నంది నాటక పరిషత్తు - 2014

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2014 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో నంది నాటక పరిషత్తు - 2014 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.[1]

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

మార్చు

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2014 సంవత్సరానికి గాను నల్లూరి వెంకటేశ్వర్లు (సాంఘిక నాటకం) గారికి అందజేశారు.[2]

జ్యూరి సభ్యులు

మార్చు
  • పద్యనాటకాలు: బీ.ఎన్.ఐ.ఎం (హైదరాబాదు), వై. గోపాలరావు (శ్రీకాకుళం), కె. వనజకుమారి (అనంతపురం).
  • సాంఘిక నాటకాలు: ఎస్. అరుణకుమారి (కడప), వీబీజీవీకెఎం రాజు (కాకినాడ), ఎస్. బాలచందర్ (గుంటూరు).
  • సాంఘిక నాటికలు: ఎంసీ దాసు (విజయవాడ), జే.ఎస్.ఆర్. ఆంజనేయులు (నెల్లూరు), హైమావతి (హైదరాబాదు).
  • పిల్లల నాటికలు: డి. రామకోటేశ్వరరావు (గుంటూరు), వనజ నర్సింహారావు (పాలకొల్లు), సీ.హెచ్. ప్రభావతి (హైదరాబాదు).

ప్రదర్శించిన నాటక/నాటికలు

మార్చు
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
17.05.2015 ఉ. గం. 9.30 ని.లకు భక్త ప్రహ్లాద (పద్య నాటకం) నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు కీ.శే. బండ్ల సుబ్రమణ్యం యం. అర్జునరావు
17.05.2015 మ. గం. 12.30 ని.లకు అల్లూరి సీతారామరాజు (బాలల సాంఘిక నాటిక) ప్యూచర్ టైమ్స్ ఆర్గనైజేషన్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి మాదాల గోపాలకృష్ణ
17.05.2015 మ. గం. 2.30 ని.లకు చెట్టు (సాంఘిక నాటకం) ప్రతాభా ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం గెద్దే కిషోర్ గంటా సత్యనారాయణ
17.05.2015 సా. 5 గం. లకు మాతృక (సాంఘిక నాటిక) సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాదు రావినూతల ప్రేమకిషోర్ యం. భజరప్ప
17.05.2015 రా. 7 గం. లకు పరాన్న జీవులు (సాంఘిక నాటకం) శ్రీ సప్తగిరీశమ్, చోబ్రోలు నాగాభట్ల బాపన్న శాస్త్రి ముమ్మిడి తాతకొండ
19.05.2015 ఉ. గం. 9.30 ని.లకు పాండవ విజయం (పద్య నాటకం) కళారాధన సాంస్కృతిక చైతన్య మండలి, హైదరాబాదు కీ.శే. తిరుపతి వెంకటకవులు మల్లాది గోపాలకృష్ణ
19.05.2015 మ. గం. 12.30 ని.లకు మనో వైకల్యం (బాలల సాంఘిక నాటిక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజంపల్లి కె.వి. రంగారావు కె.వి. రంగారావు
19.05.2015 మ. గం. 2.30 ని.లకు బ్రతకనివ్వండి (సాంఘిక నాటకం) ఉషోదయ కళానికేతన్, హైదరాబాదు చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
19.05.2015 సా. 5 గం. లకు మళ్లీ మొదలు పెట్టకండి (సాంఘిక నాటిక) కె.జె.ఆర్. కల్చరల్ అసోసియేషన్, సికింద్రాబాద్ ఉదయ్ భాగవతుల ఉదయ్ భాగవతుల
19.05.2015 రా. 7 గం. లకు చివరి అధ్యాయం (సాంఘిక నాటిక) బహురూప నాట్య సమాఖ్య, విశాఖపట్నం యస్.కె. మిశ్రో యస్.కె. మిశ్రో
21.05.2015 ఉ. గం. 9.30 ని.లకు శ్రీ కళహస్తీశ్వర సాయుజ్యమ్ (పద్య నాటకం) ఆహ్లాద క్రియేటీవ్ థియేటర్, హైదరాబాదు ఎ. శివరామ ప్రసాద్ ఎ. శివరామ ప్రసాద్
