ద్వివేదుల విశాలాక్షి

రచయిత్రి

ద్వివేదుల విశాలాక్షి (ఆగష్టు 15, 1929 - నవంబరు 7, 2014) కథా, నవలా రచయిత్రి.

ద్వివేదుల విశాలాక్షి
జననంద్వివేదుల విశాలాక్షి
(1929-08-15)1929 ఆగస్టు 15
India విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం2014 నవంబరు 7
విశాఖపట్నం
మరణ కారణంహృద్రోగం
ప్రసిద్ధికథా, నవలా రచయిత్రి
మతంహిందూ
భార్య / భర్తడి.ఎన్.రావు
పిల్లలుఛాయ

జననం- విద్య మార్చు

1929, ఆగస్టు 15న విజయనగరంలో జన్మించిన ద్వివేదుల విశాలాక్షి విద్యాభ్యాసం అక్కడే కొనసాగింది.

తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో పరిజ్ఞానం కలిగిన విశాలాక్షి అనేక కథలు, కవితలు, వ్యాసాలు, రేడియో నాటికలు రచించింది. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్‌, మలేషియా, సింగపూర్‌ దేశాల్లో పర్యటించి తన సాహిత్య వాణి వినిపించింది. 1960వ దశకంలో ఆమె రచించిన "వారధి" నవల రెండు కుటుంబాల కథగా వెండితెరకెక్కింది. 1974లో విడుదలైన వస్తాడే మా బావ చిత్రానికి మాటలు రాసి సినీరంగంతోనూ అనుంబంధాన్ని కొనసాగించింది. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు ఆమె ‘వారధి' నవలను 1973లో పలు భారతీయ భాషలలోకి అనువదించి ప్రచురించారు.తన పుస్తకాల హక్కులను విశాఖపట్నంలోని ద్వారకానగర్‌ పౌరగ్రంథాలయానికి ఆమె వ్రాసి యిచ్చింది. ఆంధ్ర, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పలువురు విద్యార్థులు ఆమె రచనలపై పరిశోధనలు జరిపి ఎంఫిల్‌, పీహెచ్‌డీలు పొందారు.

మరణం మార్చు

విశాలాక్షి నవంబరు 7, 2014 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్టణంలో తన 85వ యేట మరణించింది.

రచనారంగం మార్చు

విశాలాక్షి 13 నవలలు, 3 కథా సంపుటాలను అందించారు. వాటిలో కొన్ని -

  1. వైకుంఠపాళి (నవల) -1965
  2. వారధి (నవల)
  3. మారిన విలువలు (నవల) -1966
  4. గ్రహణం విడిచింది (నవల) -1967
  5. గోమతి (నవల)
  6. ఎక్కవలసిన రైలు (నవల)
  7. హరివిల్లు (నవల)
  8. జారుడుమెట్లు (నవల)
  9. ఎంత దూరమీ పయనం (నవల) -1995
  10. కలకానిది (నవల)
  11. కొవ్వొత్తి (నవల)
  12. పరిహారం (నవల)
  13. రేపటి వెలుగు (నవల)
  14. భావబంధం (కథాసంపుటి)
  15. విశాలాక్షి కథలు (కథాసంపుటి)
  16. మలేషియా నాడు-నేడు (వ్యాససంపుటి)

కథలు, నవలలకే పరిమితం కాకుండా రేడియోల్లో నాటికలను అందించిన ఆమె ఆకాశవాణి శ్రోతలకు చిరపరిచయమే.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. ద్వివేదుల విశాలాక్షి మరణవార్త[permanent dead link]
  2. విశాలాక్షి మరణవార్త
  3. ద్వివేదుల విశాలాక్షి మరణవార్త
  4. విశాలాక్షి మరణవార్త[permanent dead link]
  5. విశాలాక్షి మరణవార్త[permanent dead link]
  6. విశాలాక్షి కథనకౌశలం
  7. ద్వివేదుల విశాలాక్షి పుస్తకాల జాబితా