దాస్యం ప్రణయ్ భాస్కర్
దాస్యం ప్రణయ్ భాస్కర్ (1956 జూలై 6 - 1999 జూలై 6) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున హన్మకొండ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
దాస్యం ప్రణయ్ భాస్కర్ | |||
![]()
| |||
శాసనసభ
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | పరకాల, హనుమకొండ జిల్లా, తెలంగాణ, భారతదేశం | 1956 జూలై 6||
మరణం | 1999 జూలై 6 తెలంగాణ, భారతదేశం | (వయసు 43)||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ (1982–1996) | ||
జీవిత భాగస్వామి | సబితా భాస్కర్ | ||
సంతానం | అభినయ భాస్కర్, అపూర్వ భాస్కర్ | ||
పూర్వ విద్యార్థి | వరంగల్ | ||
మతం | హిందూ |
జీవిత విషయాలు సవరించు
ప్రణయ్ భాస్కర్ 1956 జూలై 6న తెలంగాణ రాష్ట్రం, పూర్వపు వరంగల్ జిల్లా, పరకాలలో జన్మించాడు.[1]
రాజకీయ ప్రస్థానం సవరించు
1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హనుమకొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వి. రంగారావు చేతిలో ఓడిపోయాడు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు. ఎన్.టి.ఆర్. మంత్రివర్గంలో క్రీడలు, యువజన సేవలు, యువజన సంక్షేమం, ఎన్.సి.సి. స్వయం ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశాడు.
తెలంగాణ ఉద్యమంలో పాత్ర సవరించు
ప్రణయ్ భాస్కర్ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తరువాత మొదటి శాసనసభ మొదటి ప్రొటెం స్పీకరుగా ఉన్న కుందూరు జానారెడ్డి, శాసనసభ మొదటి స్పీకరుగా సిరికొండ మధుసూధనాచారిని ఏకగ్రీవంగా ప్రకటించిన తరువాత, అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు చారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. 1990ల చివరలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి ప్రస్తావించడం శాసనసభ రికార్డుల నుండి తొలగించారని, సభ్యుడిని అప్పటి స్పీకర్ అడ్డుకున్నారని ముఖ్యమంత్రి కెసీఆర్ గుర్తుచేశాడు.[2]
మరణం సవరించు
ప్రణయ్ భాస్కర్ 1999, జూలై 6న మరణించాడు.[1]
మూలాలు సవరించు
- ↑ 1.0 1.1 The Hans India, Telangana (7 July 2017). "Pranay Bhasker an inspiration to Telangana movement". Archived from the original on 24 March 2018. Retrieved 28 June 2020.
- ↑ Deccan Chronicle, Telangana (11 June 2014). "First Telangana assembly speaker appointed; historic moment, says KCR". Archived from the original on 22 ఆగస్టు 2018. Retrieved 28 June 2020.