చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం
ఆదిలాబాదు జిల్లాలోని 10 శాసనసభ (శాసనసభ) నియోజకవర్గాలలో చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. తూర్పు ఆదిలాబాదు భాగంలో కల ఈ నియోజకవర్గం జిల్లా రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఇక్కడ నుండి విజయం సాధించిన ఇద్దరు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందినారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడ నుండి వరుసగా 4 సార్లు గెలుపొందినాడు. 2004లో వరుసగా ఐదవసారి బరిలోకి దిగి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడు జి.వినోద్ చేతిలో ఓడిపోయాడు. మరో ఆరు శాసనసభ నియోజకవర్గలతో పాటు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ నియోజకవర్గం 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 1,48,412.
చెన్నూర్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మంచిర్యాల |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
నియోజకవర్గంలోని మండలాలుసవరించు
2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం చెన్నూర్ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. ఇది వరకు ఉన్న వేమనపల్లి మండలం ప్రస్తుతం బెల్లంపల్లి నియోజకవర్గంలో కలిసింది.
భౌగోళిక స్వరూపంసవరించు
తూర్పున ప్రాణహిత నది, దక్షణముగా గోదావరి నది ఉన్న ఈ నియోజకవర్గం ప్రకృతి సంపదకు ప్రసిద్ధి. ఆదిలాబాదు జిల్లా తూర్పు భాగంలో ఈ నియోజకవర్గం ఉంది. తూర్పున మహారాష్ట్ర రాష్ట్రం సరిహద్దుగా ఉండగా, దక్షిణాన కరీంనగర్ జిల్లా సరిహద్దుగా ఉంది. పశ్చిమాన, ఉత్తరాన అదిలాబాదు జిల్లాకే చెందిన మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలు సరిహద్దులుగా ఉన్నాయి.
ఎన్నికైన శాసనసభ్యులుసవరించు
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1962 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ చంద్రయ్య ఇండిపెండెంట్ 1967 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ రాజమల్లయ్య ఇండిపెండెంట్ 1972 కోదాటి రాజమల్లు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక - 1978 సి.నారాయణ కాంగ్రెస్ పార్టీ వి.ప్రభాకర్ జనతా పార్టీ 1983 సొత్కు సంజీవరావు తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ 1985 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కె.దేవకి దేవి కాంగ్రెస్ పార్టీ 1989 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ కోదాటి ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ 1994 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ ఎస్.సంజీవరావు కాంగ్రెస్ పార్టీ 1999 బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ 2004 జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ బోడ జనార్థన్ తెలుగుదేశం పార్టీ 2009 నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ 2014 నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి జి.వినోద్ కాంగ్రెస్ పార్టీ 2018 బాల్క సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలుసవరించు
2004 శాసనసభ ఎన్నికలలో చెన్నూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి జి.వినోద్ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడ జనార్థన్ పై 36781 ఓట్ల మెజారిటితో గెలుపొందినాడు. జి.వినోద్ 77240 ఓట్లు సాధించగా, బోడ జనార్థన్ 40459 ఓట్లు పొందినాడు.
- 2004 ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
|
|
|
1999 ఎన్నికలుసవరించు
1999లో బోడ జనార్థన్ వరుసగా నాలుగవ సారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయగా జి.వినోద్ కామ్గ్రెస్ తరఫున పోటీ చేశాడు. బోడ జనార్థన్ 42.57% ఓట్లు పొంది 4వ సారి విజయం సాధించగా, జి.వినోద్ 36.14% ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. సి.పి.ఐ. 16.72% ఓట్లతో మూడవ స్థానం పొందినది.
1994 ఎన్నికలుసవరించు
1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బోడ జనార్థన్ వరుసగా మూడవ సారి బరిలోకి దిగగా, 65.78% ఓట్లతో భారీ ఆధిక్యతతో సమీప ప్రత్యర్థి ఎస్.సంజీవరావుపై విజయం సాధించాడు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 2.47% ఓట్లు పొందగా, బహుజన్ సమాజ్ పార్టీ 2.7% ఓట్లు పొందినది.