21.05.2015 మ. గం. 12.30 ని.లకు జాతి స్వరాలు (బాలల సాంఘిక నాటిక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చేబ్రోలు స్నిగ్ధ పిఠాపురం బాబూరావు
21.05.2015 మ. గం. 2.30 ని.లకు గాలి బతుకులు (సాంఘిక నాటకం) గంగోత్రి, పెదకాకాని డి. విజయభాస్కర్ నాయుడు గోపి
21.05.2015 సా. 5 గం. లకు కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ (బాలల సాంఘిక నాటిక) త్రివిధ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, నూజివీడు కవి. పి.యన్.యం కవి. పి.యన్.యం
21.05.2015 రా. 7 గం. లకు అంతర్నేత్రం (సాంఘిక నాటిక) రంగయాత్ర యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, గుంటూరు పిన్నమనేని మృత్యుంజయరావు కరణం సురేష్
21.05.2015 రా. గం. 8.30 ని.లకు రజాకార్ (సాంఘిక నాటిక) డా. చుక్కా సత్తయ్య ఒగ్గు కల్చరల్ అసోసియేషన్, వరంగల్ చౌదరిపల్లి రవికుమార్ చౌదరిపల్లి రవికుమార్
23.05.2015 ఉ. గం. 9.30 ని.లకు లక్ష్మమ్మ కథ (పద్య నాటకం) గీతా కళామందిర్ నట శిక్షనాలయం, తణుకు మల్లాది వెంకట సూర్యనారాయణ కె. రాజ్యం
23.05.2015 మ. గం. 12.30 ని.లకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ (బాలల సాంఘిక నాటిక) మాంటిస్సోరి కల్చరల్ యూనిట్, ఉల్లంపర్రు యం.యస్. వాసు కె.యస్. ప్రకాశరావు
23.05.2015 మ. గం. 2.30 ని.లకు నిర్భయ నా కూతురు (సాంఘిక నాటకం) బహురూప నాట్య సమాఖ్య, విశాఖపట్నం యస్.కె. మిశ్రో యస్.కె. మిశ్రో
23.05.2015 సా. 5 గం. లకు పుల్ల పురాణం (బాలల సాంఘిక నాటిక) శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, పెదబంటుపల్లి పనసాల వెంకటేశ్వర్లు ఈపు విజయ్ కుమార్
23.05.2015 రా. 7 గం. లకు స్వేచ్ఛ (సాంఘిక నాటిక) అరవింద ఆర్ట్స్ డెవలప్ మెంట్ సొసైటి, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి
23.05.2015 రా. గం. 8.30 ని.లకు విశ్వామిత్ర విజయం (పద్య నాటకం) ఖమ్మం కల్చరల్ అసోసియేషన్, ఖమ్మం టి. నరసింహారావు టి. నరసింహారావు
25.05.2015 ఉ. గం. 9.30 ని.లకు విష్ణు సాయుజ్యము (పద్య నాటకం) శ్రీ సాయి శ్రీనివాస్ కల్చరల్ అసోసియేషన్, విశాఖపట్నం కీ.శే. గుమ్మూలూరి ప్రేమ్ కుమార్ చలసాని కృష్ణప్రసాద్
25.05.2015 మ. గం. 12.30 ని.లకు ఊరి కొక్కరు (బాలల సాంఘిక నాటిక) అమన్ వేదిక రేయిన్ బో హోం, సికింద్రాబాద్ హరిశ్చంద్ర రాయల హరిశ్చంద్ర రాయల
25.05.2015 మ. గం. 2.30 ని.లకు నాలుగు గోడల మధ్య (సాంఘిక నాటకం) విజయాదిత్య ఆర్ట్స్, రాజమండ్రి గోపరాజు విజయ్ శ్రీపాద కుమారశర్మ
25.05.2015 సా. 5 గం. లకు మనిషిని చంపిన మనసు (సాంఘిక నాటిక) కళానికేతన్, వీరన్నపాలెం జె. హరిబాబు వై.వి. చౌదరి
25.05.2015 రా. 7 గం. లకు ధర్మో రక్షితి రక్షత: (సాంఘిక నాటిక) కృష్ణా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్, గుడివాడ పి.వి. సత్యనారాయణ శ్రీరం శ్రీనివాసరావు
25.05.2015 రా. గం. 8.30 ని.లకు పృధ్వీరాజ్ (పద్య నాటకం) శ్రీ సాయిబాబ నాట్యమండలి, విజయవాడ పి.వి.యన్. కృష్ణ పి.వి.యన్. కృష్ణ
