దిగువమెట్ట

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం


దిగువమెట్ట, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.పటందిగువమెట్ట గ్రామం గిద్దలూరుకు 10 కిలోమీటర్ల దూరములో ఉంది.

గ్రామం
పటం
Coordinates: 15°23′00″N 78°49′59″E / 15.3833°N 78.833°E / 15.3833; 78.833
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంగిద్దలూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్Edit this at Wikidata

నల్లమల అడవి మార్చు

 
దిగువమెట్ట రైల్వేస్టేషను

ఇక్కడ నుండి నల్లమల్ల అడవి మొదలు అవుతుంది. దాదాపు 40 కిలోమీటర్ల వెడల్పున అడవి ఉంది. నల్లమల్ల అడవిలో వెదురు విస్తారంగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో లంబాడిలు, కొయ్యవారు నివాసం ఉన్నారు. ఇక్కడినుండి లోపలికి వెళ్ళే కొలది అడవి ఎంతో అందంగా కనిపిస్తుంది. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "ఆకులో ఆకునై పూవులో పూవునై (పాట)" అన్న పాటను ఈ అడవి అందాలు చూసే వ్రాసారు.1920 లో కృష్ణ శాస్త్రిగారు బళ్ళారి రైలుప్రయాణం లో ఈ అడవి అందాలకు పరవసించ ,అడవి అందాలను ఆస్వాదిస్తూ రాసిన గేయ సంపుటి కృష్ణ పక్షం అందులోదే ఈ ఆకులో ఆకునై గేయం.[1]. పలు సినిమాల చిత్రీకరణ ఇక్కడి అడవిలో జరిగింది.

ప్రకాశం జిల్లా ఏర్పాటుకు ముందు ఈ మండలం కర్నూలు జిల్లాలో ఉంది. గిద్దలూరు-నంద్యాల బస్సు, రైలు మార్గంలో గిద్దలూరుకు 10 కి.మీ.ల దూరంలో దిగువమెట్ట ఉంది. దిగువ మెట్ట వద్ద వుండి నల్లమల్ల అడవి మొదలు అయ్యి గాజుల దిన్నె వద్ద అడవి ముగుస్తుంది. అడవి వెడల్పు 40-45 కి.మీ. ఉంది. వర్షాకాలంలో అన్ని చెట్లు చిగిర్చి అడవి అంత పచ్చగా తివాచి పరచినట్లు కనులవిందుగా వుండును. ఎతైన కొండలు, లోయలతో బస్సు ప్రయాణం చేయునపుడు అందమయిన అనుభూతి కల్గుతుంది. ఈ పాటను దాసరి నారాయణ రావు గారు తన సినిమా "మేఘ సందేశం"లో ఉపయోగించారు.[2] పి.సుశీల గారు ఈ పాటను పాడారు. ఇందుకు గాను ఆమెకు అవార్డు కూడా లభించింది.

ఈ అడవిలో ఇంకొ అందమైన ప్రదేశం ఉన్నది దాని పేరు భైరెని . దిగువమెట్ట నుండి 15 కి మీ దూరంలో వుంది అంధమైన జలపాతము.

రవాణా సౌకర్యం మార్చు

రైల్వే స్టేషను మార్చు

 
రైల్వే స్టేషను ప్లాట్‌ఫారమ్

బొగ్గు రైలు ఇంజనుల సమయంలో ఈ దిగువమెట్ట స్టేషనులో ఇంజనులలో వాటరు నింపుటకు ఈ స్టేషను ఉపయోగపడేది. ఈ దుగువమెట్ట రైల్వే స్తేషన్ లో (2024,ఫిబ్రవరి నాటికి)మొత్తం నాలుగు ప్రయణికుల రైల్లు ఆగుతాయి.అవి1.17227 డోన్- గుంటూరు ఎక్సుప్రెస్,2.17228 గుంటూరు-డోన్ ,17329 హుబ్లి-విజయవాడ ఎక్సుప్రెస్,17330 విజయవాడ-హుబ్లి రైల్లు.[3]

బస్సు సౌకర్యం మార్చు

దిగువమెట్ట గ్రామ సమీపం నుండే హైవే వున్నది గిద్దలూరు-నంద్యాల మీదుగా వెళ్ళు ప్యాసింజరు బస్సులు ఇక్కడ ఆగును.

గ్రామ పంచాయతీ మార్చు

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శంకర్‌నాయక్ సర్పంచిగా ఎన్నికైనారు.

పోస్ట్ ఆఫీసు మార్చు

దిగువమెట్ట పోస్టాఫీసు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, గిద్దలూరు దిగువమెట్ట వద్ద ఉంది. ఇది ఒక శాఖ కార్యాలయం (B.O.). పోస్ట్ ఆఫీస్ (PO) / మెయిల్‌ను క్రమబద్ధీకరించడం, ప్రాసెస్ చేయడం మరియు గ్రహీతలకు డెలివరీ చేయడం వంటి బాధ్యతలను కలిగి ఉంది. దిగువమెట్ట PO యొక్క పిన్ కోడ్ 523357 . ఈ పోస్టాఫీస్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్‌లోని నంద్యాల పోస్టల్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. సంబంధిత హెడ్ పి.ఓ. ఈ శాఖ కార్యాలయం మార్కాపూర్ ప్రధాన తపాలా కార్యాలయం మరియు ఈ శాఖ కార్యాలయానికి సంబందిత మెయిల్స్ & పార్సెల్‌ల డెలివరీ, డబ్బు బదిలీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మరియు వంటి అన్ని పోస్టల్ సేవలను అందిస్తుంది. రిటైల్ సేవలు. ఇది పాస్‌పోర్ట్ అప్లికేషన్‌లతో సహా ఇతర సేవలను కూడా అందిస్తుంది.[4]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయం మార్చు

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017,జూన్-18వతేదీ ఆదివారం ఉదయం 8-01 కి స్వామివారి విగ్రహ ప్త్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11-45 నుండి మద్యాహ్నం 1-30 వరకు శ్రీ సీతారామకళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. సాయంత్రం 4-10 నుండి నూతన దంపతుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు, 16వతేదీ నుండి 18వ తేదీ వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

మూలాలు మార్చు

  1. "దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు". neccheli.com. Retrieved 2024-02-26.
  2. "భావ కవిత్వపు జాబిల్లి–దేవులపల్లి – 2". vennello.wordpress.com. Retrieved 2024-02-26.
  3. "Diguvametta Railway Station (DMT) Trains Schedule". .goibibo.com. Retrieved 2024-02-26.
  4. "Diguvametta Post Office, Giddalur". postoffices.co.in. Retrieved 2024-02-26.

వెలుపలి లంకెలు మార్చు