నంది నాటక పరిషత్తు - 2002
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు. ఐదవ నంది నాటకోత్సవం (నంది నాటక పరిషత్తు - 2002) 2003 మే 28 నుండి జూన్ 6 వరకు హైదరాబాదు లోని రవీంద్ర భారతిలో నిర్వహించబడింది.[1]
ప్రాథమిక పరిశీలన న్యాయనిర్ణేతలు
మార్చు- పద్యనాటకాలు: డి.యస్. దీక్షితులు, బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి
- సాంఘిక నాటకాలు: సి.ఎస్. విజయకుమార్
- సాంఘిక నాటికలు: పి.ఎస్. విజయకుమార్
తుది పోటీల న్యాయనిర్ణేతలు
మార్చు- పద్యనాటకాలు: ఆచంట వెంకటరత్నం నాయుడు, ఎం. పురుషోత్తమచార్యులు
- సాంఘిక నాటకాలు: పత్తివాడ సూర్యనారాయణ, బి. విజయప్రకాష్, భాస్కర్ శివాల్కర్
- సాంఘిక నాటికలు: టి.ఆర్. అడబాల, వనం లక్ష్మీకాంతరావు, సి.ఎస్. రావు
నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం
మార్చునాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఇచ్చే పురస్కారం 2002 సంవత్సరానికి గాను జె. సిద్దప్ప నాయుడు (చారిత్రక, పద్యనాటకం) కు అందజేశారు.[2]
బహుమతులు
మార్చుపద్యనాటకం
మార్చు- ఉత్తమ ప్రదర్శన: శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (కళా తరంగిణి, విశాఖపట్నం)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: గుణనిధి (శ్రీ మీరా కళాజ్యోత్స్న, విశాఖపట్నం)
- ఉత్తమ దర్శకుడు: మీగడ రామలింగస్వామి (గుణనిధి)
- ఉత్తమ నటుడు: మీగడ రామలింగస్వామి (గుణనిధి)
- ఉత్తమ నటి: కె. విజయలక్ష్మి (శ్రీకృష్ణాంజనేయ యుద్ధం)
- ఉత్తమ ప్రతి నాయకుడు: ఎం. సాళ్వాచారి (దావీదు విజయం)
- ఉత్తమ పాత్రోచిత నటుడు: సమ్మెట గాంధి (అల్లసాని పెద్దన)
- ఉత్తమ రచయిత: మీగడ రామలింగస్వామి (గుణనిధి)
- ఉత్తమ బాల నటి: చి. చిలకా జ్యోత్స్న (చంద్రహాస)
- ఉత్తమ సంగీతం: ముదపాక వెంకటేశ్వరరావు (భక్త నంద)
- ఉత్తమ ఆహార్యం: బి.ఎల్. పరమేష్ (దావీదు విజయం)
- ఉత్తమ రంగాలంకరణ: మోహనరెడ్డి (పాండవోద్యోగం)
- ప్రత్యేక బహుమతి: కె. సుందరీశ్వరరావు (గణపతి మహాత్మ్యం)
సాంఘీక నాటకం
మార్చు- ఉత్తమ ప్రదర్శన: ఇదిగో దేవుడు చేసిన బొమ్మ (విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: జీవన్నాటకం, (కళారాధన - హైదరాబాద్)
- ఉత్తమ దర్శకుడు: ఎస్. మోహన్ ( ఇదిగో దేవుడు చేసిన బొమ్మ)
- ఉత్తమ నటుడు: మధు (ఇదిగో దేవుడు చేసిన బొమ్మ)
- ఉత్తమ నటి: ఎం. రత్నకుమారి (ఏడు గుడిసెల పల్లె)
- ఉత్తమ ప్రతి నాయకుడు: రజితమూర్తి. సిహెచ్ (ఏడుగుడిసెల పల్లె)
- ఉత్తమ పాత్రోచిత నటుడు: వై. జితేంద్ర (జీవన్నాటకం)
- ఉత్తమ హాస్య నటుడు: చలపతి (అమ్మాయి పెళ్ళయింది)
- ఉత్తమ రచయిత: డి. విజయభాస్కర్ (జీవన్నాటకం)
- ఉత్తమ బాల నటుడు: సయ్యద్ షరీఫ్ (నిశ్శబ్ద గాయం)
- ఉత్తమ సంగీతం: పి. మధుసూదనాచారి ( అమ్మాయి పెళ్ళయ్యింది)
- ఉత్తమ ఆహార్యం: అంజిబాబు (జీవన్నాటకం)
- ఉత్తమ రంగాలంకరణ: సురభి వి. నాగేంద్రబాబు (ఇదిగో దేవుడు చేసిన బొమ్మ)
- ప్రత్యేక బహుమతి: ఎ. కళ్యాణి (కొనగోట మీటిన చాలు)
సాంఘీక నాటిక
మార్చు- ఉత్తమ ప్రదర్శన: మూడోపాదం (ఎస్.ఎన్.ఎమ్. రిక్రియేషన్ క్లబ్, వరంగల్)
- ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: సంపద (రసఝరి, పొన్నూరు)
- ఉత్తమ దర్శకుడు: బి.ఎం. రెడ్డి (మూడోపాదం)
- ఉత్తమ నటుడు: పి.ఆర్. శరణ్ (రిక్త సంబంధాలు)
- ఉత్తమ నటి: కె. విజయ లక్ష్మి (మూడోపాదం)
- ఉత్తమ ప్రతి నాయకుడు: మేక రామకృష్ణ (బొమ్మ)
- ఉత్తమ పాత్రోచిత నటుడు: జి. భరద్వాజ (ఎలకల బోను)
- ఉత్తమ హాస్య నటుడు: గోపరాజు విజయకుమార్ (ఇచ్చుటలో ఉన్నహాయి)
- ఉత్తమ రచయిత: ఎస్. కృష్ణశ్వరరావు (సంపద)
- ద్వితీయ ఉత్తమ రచయిత: మేక రామకృష్ణ (బొమ్మ)
- తృతీయ ఉత్తమ రచయిత: ఆకెళ్ల (మూడోపాదం)
- ఉత్తమ బాల నటి: బేబి గోళ్ళపాటి సత్యహారిక (సేవ్ ది ట్రూత్)
- ఉత్తమ సంగీతం: టి. సాంబశివరావు (సంపద)
- ఉత్తమ ఆహార్యం: కె. భరణి (విజన్ 3కె)
- ఉత్తమ రంగాలంకరణ: పిఠాపురం బాబూరావు (స్త్రీ గుణింతం)
- ప్రత్యేక బహుమతి: టి. సీతాలత (సంపద)
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.702
- ↑ నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.695