టి. కృష్ణ
తొట్టెంపూడి కృష్ణ (1950 మే 08 - 1987 అక్టోబరు 21) తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఈయన చలన చిత్ర పరిశ్రమలో టి.కృష్ణ గా ప్రసిద్దుడు.
టి. కృష్ణ | |
తొట్టెంపూడి కృష్ణ | |
జన్మ నామం | తొట్టెంపూడి కృష్ణ |
జననం | 1950 మే 08 |
మరణం | 1987 అక్టోబరు 21 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 37)
భార్య/భర్త | కోటేశ్వరమ్మ |
పిల్లలు | 3, గోపీచంద్, ప్రతిమలతో సహా |
విశేషాలు
మార్చుఈయన 1950లో ప్రకాశం జిల్లా కాకుటూరి వారి పాలెంలో జన్మించాడు. ఇతని తండ్రి మంచి పండితుడు. ఉభయభాషా ప్రవీణుడు. కృష్ణ తన మేనమామ మాజీ మంత్రి టి.హయగ్రీవాచారి ప్రోద్బలంతో నాటకాలలో ప్రవేశించి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలలో పనిచేయాలనే బలమైన కోరికతో ప్రజానాట్యమండలి లో సభ్యుడు గా చేరి అనేక నాటకాలలో నటించారు. 1984లో ఆర్.నారాయణ మూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన అర్థరాత్రిస్వతంత్రం సినిమా లో నటించారు. వంగపండు ప్రసాదరావు గారు వ్రాసిన ఏం పిల్లడో ఎల్ద మొస్తవా పాటలో నటించారు టి.కృష్ణ గారు. ఆతరువాత ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ,మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారు. దర్శకత్వం వహించినవి ఏడు చిత్రాలే అయినప్పటికీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలు. .. [1]ఈయన ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు[2]. ఈ తరం పిక్చర్స్ సంస్థని స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఈయన మలయాళంలో కూడా కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ తెలుగు నటుడు తొట్టెంపూడి గోపీచంద్ ఈయన కుమారుడే. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 1987 మే 8న టి. కృష్ణ మరణించాడు.
సినిమాలు
మార్చు- నేటి భారతం (1983) (కథ, దర్శకత్వం)
- దేశంలో దొంగలు పడ్డారు (1985) (కథ, దర్శకత్వం)
- దేవాలయం (సినిమా) (1985) (కథ, కథనం, దర్శకత్వం)
- వందేమాతరం (1985 సినిమా) (1985) (కథ, కథనం, దర్శకత్వం)
- ప్రతిఘటన (1985) (కథ, కథనం, దర్శకత్వం)
- పకరాతిను పకరం (1986) (దర్శకత్వం) [మలయాళం]
- ప్రతిఘట్ (1987) (కథ, కథనం)
- రేపటి పౌరులు (1986) (రచన, దర్శకత్వం)
మూలాలు
మార్చు- ↑ సంపాదకుడు (1 February 1974). "ఎడిటర్, డైరెక్టర్ టి.కృష్ణ". విజయచిత్ర. 8 (8): 53–54.
- ↑ http://www.imdb.com/name/nm0471453/
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో టి,కృష్ణ పేజీ