మల్లు భట్టివిక్రమార్క

మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మధిర శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడు.[1]

మల్లు భట్టివిక్రమార్క
మల్లు భట్టివిక్రమార్క


పదవీ కాలము
2009 - 2014, 2014 - 2018,  2018 - ప్రస్తుతం
నియోజకవర్గము మధిర శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి నందిని మల్లు
సంతానము సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య
నివాసము సుందరయ్య నగర్, మధిర, ఖమ్మం.

జననంసవరించు

మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు జన్మించాడు.[2] ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి మాజీ పార్లమెంటు సభ్యుడు.[3]

రాజకీయ విశేషాలుసవరించు

2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై 12,329 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. 2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2019 జనవరిలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.[4]

మూలాలుసవరించు

  1. http://www.bhattivikramarkamallu.in/brief-
  2. "Home". Bhatti Vikramarka Mallu. 20 December 2017. Archived from the original on 18 September 2019. Retrieved 18 September 2019.
  3. Lokasabha, 9th Lok Sabha. "Members Bioprofile". www.loksabhaph.nic.in. Retrieved 28 June 2020.[permanent dead link]
  4. hmtvlive, తాజా వార్తలు (18 January 2019). "సీఎల్పీ నేతగా మల్లు భట్టివిక్రమార్క". www.hmtvlive.com. Archived from the original on 18 September 2019. Retrieved 18 September 2019.