నందమూరి హరికృష్ణ

సినీ నటుడు, రాజకీయ నాయకుడు

నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించాడు. రామారావు తెలుగు దేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించాడు.[1] ఇతని కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్.టి.ఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా, అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[2][3]

నందమూరి హరికృష్ణ
రాజ్యసభ సభ్యుడు
In office
10 ఏప్రిల్ 2008 – 22 ఆగస్టు 2013
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
In office
1996–1999
అంతకు ముందు వారుఎన్. టి. రామారావు
తరువాత వారుసి.సి.వెంకటరాముడు
నియోజకవర్గంహిందూపూర్
వ్యక్తిగత వివరాలు
జననం(1956-09-02)1956 సెప్టెంబరు 2
నిమ్మకూరు, ఆంధ్రప్రదేశ్)
మరణం2018 ఆగస్టు 29(2018-08-29) (వయసు 61)
నార్కెట్‌పల్లి, తెలంగాణ
మరణ కారణంకారు ప్రమాదం
రాజకీయ పార్టీతెలుగు దేశం పార్టీ
జీవిత భాగస్వామి
  • లక్ష్మి
    (m. 1973)
  • శాలిని
    (m. 1983)
సంతానం4; including
తల్లిదండ్రులుఎన్. టి. రామారావు (తండ్రి)
వృత్తి
  • రాజకీయ నాయకుడు
  • నటుడు
  • చిత్ర నిర్మాత

వ్యక్తిగత జీవితం మార్చు

హరికృష్ణ, సెప్టెంబరు 2, 1956 న ఎన్. టి. ఆర్, బసవ రామ తారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు.

1980లో కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన శాలినిని వివాహం చేసుకున్నాడు. ఆమె తండ్రి వ్యాపారవేత్త. వ్యాపారంలో భాగంగా వారి కుటుంబం 1960వ దశకంలో హైదరాబాదులో స్థిరపడ్డారు.[4]

రాజకీయ జీవితం మార్చు

హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్య సభ సభ్యుడిగా పనిచేశాడు. 1995 లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్ధించి క్రియాశీలక పాత్ర పోషించాడు. 1995లో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణాశాఖ కేటాయించారు. కానీ ఆరు నెలల్లో ఆయన ఎక్కడా శాసనసభకు పోటీచేయలేక పోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది. 1996లో ఎన్. టి. ఆర్ మరణంతో హిందూపురం అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి గెలిచాడు. కానీ మంత్రి పదవి చేపట్టలేదు. 1999లో చంద్రబాబుతో విబేధించి అన్న తెలుగుదేశం పేరుతో మరో పార్టీ స్థాపించాడు. కానీ కొద్ది రోజులకు మళ్ళీ తెలుగుదేశంలో చేరాడు. 2008లో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. అదే సంవత్సరం ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది. అప్పటి నుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నాడు. ఆగస్టు 22, 2013 లో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు.[4]

నట జీవితం మార్చు

తొలినాళ్ళలో సినిమాల్లో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సుమారు 25 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరలా నటనా వృత్తికి చేరువయ్యాడు. నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హరికృష్ణ సత్యం అనే ఒక నక్సలైటు పాత్ర పోషించాడు. తర్వాత సీతారామరాజు, సీతయ్య, టైగర్ హరిశ్చంద్రప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించాడు. ఆయన నటించిన లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం ప్రేక్షకాదరణ పొందింది.[5]

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1967 శ్రీకృష్ణావతారం బాల కృష్ణుడు బాలనటుడు
1970 తల్లా పెళ్ళామా బాలనటుడు
1974 తాతమ్మకల నటుడు
1998 శ్రీరాములయ్య సత్యం, శ్రీరాములయ్య రాజకీయ గురువు నటుడు
1999 సీతారామరాజు నటుడు
2002 లాహిరి లాహిరి లాహిరిలో నటుడు
శివరామరాజు నటుడు
2003 సీతయ్య సీతయ్య నటుడు
టైగర్ హరిశ్చంద్రప్రసాద్ హరిశ్చంద్రప్రసాద్ నటుడు
2004 స్వామి నటుడు
2005 శ్రావణమాసం నటుడు

మరణం మార్చు

2018, ఆగస్టు 29 న ఉదయం 4:30గంటలకు హైదరాబాదు నుండి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి స్వయంగా కారు నడుపుతూ కావలిలో జరగబోయే ఒక పెళ్ళికి వెళ్తున్న సమయంలో ఉదయం 6:00-6:15 మధ్య తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద హైదరాబాదు-విజయవాడ హైవే మీద కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగినపుడు కారు పలుసార్లు పల్టి కొట్టడం వలన తీవ్రగాయాలలైన హరికృష్ణను నార్కట్‌పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు, అయినా ఫలితం లేకపోయింది. [6]

సీటు బెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా వాహనాన్ని నడపడం, వాహనం నడుపుతున్న సమయం తెల్లవారుజాము కావడం ఆయన మృతికి కారణాలని పోలీసులు తెలియజేశారు.[7]కారులో ఉన్న మరో ఇద్దరు బతికి బయటపడ్డారు.

హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రాం కూడా 2014 లో నల్గొండకు సమీపంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

నందమూరి వంశవృక్షం మార్చు


బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (30 August 2018). "పశ్చిమావనిలో 'సీతయ్య' గురుతులు". Sakshi. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  2. The Economic Times (29 August 2018). "Nandamuri Harikrishna Dead: N Harikrishna, NTR's son and Chandrababu Naidu's brother-in-law, dies in accident". The Economic Times. Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  3. India Today; Hyderabad (29 August 2018). "TDP leader and son of NTR, Nandamuri Harikrishna dies in road accident". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 1 జూన్ 2021. Retrieved 1 June 2021.
  4. 4.0 4.1 "రామయ్యకు నమ్మిన సారథి ఈ హరికృష్ణుడు". eenadu.net. Archived from the original on 30 August 2018.
  5. "ఆ రోజు పెద్ద ప్రమాదం జరిగి ఉండేది". ఈనాడు. 28 August 2018. Archived from the original on 28 August 2018. Retrieved 28 August 2018. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 28 ఆగస్టు 2019 suggested (help)
  6. "రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ దుర్మరణం, విషాదంలో నందమూరి కుటుంబం". telugu.oneindia.com. Archived from the original on 2018-08-29. Retrieved 2018-08-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "హరికృష్ణ మృతికి కారణాలివే..!". sakshi.com/news/crime. Archived from the original on 2018-08-29. Retrieved 2018-08-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)