నాసిక్

(త్రయంబకేశ్వరుడు నుండి దారిమార్పు చెందింది)
  ?నాసిక్
మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 20°01′N 73°30′E / 20.02°N 73.50°E / 20.02; 73.50
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
264.23 కి.మీ² (102 sq mi)
• 1,001 మీ (3,284 అడుగులు)
జిల్లా (లు) నాసిక్
జనాభా
జనసాంద్రత
13,64,000 (2005 నాటికి)
• 5,162/కి.మీ² (13,370/చ.మై)
మేయర్ వినాయక్ పాండే (2007)
కోడులు
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• +0253
• MH 15


నాసిక్, భారతదేశం, మహారాష్ట్రలాని నాసిక్ జిల్లాకు చెందిన ఒక నగరం. ఇది నాసిక్ జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణే లకు 180, 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాశిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ధి చెందుతున్న నాశిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా). ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడే జన్మించాడు.

త్రయంబకేశ్వరాలయం

మార్చు

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. పురాతన త్రయంబకేశ్వరాలయం నాశిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉంది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్' లో పూజించే దేవుడు మహా శివుడు. ద్వాదశ మహార్లింగాలల్లో ఒక పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్.

 
త్రయంబకేశ్వరాలయం, నాశిక్.

ఇతర దేవాలయాలు

మార్చు
  • గంగా గోదావరి దేవాలయం: గంగా గోదావరి దేవాలయం అనేది నాశిక్ లో ఉంది. నాశిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.
  • బాలచంద్ర గణపతి మందిరం: బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.
  • ప్రవర సంగమం: గోదావరి ప్రవరా నదుల సంగమస్థలంలోని అందమైన ప్రదేశమిది. ఔరాంగాబాదుకు 40 కిలోమీటర్లు దూరం. రామాయణంలో ముడిపడి ఉన్న ఈ ప్రదేశంలో సిద్దేశ్వరం, రామేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి.
  • చంగ్ దేవ్ మహరాజ్ మందిరం, పుణతాంబ, కోపర్ గావ్: ఇక్కడ సాధువు వందేవ్ మహరాజ్ సమాధి ఉంది. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ పుణతాంబ షిర్డికి దగ్గర్లో ఉంటుంది.
  • సుందర నారాయణ మందిరం: గోదావరికి సమీపంలో ఉన్న ఈ మందిరాన్ని 1756లో గంగాధర యశ్వంత చంద్రచూడు నిర్మించాడు. ప్రధానమూర్తి నారాయణుడు. ఆయనకు ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువై ఉన్నారు. దీనికి దగ్గర్లోనే బదరికా కొలను ఉంటుంది. ఈ కొలనును ప్రముఖ మహారాష్ట్ర సాధువు సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరిలో ప్రస్తావించాడు. మార్చి21 నాడు ఆలయంలోని విగ్రహాల మీద సూర్య కిరణాలు ప్రసరించడం విశేషం. ఈ ఆలయ నిర్మాణశైలిలో మొగలుల వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నాసిక్&oldid=4339513" నుండి వెలికితీశారు