నందినాగరి లిపి, సా.శ. 7 వ శతాబ్దంలో నాగరి లిపినుండి ఉద్భవించిన, బ్రాహ్మిక లిపి. .[1]. ఈ లిపి, దీనిలోని మాండలికాలు దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉండేవి. అంతేగాకుండా, నందినాగరి లిపిలో కనుగొనబడిన సంస్కృత తాళపత్రగంధాలు ఇంకా అనువదింపబడలేదు.[2][3] . మధ్వాచార్యుని ద్వైత వేదాంత పాఠశాలకి చెందినవిగా భావిస్తున్న వ్రాతపత్రులు, నందినాగరిలోనే ఉన్నాయి.[4]

నందినాగరి
Spoken languagesసంస్కృతం
Time periodసా.శ. 8వ శతాబ్దం - నేటి వరకూ
Parent systems
Sister systemsదేవనాగరి
బెంగాలీ లిపి
Unicode rangeలేదు.
Note: This page may contain IPA phonetic symbols in Unicode.

దీని సోదరిలిపి అయిన దేవనాగరి, భారతదేశం ఇతర ప్రాంతాలన్నిటిలోనూ వాడుకలో ఉంది.

నామశాస్త్రం

మార్చు

“నందినాగరి” అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్న స్పష్టమైన సమాధానం లేదు. బహుశా “నంది” అనేది, పవిత్రమైన అనే అర్థంలో వాడబడుతూండవచ్చు.

చరిత్ర

మార్చు
 
నందినాగరి లిపిలో అక్షరమాల

బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందిన నందినాగరి లిపి, సా.శ. 8 -19 శతాబ్దాల మధ్యకాలంలో, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, దక్షిణ మహారాష్ట్రలలో సంస్కృత గ్రంథాలకి, శాసనాలకి వినియోగింపబడింది. నందినాగరి, ప్రాచీనమైన శాసనాలు కొన్నింటిని తమిళనాడులో కూడా కనుగొన్నారు. మహాబలిపురంలో, సా.శ. వ శతాబ్దానికి చెందిన నరసింహ పల్లవుని రాతిశాసనాలు, సా.శ. 10వ శతాబ్దానికి చెందిన చోళ రాజరాజు కాలానికి చెందిన నాణేలు, నందినాగరి లిపిలోనే ఉన్నాయి.[5][6] ఋగ్వేదం, [7] ఇతర వేదాలేకాకుండా, [8] సా.శ. 1వ శతాబ్దంనాటి విక్రమచరిత్ర వ్రాతప్రతులు కూడా నందినాగరి లిపిలో లభ్యమవుతున్నాయి.[9][10]

తిరువనంతపురం (కేరళ) లోని ఒక గుడిలో లభించిన, అనంతశయన మహాత్మం అనే తాళపత్రగ్రంథం కూడా నందినాగరి లిపిలోనే ఉంది.[11] విజయనగర సామ్రాజ్య కాలంలో సంస్కృతం వ్రాసేందుకు, తాళపత్రగంథాలలోనూ, రాగిరేకులమీద నాగరిలిపినే ఉపయోగించారు.[12] నందినాగరిలిపిలో వ్రాయబడిన ఎన్నో సంస్కృత వ్రాతప్రతులు దక్షిణ భారతదేశంలో దొరికినప్పటికీ, ఈ లిపిపైన, లిపిలో లభ్యమవుతున్న శాస్త్రసాహిత్యంపైన అంతగా అధ్యయనం జరగలేదు.[13] వీటిలో వేదాలు, వేదాంతాలు, వేదాంతభాష్యాలు, [14] పురాణాలు, విజ్ఞానశాస్త్రాలు, కళలు సంబంధించిన అనేక గ్రంథాలు ఉన్నాయి.[3][15][16] ఇవన్నీ దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ వ్రాతప్రతి గ్రంథాలయాల్లో, భద్రపరచబడి ఉన్నాయి.[2] కొన్ని నందినాగరి వ్రాతలు, ద్వైలిపిలో (రెండేసి లిపుల్లో), తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వంటి ప్రధాన దక్షిణ భాషా లిపులతో కూడి ఉన్నాయి.[17]

