దాన వీర శూర కర్ణ

(దానవీరశూరకర్ణ నుండి దారిమార్పు చెందింది)

దాన వీర శూర కర్ణ (ఆంగ్లం: Daana Veera Soora Karna, DVS Karna) చాలా విధాలుగా రికార్డులు సృష్టించిన తెలుగు సినిమా 1977 సంవత్సరంలో విడులైన పౌరాణిక చిత్రరాజం.

దాన వీర శూర కర్ణ
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి తారక రామారావు
నిర్మాణం నందమూరి తారక రామారావు
కథ మహాభారతంలోని కథ, ఎన్.టి.ఆర్. కూర్పు
చిత్రానువాదం నందమూరి తారక రామారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
నందమూరి హరికృష్ణ,
ధూళిపాల,
నందమూరి బాలకృష్ణ,
కైకాల సత్యనారాయణ,
శారద,
ప్రభ,
ఎస్.వరలక్ష్మి
చలపతిరావు
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
జి.ఆనంద్,
ఎమ్.రమేష్,
వి.రామకృష్ణ,
ఎమ్.వెంకటరావు
నృత్యాలు వెంపటి చినసత్యం
గీతరచన సి.నారాయణ రెడ్డి,
దాశరధి కృష్ణమాచార్యులు,
తిరుపతి వెంకట కవులు పద్యాలు,
కొండవీటి వెంకటకవి పద్యాలు
సంభాషణలు కొండవీటి వెంకటకవి
ఛాయాగ్రహణం నందమూరి మోహనకృష్ణ
నిర్మాణ సంస్థ రామకృష్ణా సినీ స్టూడియోస్
విడుదల తేదీ జనవరి 14, 1977
నిడివి 3 గంటలు 46 నిమిషాలు 31 సెకన్లు
భాష తెలుగు
పెట్టుబడి షుమారు 10 లక్షలు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

విశేషాలు మార్చు

ఇది నందమూరి తారక రామారావు, కొండవీటి వెంకటకవి కలసి సృష్టించిన సంచలన చిత్రం. కేవలం 10 లక్షలతో తయారైన ఈ సినిమా కోటి రూపాయలకు పైగా అప్పట్లో వసూలు చేసింది. 1994లో రెండవసారి విడుదల అయినప్పుడు మళ్ళీ కోటి రూపాయలు వసూలు చేసింది.

ఈ సినిమా పూర్తిగా ఎన్.టి.ఆర్. శ్రమ ఫలితం. అప్పటి సినిమా రంగంలో తిరుగులేని కథానాయకునిగా ఎంతో బిజీగా ఉన్న ఎన్.టి.ఆర్. ఈ సినిమాను, స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించి, ఆపైన కర్ణునిగా, దుర్యోధనునిగా, కృష్ణునిగా మూడు పాత్రలు పోషించాడు. మొత్తం 4 గంటల 17 నిముషాల నిడివి గల సినిమాలో దాదాపు నాలుగు గంటలపాటు ఎన్.టి.ఆర్. ఏదో ఒక పాత్రలో కనిపిస్తూనే ఉంటాడు. (రాజ్ కపూర్ హిందీ సినిమా 'మేరా నామ్ జోకర్' మొదట 4 గంటల 24 నిముషాలు గాని తరువాత అందులో 40 నిముషాలు తగ్గించారు. కనుక దాన వీర శూర కర్ణ బహుశా భారతీయ చిత్రాలలో పొడవైనవాటిలో ఒకటి). 4 గంటల 24 నిమిషాల నిడివి గలిగిన ఈ సినిమా చిత్రీకరణ కేవలం 43 రోజుల్లో పూర్తి అయ్యింది.

ఇంత భారీ చిత్రం కేవలం 43 పనిదినాల్లో షూటింగ్ ముగించుకొని విడుదలయ్యింది. అదే సమయంలో కమలాకర కామేశ్వరరావు దర్శకతవంలో హీరో కృష్ణ తీస్తున్న కురుక్షేత్రం సినిమాకు, ఈ సినిమాకు రంగంలో ఉత్కంఠమైన పోటీ నెలకొంది. త్వరపడి తీయడం వలన ఫొటోగ్రఫీలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించాయి. అయినా ప్రేక్షకులు పట్టించుకొనలేదు.

ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కొండవీటి వెంకటకవి నాస్తికుడు. కులమత వ్యవస్థకు వ్యతిరేకి. మొదట సినిమా సంభాషణలు వ్రాయడానికి నిరాకరించిన ఆయనను ఎన్.టి.ఆర్. ఎలాగో ఒప్పించాడు. సినిమా డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ఈ చిత్రానికి మాటలు అందించిన కొండవీటి వెంకట కవికి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు సంస్కృత కళాశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేసేవారు.

ఈ సినిమాలో అర్జునునిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యునిగా నందమూరి బాలకృష్ణ నటించారు. తండ్రితో ఈ ఇద్దరు కొడుకులూ తాతమ్మకల చిత్రం లోనూ, రామ్ రహీమ్ (బి.వి.సుబ్బారావు దర్శకత్వంలో) లోనూ, ఈ చిత్రంలోనూ మాత్రమే నటించారు. బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్ కలసి నటించిన చివరి చిత్రం ఇది. సమయానికి చిత్రం ముగించే పని వత్తిడిలో బాలకృష్ణ, హరికృష్ణ ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వారితో కలిసి మయసభ సీనులు పెయింటింగ్‌లో పాల్గొన్నారు. బాలకృష్ణ, హరికృష్ణ లకు మేకప్ ఎన్టీఆర్ చేసేవారు.

చలపతిరావు ఐదు పాత్రల్లో కనిపిస్తారు. అందులో మూడు పాత్రలు జరాసంద, అతిరధ, ఇంద్ర మిగతా రెండు అతిథి పాత్రలు.

ఇది ఎన్టీఆర్‌ నటించిన 248వ చిత్రమిది.

 
 
గుంటూరు నాజ్ థియేటర్లో దాన వీర శూర కర్ణ విడుదల రోజు

నిర్మాణం మార్చు

అభివృద్ధి మార్చు

అప్పటికి సాహిత్యరంగంలో మంచి పేరున్న కొండవీటి వెంకటకవిని సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఈ సినిమా సంభాషణలు ఆయనతో రాయించారు.[1]

చిత్రీకరణ మార్చు

సినిమాకు ఛాయాగ్రాహకునిగా కె.ఎస్.ప్రకాష్ వ్యవహరించారు. ఇది ప్రకాష్ కు ఛాయాగ్రాహకునిగా తొలి చిత్రం.[1]

పాత్రధారులు మార్చు

  • నందమూరి తారక రామారావు . - కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడు
  • చలపతిరావు - ఇంద్రుడు, జరాసంధుడు, అతిరధుడు
  • ధూళిపాళ - శకుని
  • ప్రభాకర రెడ్డి - ధర్మరాజు
  • కైకాల సత్యనారాయణ - భీముడు
  • నందమూరి హరికృష్ణ - అర్జునుడు
  • నందమూరి బాలకృష్ణ - అభిమన్యుడు
  • ప్రభ - భానుమతి (దుర్యోధనుని భార్య)
  • శారద - ద్రౌపది
  • బి.సరోజాదేవి - ప్రభావతి (కర్ణుని భార్య)
  • ఎస్.వరలక్ష్మి - కుంతి
  • రాజశ్రీ - సత్యభామ
  • కాంచన - సుభద్ర
  • దీప - ఉత్తర
  • రాజనాల - ద్రోణాచార్యుడు
  • మల్లాది - ధృతరాష్ట్రుడు
  • మిక్కిలినేని - భీష్ముడు
  • జగ్గారావు - దుస్శాసనుడు
  • గుమ్మడి - పరశురాముడు
  • ముక్కామల - శల్యుడు
  • జయభాస్కర్ - సూర్యుడు, ఏకలవ్యుడు
  • హలం, జయమాలిని - నర్తకులు
  • ఇంకా ఇతర పాత్రధారులు: విజయకృష్ణ, గోపాలకృష్ణ, వి.వెంకటేశ్వరరావు, రాజకుమార్, శంకర్ ప్రసాద్, భాస్కర శాస్త్రి, సుజాత, బెజవాడ చంద్రకళ తదితరులు

