దీవి శ్రీనివాస దీక్షితులు

డి. యస్. దీక్షితులు (జూలై 28, 1956 - ఫిబ్రవరి 18, 2019) రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు. ఈయన పూర్తిపేరు దీవి శ్రీనివాస దీక్షిత్.[1]

డి. యస్. దీక్షితులు
జననం
దీవి శ్రీనివాస దీక్షిత్

జూలై 28, 1956
మరణంఫిబ్రవరి 18, 2019
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు
తల్లిదండ్రులుహనుమంతాచార్యులు, సత్యవతమ్మ
బంధువులుశ్రీధర్ (కుమారుడు), సుజాత దీక్షిత్ (కోడలు)

హనుమంతాచార్యులు, సత్యవతమ్మ దంపతులకు గుంటూరు జిల్లా, రేపల్లెలో 1956, జులై 28 న జన్మించాడు.

చదువు - ఉద్యోగం

మార్చు

సంస్కత, తెలుగు భాషలలో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందాడు. రంగస్థల నటుడిగా, అధ్యాపకుడిగా పేరు గడించాడు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరరుగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు
 
2018 తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ & దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి సంయుక్త సమర్పణలో ప్రతాప రుద్రమ మొదటి భాగం నాటకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనం చేస్తున్న డి.యస్. దీక్షితులు

లెక్చరరు ఉద్యోగాన్ని వదిలేసి, హైదరాబాదు వచ్చి ఎ.పి. థియేటర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రిపర్టరీలో డిప్లోమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరాడు. శిక్షణ సమయంలో శాకుంతలం, మానాన్న కావాలీ, కీలు బొమ్మలు, ఆశా', ప్రతాపరుద్రీయం మొదలైన నాటకాలలో నటించాడు. హరిశ్చంద్ర, సక్కుబాయి (పద్యనాటకాలు), వ్యవహార ధర్మబోధిని, కన్యాశుల్కం వెయింటింగ్ ఫర్ గోడో, స్వతంత్ర భారతం (సాంఘిక నాటకాలు), గోగ్రహణం, కొక్కొరోకో, జాతికి ఊపిరి స్వతంత్రం (వీధి నాటకాలు) వంటి నాటకాలకు దర్శకత్వం వహించాడు.

సినిమాలు - సీరియళ్లు

మార్చు

ఆల్ ఇండియా రేడియోలో నటుడిగా పాల్గొన్నాడు. టి.వి.లో ఈయన నటించిన "ఆగమనం" సీరియల్ కు దాదాపు అన్ని నంది అవార్డులు లభించాయి. 2019లో మాటీవిలో వచ్చిన సిరిసిరిమువ్వలు ఈయన చివరి సీరియల్. ఎల్లమ్మ, మురారి, ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, అతడు, గోపాల గోపాల మొదలగు చిత్రాలలో నటించాడు.

నటశిక్షణ

మార్చు

అక్కినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా యాక్టింగ్ లో ప్రదర్శన కళలన్నిటికీ సంబంధించిన శిక్షణను ఇచ్చాడు.

అవార్డులు - పురస్కారాలు

మార్చు
  1. శ్రీ కృష్ణతులాభారం పద్యనాటకానికి దర్శకత్వం వహించి 1999 నంది నాటకోత్సవాలలో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు బహుమతులు
  2. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు
  3. గరికపాటి రాజారావు మెమోరియల్ అవార్డు
  4. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం
  5. చైతన్య ఆర్ట్ థియేటర్ అవార్డు

దీక్షితులు 2019, ఫిబ్రవరి 18 సోమవారం సాయంత్రం నాచారంలోని రామకృష్ణ సినీ స్టూడియోస్‌లో 'సిరిసిరి మువ్వలు' సీరియల్ షూటింగులో నటిస్తూనే గుండెపోటుకు గురై మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. దీవి శ్రీనివాస దీక్షితులు, నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.346.
  2. నమస్తే తెలంగాణ (18 February 2019). "సినీనటుడు డీఎస్ దీక్షితులు ఇకలేరు". Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.
  3. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి-సినిమా కబుర్లు (19 February 2019). "దీక్షితులు ఇకలేరు". Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.
  4. ఈనాడు, తాజావార్తలు (18 February 2019). "'మురారి' దీక్షితులు కన్నుమూత". Archived from the original on 19 February 2019. Retrieved 19 February 2019.