27.05.2015 ఉ. గం. 9.30 ని.లకు శ్రీ కృష్ణాభిమన్యు (పద్య నాటకం) టి.జి.వి. కళాక్షేత్రం, కర్నూలు పల్లేటి లక్ష్మీకులశేఖర్ పత్తి ఓబులయ్య
27.05.2015 మ. గం. 12.30 ని.లకు బాధ్యత (బాలల సాంఘిక నాటిక) మేకా ఆర్ట్స్, హైదరాబాదు సాయి స్రవంతి మేకా రామకృష్ణ
27.05.2015 మ. గం. 2.30 ని.లకు బాగుంది ఇంకా బాగుంటుంది (సాంఘిక నాటకం) వి.వి.ఆర్. ఎంటర్ టైన్ మెంట్ ఇండియా ప్రై.లి, హైదరాబాదు జెట్టి హరిబాబు జెట్టి హరిబాబు
27.05.2015 సా. 5 గం. లకు పెళ్ళి చేసి చూడు (సాంఘిక నాటిక) శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు పి.వి. భవాని ప్రపాద్ గోపరాజు విజయ్
27.05.2015 రా. 7 గం. లకు భవద్వేషిణిం (సాంఘిక నాటిక) డి.యస్.ఆర్. కళాశాల లలిత కళా విభాగం, భీమవరం వీరవల్లి శశి మోపటి అభిరామ్
27.05.2015 రా. గం. 8.30 ని.లకు అ-ద్వితీయం (సాంఘిక నాటకం) ది యంగ్మెన్ హ్యాపీక్లబ్, కాకినాడ యస్.యస్.ఆర్.కె. గురు ప్రసాద్ యస్.యస్.ఆర్.కె. గురు ప్రసాద్
29.05.2015 ఉ. గం. 9.30 ని.లకు తెలుగు వెలుగు (పద్య నాటకం) సుబ్బరాజు నాట్య కళాపరిషత్, తిరుపతి కోనేటి సుబ్బరాజు కోనేటి సుబ్బరాజు
29.05.2015 మ. గం. 12.30 ని.లకు ఆకలి (బాలల సాంఘిక నాటిక) కళారాధన, శ్రీ గురురాజ కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల బి. కమలాకర్ జి. రవికృష్ణ
29.05.2015 మ. గం. 2.30 ని.లకు పడగనీడ (సాంఘిక నాటకం) క్రియేటీవ్ కల్చరల్ అకాడమీ, హైదరాబాదు ఆకెళ్ల సూర్యనారాయణ మూర్తి లక్కాప్రగడ ప్రమోద్
29.05.2015 సా. 5 గం. లకు తీరు మారాలి (బాలల సాంఘిక నాటిక) మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, హజపల్లి టి.వి. రంగారావు టి.వి. రంగారావు
27.05.2015 రా. 7 గం. లకు ముగింపు లేని శిక్ష (సాంఘిక నాటిక) చైతన్య కళా స్రవంతి - విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం పి.టి. మాధవ్ పి. బాలాజీ నాయక్
31.05.2015 ఉ. గం. 9.30 ని.లకు ఇంద్ర సింహాసనం (పద్య నాటకం) హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు పల్లేటి లక్ష్మీకులశేఖర్ యం.డి. ఖాజావలి
31.05.2015 మ. గం. 12.30 ని.లకు చిరుదీపం (బాలల సాంఘిక నాటిక) కాటూరు పబ్లిక్ స్కూల్, లాలుపురం కావూరి సత్యనారాయణ నడింపల్లి హనుమంతరావు
31.05.2015 మ. గం. 2.30 ని.లకు ఋషి (సాంఘిక నాటకం) అరవింద ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి
31.05.2015 సా. 5 గం. లకు అమ్మా-అమ్మను పిలవ్వా (సాంఘిక నాటిక) మాధురి క్రియేషన్స్, హైదరాబాదు కంచర్ల సూర్యప్రకాశ్ రావు లక్కాప్రగడ ప్రమోద్

చిత్రమాలిక

మార్చు

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ప్రజాశక్తి, జిల్లాలు (16 May 2015). "రంగరంగ వైభవంగా రంగస్థల పండుగ". www.prajasakti.com. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 21 April 2020.
  2. విశాలాంధ్ర (24 May 2015). "ప్రజా కళాభేరి-అన్న నల్లూరి". వల్లూరు శివప్రసాద్‌. Archived from the original on 14 ఆగస్టు 2020. Retrieved 23 December 2017.