చిట్టెమ్మ మొగుడు

ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1992లో విడుదలైన తెలుగు చలనచిత్రం

చిట్టెమ్మ మొగుడు 1993, ఫిబ్రవరి 11 విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, దివ్యభారతి, పూజాబేడీ, బ్రహ్మానందం నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1][2] తమిళ చిత్రం తాలాట్టు కేత్కుతామా కు రిమేక్ చిత్రమిది.

చిట్టెమ్మ మొగుడు
చిట్టెమ్మ మొగుడు సినిమా పోస్టర్
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
రచనరాజ్ కపూర్ (కథ)
పరుచూరి సోదరులు (చిత్రానువాదం, మాటలు)
నిర్మాతపి. శ్రీధర్ రెడ్డి
తారాగణంమోహన్ బాబు, దివ్యభారతి, పూజా బేడి, బ్రహ్మానందం
ఛాయాగ్రహణంఎం.వి. రఘు
కూర్పుగౌతంరాజు
సంగీతంకె.వి.మహదేవన్
విడుదల తేదీ
5 ఏప్రిల్ 1992
సినిమా నిడివి
140 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

చిట్టి (దివ్య భారతి) సరదాగా ఉండే అమ్మాయి. ఆమె ముగ్గురు చిన్నపిల్లలైన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. ఒకసారి ఆట ఆడుతున్నప్పుడు, నీ తల్లి చనిపోయినట్టుగా నీవు కూడా బిడ్డని కని పురిట్లోనే చనిపోతావు అని ఒక వృద్ధుడు ఆమెను శపిస్తాడు. ఆ ఊరిలో ఒక గర్భిణీ స్త్రీ రాత్రి నొప్పులు రావడంతో ఆ బాధను భరించలేక చనిపోతుంది. దాంతో పిల్లల్ని కనడం గురించి చిట్టి భయపడుతుంది. అయితే, అదే గ్రామానికి వచ్చిన సాయి కృష్ణ (మోహన్ బాబు) చిట్టితో స్నేహం చేసి,.ఆమె తల్లిదండ్రుల అంగీకారంతో చిట్టిని పెళ్ళి చేసుకుంటాడు. గర్భం భయంతో చిట్టి సాయికృష్ణను దగ్గరికి రానివ్వదు. దాంతో సాయికృష్ణ అసంతృప్తిగా ఉంటాడు. ఆ ఊరికి వచ్చిన వైద్యురాలు (పూజా బేడి) ని చూసి ఆకర్షితుడైన సాయికృష్ణ మత్తులో మునిగి ఇంటికి వెళ్ళి చిట్టిపై అత్యాచారం చేస్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే, కోపంగా ఉన్న చిట్టిని ఓదార్చడానికి సాయికృష్ణ ప్రయత్నిస్తాడు. కాని చిట్టి కోపంతో తన తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆమెను తిరిగి తీసుకురావడానికి సాయికృష్ణ ప్రయత్నిస్తాడు. కానీ చిట్టి అంగీకరించదు. చిట్టి గర్భవతి అవుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
  • నిర్మాత: పి. శ్రీధర్ రెడ్డి
  • కథ: రాజ్ కపూర్
  • చిత్రానువాదం, మాటలు: పరుచూరి సోదరులు
  • ఛాయాగ్రహణం: ఎం.వి. రఘు
  • కూర్పు: గౌతంరాజు
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • పాటలు: జాలాది, రసరాజు, గురుచరణ్
  • కళ: శ్రీనివాస రాజు
  • డ్యాన్స్: ప్రభు, సుందరం, డి.ఎస్.కె. బాబు
  • నిర్మాణ సంస్థ: శ్రీసాయి శాంతి ఫిల్మ్స్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ సంగీతం అందించాడు.[3][4]

  1. హలో హలో లేడి డాక్టర్ - మనో, కె. ఎస్. చిత్ర
  2. చిట్టెమ్మ పొట్టెమ్మ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  3. చినుకు రాలితే - కె. జె. ఏసుదాసు, కె. ఎస్. చిత్ర
  4. బొడ్డులో రూపాయిబిల్ల - మనో, కె. ఎస్. చిత్ర
  5. నామాల సామికి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర
  6. నిండు కుండల - కె.జె. ఏసుదాసు

ఇతర వివరాలు

మార్చు
  1. అసెంబ్లీ రౌడీ సినిమా తరువాత మోహన్ బాబు, దివ్యభారతి కలిసి నటించిన చిత్రమిది.
  2. దివ్యభారతి చనిపోవడానికి సరిగ్గా మూడు నెలల ముందు ఈ చిత్రం విడుదలయింది.

మూలాలు

మార్చు
  1. "Chittemma Mogudu (1993) | DoReGaMa". doregama.info. Retrieved 2020-08-06.[permanent dead link]
  2. "Chittemma Mogudu (1992) - Review, Star Cast, News, Photos". Cinestaan. Archived from the original on 2021-02-09. Retrieved 2020-08-06.
  3. Array, Chittemma Mogudu - All Songs - Download or Listen Free - JioSaavn, retrieved 2020-08-06
  4. Chittemma Mogudu (Original Motion Picture Soundtrack) (in గ్రీక్), retrieved 2020-08-06

ఇతర లంకెలు

మార్చు