నంది నాటక పరిషత్తు - 1999

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. రెండవ నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 1999) 2000, మే 22 నుండి 28 వరకు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[1]

ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు

మార్చు

జోనల్ స్థాయి న్యాయనిర్ణేతలు

మార్చు

తుదిపోటీల (రాష్ట్రస్థాయి) న్యాయనిర్ణేతలు

మార్చు

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

మార్చు

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 1999 సంవత్సరానికి గాను వేమూరి రామయ్య (పద్యనాటకం) గారికి అందజేశారు.[2]

బహుమతులు

మార్చు

పద్యనాటకం

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: శ్రీకృష్ణ తులాభారం (శ్రీ సత్యసాయి కళానికేతన్, హైదరాబాదు)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: శ్రీరామవనవాసం (సవేరా ఆర్ట్స్ కడప)
  • ఉత్తమ దర్శకుడు: డి.యస్. దీక్షితులు (శ్రీకృష్ణ తులాభారం)
  • ఉత్తమ నటుడు: గుమ్మడి గోపాలకృష్ణ (శ్రీకృష్ణ తులాభారం)
  • ఉత్తమ నటి: గూడూరు సావిత్రి (శ్రీరామవనవాసం)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: జి. శివనాగిరెడ్డి (శ్రీరామవనవాసం)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: ఆచంట బాలాజీనాయుడు (తులసీ జలంధర)
  • ఉత్తమ హాస్య నటి: అరుణకుమారి (తారా శశాంకం)
  • ఉత్తమ బాల నటుడు: మాస్టర్ ఎస్. విక్రం (శ్రీరామవనవాసం)
  • ఉత్తమ సంగీతం: టి. రాజాబాబు (బొబ్బిలియుద్ధం)
  • ఉత్తమ ఆహార్యం: శ్రీ సాయి డ్రామా డ్రస్ కంపెనీ (బొబ్బిలియుద్ధం)
  • ఉత్తమ రంగాలంకరణ: బి.వి. రావు, ఎల్.వి. భూషణ్ (శ్రీకృష్ణ తులాభారం)
  • ప్రత్యేక బహుమతి: బి.వి. ఆర్.సి.హెచ్. నాయుడు (దీపవళి)

సాంఘీక నాటకం

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: వానప్రస్థం (గంగోత్రి, పెదకాకాని)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: కలల రాజ్యం, బహురూప నట సమాఖ్య, విశాఖపట్టణం)
  • ఉత్తమ దర్శకుడు: నాయుడు గోపి (వానప్రస్థం)
  • ఉత్తమ నటుడు: చిట్టా శంకర్ (అశృఘోష)
  • ఉత్తమ నటి: ఎమ్. రత్నకుమారి (వానప్రస్థం)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: గోపిశెట్టి వేంకటేశ్వర్లు (పులిస్వారి)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: కె.పి.వి. ప్రసాదరావు (కలల రాజ్యం)
  • ఉత్తమ హాస్య నటుడు: ఎస్.కె. మిశ్రో (కలల రాజ్యం)
  • ఉత్తమ బాల నటి: నుసుము అభినందన (ఉత్తమ పంచాయితీ)
  • ఉత్తమ సంగీతం: శ్రీధర్, మురళి (సహజీవనం)
  • ఉత్తమ ఆహార్యం: పాండురంగయ్య, శ్రీనివాసులు (పులిస్వారి)
  • ఉత్తమ రంగాలంకరణ: సురభి వి. నాగేంద్రప్రసాద్ (క్రాస్ రోడ్స్)
  • ప్రత్యేక బహుమతి: పద్మప్రియ భళ్ళమూడి (క్రాస్ రోడ్స్)

సాంఘీక నాటిక

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: రావణకాష్టం (సంగం డైరీ క్రియేషన్స్, వడ్లమూడి)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: జారుడుమెట్లు (ఎల్.వి.ఆర్. క్రియేషన్స్, గుంటూరు)
  • ఉత్తమ దర్శకుడు: కావూరి సత్యనారాయణ (రావణకాష్టం)
  • ఉత్తమ నటుడు: కావూరి సత్యనారాయణ (రావణకాష్టం)
  • ఉత్తమ నటి: ఆలపాటి లక్ష్మి (సూదిలోంచి ఏనుగు)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: ఎ.జె.సి. రాజు (ధృతరాష్ట్ర కౌగిలి)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: డి. నారాయణ (సాగర మథనం)
  • ఉత్తమ హాస్య నటుడు: ఎస్. మోహన్ (సాగర మథనం)
  • ఉత్తమ సంగీతం: సైదారావు (రావణకాష్టం)
  • ఉత్తమ ఆహార్యం: కె. భరణి (కర్మణ్యే వాధికారస్తే)
  • ఉత్తమ రంగాలంకరణ: కె.ఎస్.వై. సత్యప్రసాద్ (కర్మసాక్షి)
  • ఉత్తమ రచన: విజయభాస్కర్ దీర్ఘాశి (మబ్బుల్లో బొమ్మ)
  • ప్రత్యేక బహుమతి: మందులు.కె (కర్మసాక్షి)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.697.
  2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695