట్ హైలైట్స్‌". Sakshi. 2021-03-18. Archived from the original on 2021-03-18. Retrieved 2022-12-23.
  24. "తెలంగాణ బడ్జెట్ 2021-22". andhrajyothy. 2021-03-18. Archived from the original on 2021-03-18. Retrieved 2022-12-23.
  25. "తెలంగాణ బడ్జెట్ 2021: రూ.2,30,826 కోట్లతో బడ్జెట్.. వెయ్యి కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాం". BBC News తెలుగు. 2021-03-18. Archived from the original on 2021-05-10. Retrieved 2022-12-23.

బయటి లింకులు

మార్చు