నళిని (జననం 1964 ఆగస్టు 28) తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు చిత్రాలలో నటించి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. అలాగే పలు టెలివిజన్‌ సీరియల్స్ లో కూడా పనిచేస్తోంది.[1][2]

నళిని
జననం
రాణి

(1964-08-28) 1964 ఆగస్టు 28 (వయసు 59)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1980–1988
2001–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రామరాజన్
(m. 1987; div. 2000)
పిల్లలుఅరుణ
అరుణ్

వ్యక్తిగత జీవితం

మార్చు

తమిళనాడులో మూర్తి, ప్రేమ దంపతులకు ఎనిమిది మంది సంతానంలో రెండవ వ్యక్తిగా నళిని 1964 ఆగస్టు 28న జన్మించింది. ఆమె 7 మంది తోబుట్టువులలో ఒక సోదరి, ఆరుగురు సోదరులు ఉన్నారు. ఆమె తండ్రి తమిళ సినిమాలలో కొరియోగ్రాఫర్, ఆమె తల్లి ప్రొఫెషనల్ డ్యాన్సర్. ఆమె ఏడవ తరగతి వరకు తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంది. అయితే ఆమె బాల్యంలోనే సినిమాలతో బిజీగా మారడంతో చదువు కొనసాగించలేకపోయింది.

నళిని 1987లో నటుడు రామరాజన్‌ను వివాహం చేసుకుంది. వీరికి కవలలు 1988లో జన్మించారు, అరుణ, అరుణ్. నళిని, రామరాజన్ 2000లో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆమె కుమార్తె అరుణ 2013 మే 6న రమేష్ సుబ్రమణియన్‌ను వివాహం చేసుకుంది.[3] ఆమె కుమారుడు అరుణ్ పవిత్రను 2014 ఏప్రిల్ 25న వివాహం చేసుకున్నారు.[2][4][5]

గుర్తింపు

మార్చు

దక్షిణ భారత చలనచిత్ర రంగానికి అందించిన విశేష కృషికి గాను కలైమామణి డాక్టర్‌ కె.నళినికి జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళామణులకు పక్వాన్‌ చెన్నై ఆధ్వర్యంలో రియలిస్టిక్‌ అవార్డ్స్‌ 2022లో భాగంగా మార్చి 1న ప్రదానోత్సవంలో నళిని జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది.[6]

ఫిల్మోగ్రఫీ

మార్చు

తెలుగు సినిమాలు

మార్చు
సవత్సం సినిమా పాత్రలు గమనికలు
1983 సంఘర్షణ రేఖ
1983 తోడు నీడ
1983 ప్రేమ సాగరం
1983 బందిపోటు సింహం
1983 ఊహా సుందరి
1984 ఇంటిగుట్టు
1984 ప్రేమసామ్రాజ్యం
1985 క్షణం క్షణం భయం భయం తమిళ సినిమా డబ్బింగ్
1985 రుణానుబంధం
1986 మానవుడు దానవుడు
1987 ప్రేమ జయం
2003 వీడే లేడీ డాన్ స్వర్ణక్క
2003 సీతయ్య
2009 కిక్ నైనా స్నేహితురాలి తల్లి
2009 పున్నమి నాగు మాయాదేవి భైరవి
2012 యదార్థ ప్రేమకథ
2016 ఒక్క అమ్మాయి తప్ప మ్యాంగో అమ్మమ్మ
2018 బ్రాండ్ బాబు

మూలాలు

మార్చు
  1. "Profile of Actress Nalini - Tamil Movie Data Base of Tamilstar.com". Archived from the original on 2018-04-15. Retrieved 2022-10-11.
  2. 2.0 2.1 "Nalini TV Serial Actress Exclusive Interview". Archived from the original on 2018-07-13. Retrieved 2022-10-11.
  3. "வைதேகி (தொலைக்காட்சித் தொடர்)". tamil.chennaionline.com). Archived from the original on 4 March 2016.
  4. "Madipakkam Madhavan Serial Cast Actors Names". koolsnapp.com. Archived from the original on 8 February 2018. Retrieved 14 July 2016.
  5. "Madipakkam Madhavan Serial to be Stop". cinema.dinamalar.com. 12 November 2015.
  6. "Actress k Nalini Honoured Lifetime Achievement Award In Chennai - Sakshi". web.archive.org. 2022-10-11. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=నళిని&oldid=4231431" నుండి వెలికితీశారు