దండమూడి రామమోహనరావు

మృదంగ విద్వాంసుడు

దండమూడి రామమోహనరావు మార్దంగికులలో (మృదంగం వాయించు వ్యక్తులు) మంచిపేరొందినవారిలో ఒకరు.ఇతని సతీమణి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. ఇతడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు

దండమూడి రామమోహనరావు
జననం(1930-12-31)1930 డిసెంబరు 31
వుయ్యూరు
మరణం2011 జనవరి 31(2011-01-31) (వయసు 80)
విజయవాడ
భార్య / భర్తసుమతి
జాతీయతభారతీయుడు
రంగంమృదంగం
శిక్షణకొండపాటూరి రంగనాయకులు,
పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి,
తిరుపతి రామానుజసూరి,
పళని సుబ్రహ్మణ్యం పిళ్లె
అవార్డులుకేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం

బాల్యం

మార్చు

రామమోహనరావు 1930 డిసెంబరు 31వుయ్యూరులో జన్మించారు[1][2].ఇతని తండ్రి రామస్వామి చౌదరి. రామమోహనరావు కొండపాటూరి రంగనాయకులు, పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి, తిరుపతి రామానుజ సూరి, ఈదర నాగరాజు, పళని సుబ్రహ్మణ్యం పిళ్లె వంటి గురువుల వద్ద మృదంగ విద్యను అభ్యసించాడు. తన ఆరవ ఏట యస్.దొరై సంగీత కచేరీకి మృదంగం వాయించి పండితుల ప్రశంసలు అందుకొన్నారు.

కర్ణాటక సంగీతంలోని విద్వాంసులైన పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకటస్వామి నాయుడు, దాలిపర్తి పిచ్చహరి, ఓలేటి వెంకటేశ్వర్లు, ఈమని శంకరశాస్త్రి, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, సుందరం బాలచందర్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి ఆ తరం వారికి మృదంగ సహకారం అందించాడు. నేటి సంగీత కళాకారులలో ఇతని ప్రక్కవాయిద్యం వాయించని కళాకారులు లేరనడం ఆశ్చర్యం కాదు.

ఆకాశవాణిలో ప్రవేశం

మార్చు

1944లో రామమోహనరావు ఆకాశవాణిలో ఆర్టిస్టుగా ఎంపికై, ఆకాశవాణిలో ఉన్నతస్థాయి కళాకారుడుగా పేరుపొందాడు. 1949 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మృదంగ నిలయ విద్వాంసునిగా చేరి 1993 లో పదవీ విరమణ చేశాడు.

శిక్షణపొందినవారు

మార్చు

ఇతనివద్ద వందలాది శిష్య ప్రశిష్యులను విద్వాంసులుగా తయారైయ్యారు. ఇతని శిష్యులలో భార్య దండమూడి సుమతీ రామమోహనరావు, ఎం.లక్ష్మీనారాయణ రాజు, పుల్లేటికుర్తి రామారావు, ఎం.సుబ్బరాజు, అలుగోలు సత్యనారాయణ ఎన్నదగినవారు[2].

సత్కారాలు, విదేశీ కచేరీలు

మార్చు

కేంద్ర సంగీత నాటక అకాడమి 1994 లో సత్కరించింది. "వాద్యరత్న" "నాద భగీరథ", "కళాప్రవీణ" వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తుడయ్యారు. ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్కు, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశాాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు.

2011 జనవరి 31వ తేదీన విజయవాడలో మరణించారు[2].

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Dandamudi Rammohan Rao". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Archived from the original on 14 August 2020. Retrieved 18 May 2020.
  2. 2.0 2.1 2.2 పి.సూర్యారావు (9 October 2016). "A legendary percussionist". ది హిందూ. Archived from the original on 18 May 2020. Retrieved 18 May 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

మార్చు