యూనికోడ్ లో నందినాగరి

మార్చు

యూనికోడ్ లో నందినాగరికి, కోడ్స్ కేటాయించబడ్డాయికానీ., ఇప్పటికీ వినియోగింపబడలేదు.[18]

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. George Cardona and Danesh Jain (2003), The Indo-Aryan Languages, Routledge, ISBN 978-0415772945, page 75
  2. 2.0 2.1 Reinhold Grünendahl (2001), South Indian Scripts in Sanskrit Manuscripts and Prints, Otto Harrassowitz Verlag, ISBN 978-3447045049, pages xxii, 201-210
  3. 3.0 3.1 P. Visalakshy (2003), The Fundamentals of Manuscriptology, Dravidian Linguistics Association, ISBN 978-8185691107, pages 55-62
  4. Friedrich Otto Schrader (1988), A descriptive catalogue of the Sanskrit manuscripts in the Adyar Library, Otto Harrassowitz Verlag
  5. Nagari script Archived 2016-03-04 at the Wayback Machine Department of Archaeology, Government of Tamil Nadu (2011)
  6. I Nakacami (2008), Mahabalipuram (Mamallapuram), Oxford University Press, ISBN 978-0195693737, pages 29-30
  7. AC Burnell, Elements of South-Indian Palaeography from the Fourth to the Seventeenth Century AD, Cambridge University Press, ISBN 978-1108046107, page 61 with footnote 1
  8. MacKenzie Collection of Oriental Manuscripts, p. PA3, గూగుల్ బుక్స్ వద్ద, Asiatic Society of Bengal, pages 3, 6-7
  9. A Hindu Book of Tales: The Vikramacarita, Franklin Edgerton, The American Journal of Philology, Volume 33, No. 131, page 249-252
  10. A Hindu Book of Tales: The Vikramacarita, Franklin Edgerton, The American Journal of Philology, Volume 33, No. 131, page 262
  11. HH Wilson and Colin Mackenzie, Mackenzie Collection: A Descriptive Catalogue of the Oriental Manuscripts, p. 62, గూగుల్ బుక్స్ వద్ద, Asiatic Society, page 62
  12. 12.0 12.1 A Survey of Nandinagari Manuscript Recognition System Archived 2016-03-04 at the Wayback Machine Prathima and Guruprasad Rao (2011), International Journal of Science & Technology, 1(1), pages 30-35
  13. Reinhold Grünendahl (2001), South Indian Scripts in Sanskrit Manuscripts and Prints: Grantha Tamil - Malayalam - Telugu - Kannada - Nandinagari, Otto Harrassowitz Verlag, ISBN 978-3447045049, page xxii
  14. David Pingree (1981), Census of the Exact Sciences in Sanskrit, Volume 4, American Philosophical Society, ISBN 978-0871691460, pages 29, 201, 217, 260, 269, 409
  15. A Descriptive Catalogue of the Oriental Manuscripts, p. PA2, గూగుల్ బుక్స్ వద్ద, HH Wilson, Mackenzie Collection of Nandinagari, Devanagari, Grandham and Telugu Manuscripts (South India), pages 2-8, 12-14
  16. David Pingree (1970), Census of the Exact Sciences in Sanskrit, Volume 5, American Philosophical Society, ISBN 978-0871692139, pages 26-27, 79-81, 237-241
  17. David Pingree (1970), Census of the Exact Sciences in Sanskrit, Volume 1 and 2, American Philosophical Society, ISBN 978-0871690814, see Preface and Introduction
  18. Unicode Status (Nandinagari), Script Source, SIL International, United States (2014)

బయటి లింకులు

మార్చు