పోదెం వీరయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1][2]పొదెం వీరయ్య 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[3]

పోదెం వీరయ్య
పోదెం వీరయ్య


తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
డిసెంబరు 2018– 2023
ముందు సున్నం రాజయ్య
నియోజకవర్గం భద్రాచలం శాసనసభ నియోజకవర్గం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు
పదవీ కాలం
1999-2004, 2004-2009
ముందు చెర్ప భోజారావు
తరువాత సీతక్క
నియోజకవర్గం ములుగు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1966-01-02) 1966 జనవరి 2 (వయసు 58)
తొండ్యాల్ లక్ష్మిపూర్, మంగపేట మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు సమ్మయ్య - రాధాబాయి
జీవిత భాగస్వామి పద్మ
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె

జననం, విద్యాభ్యాసం

మార్చు

వీరయ్య 1966, జనవరి 2న సమ్మయ్య - రాధాబాయి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంగపేట మండలంలోని తొండ్యాల్ లక్ష్మిపూర్ గ్రామంలో జన్మించాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన ఎంఏ పూర్తి చేశారు.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

వీరయ్యకు పద్మతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

మార్చు

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 1999లో కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై 14,555 ఓట్ల మెజారిటీతో 11వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్కపై 14,594 ఓట్ల మెజారిటీతో 12వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీతక్క చేతులో 18,821 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ములుగు నియోజకవర్గం నుంచి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతులో 16,399 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[5]

2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున భద్రాచలం శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి తెల్లం వెంకట్రావుపై 11,785 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6][7] పొదెం వీరయ్య ఎన్నికలలో ఓడిపోయాడు, ఆయనను 2024 జులై 8న  అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[8]

పదవులు

మార్చు
  • అంచనాల కమిటీ సభ్యుడు
  • ఎస్.టి. కమిటీ సభ్యుడు

ఇతర వివరాలు

మార్చు

చైనా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-03-19. Retrieved 2019-06-28.
  2. తెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు. "Members of the Legislative Assembly". www.telangana.gov.in. Archived from the original on 2019-08-19. Retrieved 2021-10-28.
  3. Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.
  4. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  5. "PODEM VEERAIAH INC, Telangana Election, Mulug, Election Results 2014". www.electiontak.in. Retrieved 2021-10-28.
  6. "Bhadrachalam Election Result 2018 Live Updates: Podem Veeraiah of INC Wins". News18 (in ఇంగ్లీష్). Retrieved 2021-10-28.
  7. Admin (2018-12-11). "Podem Veeraiah MLA from Bhadrachalam Constituency Telangana". Blog (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-28.[permanent dead link]
  8. Eenadu (8 July 2024). "తెలంగాణలో వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.