నంది నాటక పరిషత్తు - 1998

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. మొదటి నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 1998) 1999, మే 23 నుండి 31 వరకు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[1]


ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు

మార్చు
  • పద్యనాటకాలు: ఎం. అల్లా బక్ష్, జి.ఎస్.ఎన్. శాస్త్రి, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి
  • సాంఘిక నాటకాలు: ఎ. శివరామిరెడ్డి, గండవరం సుబ్బరామిరెడ్డి, యు. సుబ్బరాయశర్మ
  • సాంఘిక నాటికలు: ఎ.ఎల్. గురప్ప చౌదరి, కోకా సంజీవరావు, బి. విజయప్రకాష్

తుది పోటీల న్యాయనిర్ణేతలు

మార్చు

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

మార్చు

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 1998 సంవత్సరానికి గాను అబ్బూరి కమలాదేవి (పద్యనాటకం) గారికి అందజేశారు.[2]

బహుమతులు

మార్చు

పద్యనాటకం

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: శ్రీ శ్రీనివాస కళ్యాణం (శ్రీ శ్రీనివాస కళాభారతి, నృత్య కళాశాల, తిరుపతి)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: శ్రీ షిరిడి సాయిబాబా మహాత్యం (శ్రీసాయి విజయనాట్య మండలి (సురభి), హైదరాబాదు)
  • ఉత్తమ దర్శకుడు: సింహం లక్ష్మీనారాయణ (నర-నారాయణ)
  • ఉత్తమ నటుడు: మీగడ రామలింగస్వామి (శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం)
  • ఉత్తమ నటి: రజనీ నాగరాజు (నర-నారాయణ)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: బి.వి.ఎ. నాయుడు (శ్రీకృష్ణ రాయబారం)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: వన్నెం బలరామ్ (నర-నారాయణ)
  • ఉత్తమ హాస్య నటుడు: ర్యాలి మోహనరావు (చంద్రోదయం)
  • ఉత్తమ బాల నటుడు: మాస్టర్ అవినాష్ (అన్నమాచార్య)
  • ఉత్తమ సంగీతం: మీగడ రామలింగస్వామి (శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం)
  • ఉత్తమ ఆహార్యం: షరీఫ్ (శ్రీ శ్రీనివాస కళ్యాణం)
  • ఉత్తమ రంగాలంకరణ: ఎస్. సుందరబాబు (శ్రీ శ్రీనివాస కళ్యాణం)
  • ఉత్తమ నాటక రచయిత: పల్లేటి లక్ష్మీ కులశేఖర్ (నర-నారాయణ)
  • ప్రత్యేక బహుమతి: నర-నారాయణ

సాంఘీక నాటకం

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: కించిత్ భోగం (బహురూప నట సమాఖ్య, విశాఖపట్టణం)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: చరణదాసు (భూమిక, హైదరాబాదు)
  • ఉత్తమ దర్శకుడు: జి. ఉదయభాను (చరణదాసు)
  • ఉత్తమ నటుడు: పి.ఆర్.జె. పంతులు (కించిత్ భోగం)
  • ఉత్తమ నటి: జగదేశ్వరి (కించిత్ భోగం)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: కొండవలస లక్ష్మణరావు (నవరాగం)
  • ఉత్తమ పాత్రోచిత నటి: రత్నకుమారి (నరవాహనం)
  • ఉత్తమ హాస్య నటుడు: సుత్తివేలు (అనగా అనగా ఒక అమ్మాయి)
  • ఉత్తమ ప్రతి నాయకుడు: వెంకటరామిరెడ్డి (కుర్చి)
  • ఉత్తమ సంగీతం: జి. ఉదయభాను, కుమార్ (చరణదాసు)
  • ఉత్తమ రంగాలంకరణ: బస్వర్ గోపాల్ (బస్తీ దేవత యాదమ్మ)

సాంఘీక నాటిక

మార్చు
  • ఉత్తమ ప్రదర్శన: హింసధ్వని, (గంగోత్రి, పెదకాకాని)
  • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: మనుధర్మం (గురజాడ కళామందిర్, విజయవాడ)
  • ఉత్తమ దర్శకుడు: ఎన్.జె. బిక్షు (ఒక ఒరలో నాలుగు నిజాలు)
  • ఉత్తమ నాటక రచయిత:
  • ఉత్తమ నటుడు: నాయుడు గోపి (హింసధ్వని)
  • ఉత్తమ నటి: ఎ. నాగమణి (నాలుగో సింహం)
  • ఉత్తమ ప్రతినాయకుడు: హర్షవర్ధన్ (ఒక ఒరలో నాలుగు నిజాలు)
  • ఉత్తమ పాత్రోచిత నటుడు: కోట శంకరరావు (జీవన సంధ్య)
  • ఉత్తమ హాస్య నటుడు: విశ్వమోహన్ (అబ్బే - ఏం లేదు)
  • ఉత్తమ సంగీతం: ఎం. సైదారావు (పృధ్వీసూక్తం)
  • ఉత్తమ రంగాలంకరణ: పి. శేషగిరిరావు (పృధ్వీసూక్తం)
  • ఉత్తమ ఆహార్యం: మల్లాది గోపాలకృష్ణ (ఒక ఒరలో నాలుగు నిజాలు)
  • ఉత్తమ రచన: ఎ. భాస్కరచంద్ర (కొయ్యగుర్రం)
  • ప్రత్యేక బహుమతి: కొయ్యగుర్రం (నాటిక)

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.696.
  2. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695