దస్తక్
రాజీందర్ సింగ్ బేడి దర్శకత్వంలో 1970లో విడుదలైన హిందీ సినిమా.
దస్తక్ 1970లో విడుదలైన హిందీ సినిమా. రాజీందర్ సింగ్ బేడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సంజీవ్ కుమార్, నూతన నటి రెహనా సుల్తాన్, అంజూ మెహేంద్రూ నటించగా మదన్ మోహన్ సంగీతం సమకూర్చాడు. దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ ఎడిటింగ్ చేశాడు.[1]
దస్తక్ | |
---|---|
దర్శకత్వం | రాజీందర్ సింగ్ బేడి |
స్క్రీన్ ప్లే | రాజీందర్ సింగ్ బేడి |
నిర్మాత | రాజీందర్ సింగ్ బేడి |
తారాగణం | సంజీవ్ కుమార్ రెహనా సుల్తాన్ అంజూ మెహేంద్రూ |
ఛాయాగ్రహణం | కమల్ బోస్ |
కూర్పు | హృషికేశ్ ముఖర్జీ |
సంగీతం | మదన్ మోహన్ మజ్రూహ్ సుల్తాన్ పురి (పాటలు) |
విడుదల తేదీ | 1970 |
సినిమా నిడివి | 140 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
1971లో జరిగిన భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడు (సంజీవ్ కుమార్), జాతీయ ఉత్తమ నటి (రెహనా సుల్తాన్), జాతీయ ఉత్తమ సంగీతం (మదన్ మోహన్) విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
నటవర్గం
మార్చు- సంజీవ్ కుమార్ (హమీద్)
- రెహనా సుల్తాన్ (సల్మా)
- అంజూ మెహేంద్రూ (మరియా)
- షకీలా (షంషాద్)
- కమల్ కపూర్ (బ్రిజ్మోహన్)
- మన్మోహన్ కృష్ణ (షాహిద్)
- అన్వర్ హుస్సేన్ (మరాటివాలే)
- దేవ్ కిషన్ (మీర్జా)
- నిరంజన్ శర్మ
- జగదేవ్
- యశ్ కుమార్
పాటలు
మార్చు- "బాయియన్ నా ధరో" - లతా మంగేష్కర్ - (చారుకేశి రాగం ఆధారంగా)[2]
- "హమ్ హైన్ మాతా-ఎ-కూచా-ఓ-బజార్" - లతా మంగేష్కర్
- "మై రి మెయిన్ కేస్ కహూన్" - లతా మంగేష్కర్/మదన్ మోహన్
- "తుమ్సే కహూన్ ఏక్ బాత్" - ముహమ్మద్ రఫీ
అవార్డులు
మార్చు- ఉత్తమ నటుడిగా జాతీయ చిత్ర పురస్కారం - సంజీవ్ కుమార్
- ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం - రెహనా సుల్తాన్
- ఉత్తమ సంగీత దర్శకత్వానికి జాతీయ చలనచిత్ర పురస్కారం - మదన్ మోహన్
- 1972 ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్ అవార్డు - కమల్ బోస్
మూలాలు
మార్చు- ↑ Hrishikesh Mukerjee Archived 15 అక్టోబరు 2007 at the Wayback Machine
- ↑ "Film Songs on Ragas". Archived from the original on 18 November 2007. Retrieved 11 October 2007.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)