తెల్లవారితే గురువారం

మణికాంత్ జెల్లి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా

తెల్లవారితే గురువారం, 2021 మార్చి 27న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.[3][4][5][6][7]

తెల్లవారితే గురువారం
దర్శకత్వంమణికాంత్ జెల్లి [1][2]
రచననాగేంద్ర పిళ్ళా
నిర్మాతరజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
తారాగణంశ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్
ఛాయాగ్రహణంసురేష్ రఘుతు
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంకాల భైరవ
నిర్మాణ
సంస్థలు
వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీs
27 మార్చి, 2021
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

సివిల్ ఇంజనీరైన వీరేంద్ర (శ్రీసింహా), తన తండ్రి వెంకటరత్నం (రవివర్మ) సహాయంతో హైదరాబాదులో కన్ స్ట్రక్షన్ కంపెనీని నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి సూర్యనారాయణ (రాజీవ్ కనకాల) కూతురు మధుబాల (మిషా నారంగ్)తో పెళ్ళి కుదురుతుంది. తెల్లవారితే గురువారం నాడు పెళ్ళి. మొగుడు అంటే నరకం చూపించే మనిషి అని చిన్నప్పటి నుండీ టీవీ సీరియల్స్ చూసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన మధుబాల పెళ్ళి మండపం నుండి పారిపోవాలనుకుంటుంది. లేడీ డాక్టర్ కృష్ణవేణి (చిత్ర శుక్లా)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరేంద్ర కృష్ణవేణి నుండి ఫోన్ రావడంతో ఆమె దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎవ‌రికివాళ్లు విడిగా పెళ్లి మంట‌పం నుంచి పారిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న ఆ ఇద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం చేయాల్సిన అవ‌స‌రం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.[8]

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, ర‌ఘురామ్‌, కృష్ణ వ‌ల్లెపు పాటలు రాశారు.[9]

 1. అరె ఏమైందో ఏమో
 2. మనసుకి హనికరం అమ్మాయే
 3. మెల్లగా మెల్లగా

విడుదల

మార్చు

ఈ సినిమా 2017, మార్చి 27న విడుదలయింది.[10][11]

మూలాలు

మార్చు
 1. Andrajyothy (26 March 2021). "తారక్‌తో సినిమా తీయాలి.. అదే డ్రీమ్‌: దర్శకుడు మణికాంత్". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
 2. TV9 Telugu (27 March 2021). "ఈ కథను పట్టుకుని చాలా తిరిగాను.. సింహా కథ విన్న వెంటనే ఒప్పుకున్నాడు.. అసలు విషయం చెప్పిన దర్శకుడు.. - thellavarithe guruvaram movie director manikanth gelli about his film". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 3. "Sri Simha Koduri's first-look from Thellavarithe Guruvaram sees him dressed as a groom". The Times of India. 15 January 2021. Retrieved 27 March 2021.
 4. "Sri Simha Koduri's 'Thellavarithe Guruvaram': First Look drops!". m.ragalahari.com. 15 January 2021. Retrieved 27 March 2021.
 5. "Thellavarithe Guruvaram Look: Simha In Groom Getup". www.greatandhra.com. 14 January 2021.
 6. "Thellavarithe Guruvaram First Look: Sad Sri Simha in groom get-up". www.tollywood.net. 15 January 2021. Retrieved 27 March 2021.
 7. "తెల్లవారితే గురువారం ఫస్ట్ లుక్ వచ్చింది". NTV Telugu. 14 January 2021. Archived from the original on 9 ఫిబ్రవరి 2021. Retrieved 27 March 2021. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 8. ETV Bharat, HOME/ SITARA/ MOVIE REVIEWS/ REGIONAL (27 March 2021). "రివ్యూ: పెళ్లిలో గందరగోళం.. 'తెల్లవారితే గురువారం'". ETV Bharat News (in ఇంగ్లీష్). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
 9. "Thellavarithe Guruvaram Mp3 Songs Download". AtoZmp3. 2021-03-19. Archived from the original on 2021-04-18. Retrieved 27 March 2021.
 10. "Thellavarithe Guruvaram Releasing On March 27". Zee Cinemalu. 13 February 2021. Archived from the original on 1 డిసెంబర్ 2022. Retrieved 27 March 2021. {{cite news}}: Check date values in: |archive-date= (help); More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 11. "'తెల్లవారితే గురువారం'.. ఏం జరిగింది?". Sakshi. 12 February 2021. Retrieved 27 March 2021.

బయటి లింకులు

మార్చు