రెండు కుటుంబాల కథ (1996 సినిమా)
రెండు కుటుంబాల కథ విజయనిర్మల స్వీయ దర్శకత్వంలో శ్రీ విజయ కృష్ణ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1996, నవంబర్ 9వ తేదీ విడుదల అయ్యింది.[1]
రెండు కుటుంబాల కథ (1996 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయ నిర్మల |
తారాగణం | కృష్ణ, గీత, కస్తూరి |
సంగీతం | మాధవపెద్ది సురేష్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ కృష్ణ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- కృష్ణ - రమేష్ చంద్ర, కిషోర్ (ద్విపాత్రాభినయం)
- గీత - సీత
- శ్రీనాథ్ - సుబ్రహ్మణ్యేశ్వరరావు
- నిర్మలమ్మ - పార్వతమ్మ
- రఘునాథ రెడ్డి - రావణబ్రహ్మ
- తనికెళ్ళ భరణి - కీచకేశ్వరరావు
- నారాయణరావు - సారథి
- రంజిత - జ్యోతి
- నరేష్ - కిరణ్
సాంకేతిక వర్గం
మార్చు- కథ: భీశెట్టి లక్ష్మణరావు
- సంభాషణలు: పరుచూరి బ్రదర్స్
- పాటలు: వేటూరి
- ఛాయాగ్రహణం: మహీధర్
- సంగీతం: మాధవపెద్ది సురేష్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: విజయనిర్మల
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలకు మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించాడు.[2]
పాట | గాయకులు | రచన |
" చిత్రం భళారే విచిత్రం " | గంగాధర్, స్వర్ణలత | వేటూరి |
"చీరాల పాప" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | |
"జ్వాలత్ జ్వాలత్ జ్వాలన్" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత | |
"చలో ప్రియా హలో మియా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జ్యోతి | |
"మాతేశ్వరి మొగ్గ మజా" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
"చుక్కే వేశానే" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | వెన్నెలకంటి |
కథ
మార్చురమేష్ చంద్ర పారిశ్రామిక వేత్త. సీతను పెళ్ళి చేసుకుంటాడు. సీత అన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు. వ్యాపార లావాదేవీలలో రమేష్ చంద్రను తొలగిస్తేకానీ తమ రంగురాళ్ళ వ్యాపారంలో ముందడుగు వేయలేమని రమేష్ చంద్ర శత్రువులు రావణబ్రహ్మ, కీచకేశ్వరరావులు రమేష్ చంద్ర కారులో బాంబుపెట్టి చంపి, ఆ కారు చెట్టుకు గుద్దుకున్న ప్రమాదంలో రమేష్ చంద్ర, అతని స్నేహితుడు సారథి చనిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నిస్తారు. చివరకు ఆ మనుషుల్లో ఒకడుగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు కండువా ఆ ఘటనా స్థలంలో దొరికింది కాబట్టి అతడే హత్య చేశాడని కోర్టు తేలుస్తుంది. ఆమాటను సీత నమ్ముతుంది. రెండు కుటుంబాలు విడిపోతాయి. రమేష్ చంద్ర చనిపోయేనాటికే అతనికి కిషోర్ అనే ఒక కొడుకు. భార్య గర్భవతి. భర్త మరణం తరువాత జ్యోతి జన్మిస్తుంది. కిషోర్ పెద్దవాడయి అమెరికానుండి తిరిగి వస్తాడు. జ్యోతి సుబ్రహ్మణ్యేశ్వరరావు కొడుకు కిరణ్‌ను ప్రేమిస్తుంది. కానీ వారి ప్రేమను కిషోర్, గీతలు కిరణ్ తండ్రి హంతకుడు అనే కారణంతో వ్యతిరేకిస్తారు. సీత వాళ్ళ అమ్మ పార్వతమ్మ సహాయంతో ప్రేయసీ ప్రియులు ఇద్దరూ పారిపోతారు. వారిద్దరూ రమేష్ చంద్రను చంపింది సుబ్రహ్మణ్యేశ్వరరావు కాదనీ, రావణబ్రహ్మ, కీచకేశ్వరరావులనీ పసిగట్టి కిషోర్‌కు, సీతకు చెబుతారు కానీ వారు నమ్మరు. విలన్లు ప్రేయసీప్రియులను కిడ్నాప్ చేసి కిషోర్‌తో రంగురాళ్ళ వ్యాపారాన్ని వదులుకుంటున్నట్లు సంతకం చేయమని డిమాండ్ చేస్తారు. కిషోర్ ఆ విలన్లనిద్దరినీ చావబాది కిరణ్, జ్యోతిలను కాపాడుతాడు. "మామయ్యా ఈ ప్రాజెక్టును మీరే శంకుస్థాపన చేయాలి" అని కిషోర్ సుబ్రహ్మణ్యేశ్వరరావును కోరడంతో కథ సుఖాంతమవుతుంది.[3]
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Rendu Kutumbala Katha (Vijayanirmala) 1996". ఇండియన్ సినిమా. Retrieved 31 October 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Rendu Kutumbaala Katha (1996)". తెలుగు లిరిక్స్ వరల్డ్. Retrieved 31 October 2022.
- ↑ గుడిపూడి శ్రీహరి (1987). "ఒక మామూలు చిత్రం రెండు కుటుంబాల కథ (సినిమా రివ్యూ)". సితార (సినిమా వీక్లీ). Retrieved 31 October 2022.