నందికొండ పురపాలకసంఘం

నల్గొండ జిల్లాకు చెందిన పురపాలకంఘం
(నందికొండ పురపాలక సంఘం నుండి దారిమార్పు చెందింది)

నందికొండ పురపాలక సంఘం, తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఇది ఇంతకముందు నాగార్జున సాగర్ ఆనకట్ట ఎడమవైపున ఉన్నహిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ అనే పేర్లుతో కలిగిన ప్రాంతాలుగా ఉండేది.పురపాలక సంఘం ఏర్పడకుముందు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మించిననాటినుండి హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీల నిర్వహణ బాధ్యతను, ఇన్నాళ్లూ ప్రాజెక్టు నిర్వహణ నిధులతోనే ఎన్నెస్పీ అధికారులు నిర్వర్తించారు.[2]

నాగార్జున సాగర్ డామ్.నందికొండ

చరిత్ర

మార్చు

ఈ ప్రాంతం బౌద్ధ మతం ప్రభావానికి పేరుగాంచింది.ఉభయ తెలుగు రాష్టాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రదేశాలలో నాగార్జునసాగర్ ఆనకట్ట ఒకటి.[3] ఈ ప్రాంతం నిర్వహణ అంతకుముందు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ డ్యామ్ అథారిటీ క్రింద ఉంది. కానీ తరువాత రాష్ట్రంలో కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇది మునిసిపాలిటీగా మారింది.నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఇంజనీరుల, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కూలీలు నివాసముండేందుకుగాను తాత్కాలికంగా హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ, రైట్‌బ్యాంకు కాలనీలను ఏర్పాటు చేయబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన సమయంలో రైట్‌బ్యాంక్‌ కాలనీ ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లింది.హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీలు రెండు తెలంగాణలో పరిధిలోకి వచ్చాయి.ఇది నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం, నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

పురపాలక సంఘ కొత్త కార్యాలయం

మార్చు

నూతనంగా నిర్మించిన పురపాలక సంఘం కార్యాలయ భవనాన్ని ఇంధన శాఖా మంత్రి జి, జగదీశ్వరరెడ్డిచే ప్రారంభంచబడింది.[4]

అభివృద్ధి పనులు

మార్చు

నందికొండ పురపాలక పరిధిలో 28కోట్ల రూపాయలతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు 2022 మే 14న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశాడు. ఇందులో 8 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ (ఇరువైపుల మోరీలు, సెంట్రల్ లైటింగ్), 1 కోటి రూపాయలతో డిజిటల్ లైబ్రరీ, పైలాన్‌కాలనీలో 1 కోటి రూపాయలతో ఆధునిక బస్టాండ్, 1 కోటి 50 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్, 4 కోట్ల 50 లక్షల రూపాయలతో 600 మంది కూర్చునేలా ఆడిటోరియం, 9 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, హిల్‌కాలనీలో 9 కోట్ల రూపాయలతో మహిళలకోసం వెజ్-నాన్ వెజ్ మార్కెట్, 1 కోటి రూపాయలతో వైకుంఠధామాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జి. జగదీష్ రెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖామంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మల్సీ ఎంసి కోటిరెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.[5][6]

ఎన్నికల వార్డులు

మార్చు

పురపాలక సంఘం పరిధిని 12 ఎన్నికల వార్డులుగా విభజించబడ్డాయి.[7]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Nandikonda Municipality". nandikondamunicipality.telangana.gov.in. Retrieved 2021-06-26.
  2. "'నందికొండ'కు క్వార్టర్లే అండ..!". Sakshi. 2019-07-23. Retrieved 2020-01-30.
  3. India, The Hans (2019-12-30). "Nagarjunasagar: Newly-formed Nandikonda municipality gears up for polls". www.thehansindia.com. Retrieved 2020-01-30.
  4. India, The Hans (2018-08-03). "Nandikonda has historical significance: Minister G Jagadish Reddy". www.thehansindia.com. Retrieved 2020-01-30.
  5. India, The Hans (2022-05-15). "KTR: Congress responsible for backwardness of Nagarjunasagar". www.thehansindia.com. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
  6. Pandari Nagaraju (2022-05-14). "ఇచ్చిన మాట ప్రకారం.. ఫ్లోరైడ్ మహమ్మారిని అంతం చేశాం: కెటిఆర్". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
  7. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-09-22. Retrieved 2020-01-30.

వెలుపలి లంకెలు

మార్చు