వివిధ రాజకీయ పార్టీల పరిస్థితిసవరించు
ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. మూడవ పార్టీ అంతగా బలపడలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీ ఈ నియోజకవర్గంలో మంచి ఉనికిని చూపింది. 1983 తరువాత ఇప్పటి వరకు జరిగిన 6 శాసనసభ ఎన్నికలలో 5 సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించగా, 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన 10 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు చెరో ఐదు సార్లు విజయం సాధించాయి.[1] తెలుగుదేశం పార్టీకి చెందిన బోడ జనార్థన్ ఇక్కడి నుండి 4 సార్లు విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాములు మూడు సార్లు గెలుపొందినాడు.2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ రంగంలో ఉండటంతో మూడు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ జరిగే అవకాశముంది.
నియోజకవర్గ ప్రముఖులుసవరించు
- బోడ జనార్థన్:
- చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 4 సార్లు గెలుపొందిన బోడ జనార్థన్ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని కూడా పొందినాడు. ఆదిలాబాదు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ్య నాయకులలో ఒకడు. 1985లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.దేవకి దేవిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టగా, 1989లో కోదాటి ప్రదీప్‌పై నెగ్గి అప్పటి ఎన్.టి.రామారావు మంత్రివర్గంలో కార్మిక శాఖా మంత్రిపదవిని పొందినాడు.[2] 1994 శాసనసభ ఎన్నికలలో కూడా ఇదే నియోజకవర్గం నుండి సంజీవరావుపై భారీ మెజారిటీతో గెలిచి హాట్రిక్ సాధించాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి.వెంకటస్వామి కుమారుడైన జి.వినోద్‌పై నెగ్గినాడు. 2004లో మాత్రం జి.వినోద్ చేతిలో పరాజయం పొందినాడు.
- జి.వినోద్:
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జి.వెంకటస్వామి కుమారుడైన జి.వినోద్ 1999లో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి, ఇదే నియోజకవర్గం నుండి 4 సార్లు గెలిచిన బోడ జనార్థన్ పై విజయం సాధించాడు. అంతకు క్రితం 1994లో బోడ జనార్థన్ చేతిలో ఓడిపోగా, 1999 అదే ప్రత్యర్థిపై విజయం సాధించి ఇది వరకు బోడ జనార్థన్ నిర్వహించిన కార్మిక శాఖా మంత్రి పదవిని పొందడం విశేషం.
- కోదాటి రాజమల్లు:
- కాంగ్రెస్ పార్టీకి చెందిన కోదాటి రాజమల్లు వరుసగా 3 సార్లు ఈ నియోజకవర్గం నుండి గెలుపొందినాడు. 1962, 1967 ఎన్నికలలో విజయం సాధించగా 1972లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
- ఎస్.సంజీవరావు:
- 1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ వరుస విజయాలకు పగ్గం వేసిన ఎస్.సంజీవరావు 1985లో ఎన్.టి.రామారావుకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కూటమిలో చేరినాడు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందినాడు. ఇతని స్థానం పొందిన బోడ జనార్థన్ ఇప్పటి వరకు నియోజకవర్గంలో పట్టు కలిగిఉన్నాడు.
- కె.దేవకి దేవి:
- కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.దేవకి దేవి 1983, 1985 ఎన్నికలలో చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల చేతులలో ఓడిపోయింది. 1983లో 35.98% ఓట్లు పొందగా, 1985లో 31.30% మాత్రమే ఓట్లు సాధించింది.
ఇవి కూడా చూడండిసవరించు
మూలాలుసవరించు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2005-08-31. Retrieved 2009-03-04.
- ↑ ఈనాడు దినపత్రిక, ఆదిలాబాదు జిల్లా ఎడిషన్, తేది 21-02-2009.