పాటలు, పద్యాలు మార్చు

ఈ సినిమాలో రికార్డు స్థాయిలో మొత్తం 10 పాటలు, 35 పద్యాలు ఉన్నాయి. ఎక్కువ పద్యాలను తిరుపతి వేంకట కవులు రచించిన సుప్రసిద్ధ పౌరాణిక నాటకం పాండవోద్యోగ విజయాలు నుండి, మరి కొన్ని కవిత్రయం మహాభారతంనుండి తీసుకొన్నారు.

పాట / పద్యం పాడినవారు రచన
ఏ తల్లి నిను కన్నదో, నేను నీ తల్లినైనానురా, నావరాల తొలిపంటగా, నీవు నా ఇంట వెలిశావురా పి.సుశీల సి. నారాయణ రెడ్డి
జయీభవ! దిగ్విజయయీభవ! ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్ సి.నారాయణ రెడ్డి.
జాబిలి కంటే చల్లనిది పి.సుశీల, ఎస్.జానకి దాశరధి కృష్ణమాచార్యులు
చిత్రం! భళారే, విచిత్రం! ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల సి. నారాయణ రెడ్డి
తెలిసెనులే ప్రియరసికా! నీ నులివేడి కౌగిలి అలరింతలు ఎస్.జానకి, పి.సుశీల సి.నారాయణరెడ్డి
ఓ కురుసర్వభౌమా! ఎస్.జానకి, పి.సుశీల సి.నారాయణ రెడ్డి
అన్నా, దేవుడు లేడన్నా! ఎస్.జానకి బృందం సి.నారాయణ రెడ్డి
ఇదిరా, దొరా, మదిర! ఎస్.జానకి సి.నారాయణ రెడ్డి
ఏల శాంతమ్మొ మరి రామకృష్ణ సి.నారాయణ రెడ్డి
కలగంటినో స్వామి పి.సుశీల, రమేష్ దాశరధి కృష్ణమాచార్యులు
జయతి రవి ఉదయ సమయే
ధారుణి రాజ్యసంపద మదంబున
కురువృద్ధుల్ గురువృద్ధబాంధవులనేకుల్
ఎక్కడ నుండి రాక యిటకు రామకృష్ణ
బావా, ఎప్పుడు వచ్చితీవు రామకృష్ణ
కౌరవపాండవుల్ పెనగు కాలము ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ముందుగ వచ్చితీవు రామకృష్ణ
ఆయుధమున్ ధరింప రామకృష్ణ
నందకుమరా! మాధవపెద్ది రమేష్
ఆలును బిడ్డ ఏడుపు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఒక దుర్మార్గుడు
నిదురవొచుంటివో లేక బెదరి పల్కుచుంటివో రామకృష్ణ
కురుపతి పెనుతొడల్ రామకృష్ణ
ఆలములోని
పాలడుగంగ
అయినను పోయిరావలయు హస్తినకు రామకృష్ణ
శ్రీకృష్ణా
తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి రామకృష్ణ
తనయుల వినిచెదవో రామకృష్ణ
అలుగుటయే యెరుంగని రామకృష్ణ
సంతోషంబున సంధి సేయుదురే రామకృష్ణ
సమరము సేయరే బలము సాలిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
జయతి జననంద
అంచితులయిన
ఏ సతివహ్నిలోన
సూతుని చేతికిన్ దొరకి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
కామము చేతగాని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
వందారు భక్తమందర ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
శ్రీవైకుంఠ నివాసాయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రణమున
ఉదయాద్రి
పట్టపగలింతె
ఏ మూల దాగెనో

వనరులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన

మూలాలు మార్చు