సిరి హనుమంత్
సిరి హనుమంత్ (జననం 1996 జనవరి 2) భారతీయ నటి. టెలీవిజన్ న్యూస్‌రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ధారావాహికలలో నటిస్తోంది. వెండితెరపైనా అరంగేట్రం చేసిన ఆమె వరుస వెబ్ సిరీస్‌లతో బిజీగా మారింది.[1]
సిరి హనుమంత్ | |
---|---|
జననం | శిరీష హనుమంత్ 1996 జనవరి 2 |
వృత్తి | నటి, టెలివిజన్ వ్యాఖ్యాత |
అంతేకాకుండా, ఆమె షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, వాణిజ్య ప్రకటనలనూ నటిస్తుంది. ఆమె సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. 2021లో, ఆమె బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో పాల్గొని 4వ రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న సూపర్ హిట్ పులి మేక, ఆహా లోని బీఎఫ్‌ఎఫ్ సిరీస్‌లతో ఆమె అలరిస్తోంది. అలాగే, ఈ టీవీలో ప్రసార మయ్యే హాస్య ప్రదర్శన కార్యక్రమమైన జబర్‌దస్త్లో 2023 నవంబరు 9న ప్రసారం కానున్న ఎపిసోడ్‌తో యాంకర్ గా రానుంది.[2]
కెరీర్
మార్చువిశాఖపట్టణంలో 1996 జనవరి 2న సిరి హనుమంత్ జన్మించింది. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన ఆమె వేసవి సెలవులలో లోకల్ ఛానల్ లలో న్యూస్ రీడర్ గా చేరింది. ఆ తరువాత, ఆమె హైదరాబాద్‌లోని 99 టీవీ, టి న్యూస్ లలో చేసింది.
ఆ తరువాత, ఆమె స్టార్ మాలో ప్రసారమైన ఉయ్యాల జంపాలా సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో తొలిసారిగా నటించింది. ఎవరే నువ్వు మోహిని, అగ్నిసాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి వంటి పలు సీరియల్స్‌లలో ఆమె నటించింది. ఇద్దరి లోకం ఒకటే (2019), ఒరేయ్ బుజ్జిగా (2020), బూట్ కట్ బాలరాజు (2023) వంటి చిత్రాలలోనూ నటించింది.
మూలాలు
మార్చు- ↑ "ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట | Bigg Boss Fame Siri Hanmanth Latest Interview - Sakshi". web.archive.org. 2023-11-06. Archived from the original on 2023-11-06. Retrieved 2023-11-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Jabardasth: 'జబర్దస్త్'లో కొత్త యాంకర్.. ఎవరో తెలుసా? | jabardasth latest promo". web.archive.org. 2023-11-06. Archived from the original on 2023-11-06. Retrieved 2023-11-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)