నంది నాటక పరిషత్తు - 2001

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. నాలుగవ నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 2001) 2002 మే 28 నుండి జూన్ 3 వరకు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[1]ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు

మార్చు
 • పద్యనాటకాలు: తుర్లపాటి రాధాకృష్ణమూర్తి, రాజా శివానంద, సి.హెచ్. నాంచారయ్య
 • సాంఘిక నాటకాలు: ఎన్. రవీంద్రారెడ్డి, డి.వి. రమణమూర్తి, డీన్ బద్రు
 • సాంఘిక నాటికలు: కబీర్ దాసు, వై.ఎస్.ఎన్. పాత్రో, వై.కె. నాగేశ్వరరావు

తుది పోటీల న్యాయనిర్ణేతలు

మార్చు

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

మార్చు

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 2001 సంవత్సరానికి గాను ఆచంట వెంకటరత్నం నాయుడు (చారిత్రక, పద్యనాటకం) గారికి అందజేశారు.[2]

బహుమతులు

మార్చు

పద్యనాటకం

మార్చు
 • ఉత్తమ ప్రదర్శన: అశ్వత్థామ (శ్రీమీరా కళాజోత్స్న, విశాఖపట్టణం)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: శ్రీనాథుడు (విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు)
 • ఉత్తమ దర్శకుడు: దుగ్గిరాల సోమేశ్వరరావు (శ్రీనాథుడు)
 • ఉత్తమ నటుడు: గుమ్మడి గోపాలకృష్ణ (శ్రీనాథుడు)
 • ఉత్తమ నటి: సరస్వతుల రత్నశాస్త్రి (అశ్వత్థామ)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: ఎస్. యేసుదాసు (భక్తయోబు)
 • ఉత్తమ పాత్రోచిత నటుడు: వి.బి.కె. శర్మ (భక్తయోబు)
 • ఉత్తమ హాస్య నటుడు: ఎస్. సత్యనారాయణ (సంకీర్తనాచార్య అన్నమయ్య)
 • ఉత్తమ రచయిత: మీగడ రామలింగస్వామి (అశ్వత్థామ)
 • ఉత్తమ బాల నటుడు: పి. సాయితేజ (కుమార సంభవం)
 • ఉత్తమ సంగీతం: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
 • ఉత్తమ ఆహార్యం: కె. వరహాలు అండ్ పార్టీ (అశ్వత్థామ)
 • ఉత్తమ రంగాలంకరణ: బాలనాగమ్మ
 • ప్రత్యేక బహుమతి: శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

సాంఘీక నాటకం

మార్చు
 • ఉత్తమ ప్రదర్శన: అమరజీవి (కళావాణి, ఉభయ గోదావరులు)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: గాంధీ జయంతి (రమణీయరంగం, హైదరాబాదు)
 • ఉత్తమ దర్శకుడు: ప్రసాదమూర్తి ముదనూరి (అమరజీవి)
 • ఉత్తమ నటుడు: జె. వి. రమణమూర్తి (గాంధీ జయంతి)
 • ఉత్తమ నటి: నిర్మల (గాంధీ జయంతి)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: గంగోత్రి సాయి (సారీ బ్రదర్ ఇది నీ కథే)
 • ఉత్తమ పాత్రోచిత నటుడు: కాకరాల సత్యనారాయణ (గాంధీ జయంతి)
 • ఉత్తమ హాస్య నటుడు: రఘు బాబు (గాంధీ జయంతి)
 • ఉత్తమ రచయిత: వాడ్రేవు సుందరరావు (అమరజీవి)
 • ఉత్తమ బాల నటి: సుమన అభినందన (ఉత్తమ పంచాయితీ)
 • ఉత్తమ సంగీతం: కె. నాగేశ్వరరావు (అమరజీవి)
 • ఉత్తమ ఆహార్యం: భరణి (అమరజీవి)
 • ఉత్తమ రంగాలంకరణ: పిఠాపురం బాబూరావు (అమరజీవి)
 • ప్రత్యేక బహుమతి: బి. సుధాకర్ (అమృతం తాగిన రాక్షసులు)

సాంఘీక నాటిక

మార్చు
 • ఉత్తమ ప్రదర్శన: బహురూపి (శ్రీ సద్గురు కళా నిలయం, గుంటూరు)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: పోనీ పోనీ పోతే పోనీయ్ (అభ్యుదయ కళాసమితి, ఒంగోలు)
 • ఉత్తమ దర్శకుడు: కోట్ల హనుమంతరావు (కాశ్మీర్ టూ కన్యాకుమారి)
 • ఉత్తమ నటుడు: బసవరాజు జయశంకర్ (బహురూపి)
 • ఉత్తమ నటి: వాణిబాల (నిశ్శబ్ధ విప్లవం)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: బి.పి. ప్రసాదరావు (గుప్పెడు వెన్నెల)
 • ఉత్తమ పాత్రోచిత నటుడు: కె.బి. నాగేశ్వరరావు (కృష్ణపక్షం)
 • ఉత్తమ హాస్య నటి: ప్రభ ('టివి'లాసం)
 • ఉత్తమ రచయిత: గోళ్ళపాటి నాగేశ్వరరావు (పుట్టలో వేలెడితే కుట్టనా)
 • ఉత్తమ బాల నటి: గోళ్ళపాటి సత్యహారిక (పుట్టలో వేలెడితే కుట్టనా)
 • ఉత్తమ సంగీతం: సి. మధుసూదనాచారి (కాశ్మీర్ టూ కన్యాకుమారి)
 • ఉత్తమ ఆహార్యం: టి. మురళి, పి. రాము (బహురూపి)
 • ఉత్తమ రంగాలంకరణ: కృష్ణ (కృష్ణపక్షం)
 • ప్రత్యేక బహుమతి: ఎ. శ్రీనివాసరావు (పోనీ పోనీ పోతే పోనీయ్)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.701.
 2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695