తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2024-2025) అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2024 ఫిబ్రవరి 8న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
Submitted | 2024 ఫిబ్రవరి 8 |
---|---|
Submitted by | మల్లు భట్టివిక్రమార్క (తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి) |
Submitted to | తెలంగాణ శాసనసభ |
Presented | 2024 ఫిబ్రవరి 6 |
Parliament | 3వ శాసనసభ |
Party | భారత జాతీయ కాంగ్రెస్ |
Finance minister | మల్లు భట్టివిక్రమార్క |
Tax cuts | None |
‹ 2023 2025 › |
సమావేశాల ప్రారంభం
మార్చుఫిబ్రవరి 8న ఉభయ సభల్లో ప్రసంగించడం కోసం శాసనసభకు వచ్చిన గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందర రాజన్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించింది. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, మండలి ఫిబ్రవరి 9కి వాయిదా పడాయి.
ఆదాయం
మార్చు2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల వివరాలు:[1][2]
- రాష్ట్ర బడ్జెట్ రూ. 2,75,891 కోట్లు[3]
- రెవెన్యూ వ్యయం -2,01,178 కోట్లు
- మూల ధన వ్యయం - 29,669 కోట్లు
- ఆరు గ్యారెంటీల కోసం - రూ.53,196 కోట్లు అంచనా
- మూసీ ప్రాజెక్టుకు - రూ. 1000 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు
- ఐటీ శాఖకు రూ.774 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు.
- ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు
- ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు
- బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు.
- బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు
- విద్యా రంగానికి రూ.21,389 కోట్లు.
- తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు
- యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
- వైద్య రంగానికి రూ.11,500 కోట్లు.
- విద్యుత్ గృహ జ్యోతికి రూ.2,418 కోట్లు.
- విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు
- గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు
- నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు
మూలాలు
మార్చు- ↑ Zee News Telugu (10 February 2024). "Telangana Budget 2024-25: అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. 2024-25 కేటాయింపులు." Archived from the original on 10 February 2024. Retrieved 10 February 2024.
- ↑ Eenadu (10 February 2024). "TS Budget: ఆరు గ్యారంటీలకు పెద్దపీట.. రూ.2,75,891 కోట్లతో తెలంగాణ బడ్జెట్". Archived from the original on 10 February 2024. Retrieved 10 February 2024.
- ↑ Mana Telangana (10 February 2024). "2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్లు". Archived from the original on 10 February 2024. Retrieved 10 February 2024.