నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం

నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం (Nanded Lok Sabha constituency) మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1967 ముంచి ఇప్పటివరకు జరిగిన 12 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్, భారతీయ జనతా పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన శంకర్‌రావు చవాన్, అశోక్‌రావు చవాన్‌లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ ఈ నియోజకవర్గపు లోక్‌సభ సభ్యుడు.

నాందేడ్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°6′0″N 77°18′0″E మార్చు
పటం

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు మార్చు

  1. భోకర్
  2. నాందేడ్ (ఉత్తర)
  3. నాందేడ్ (దక్షిణ)
  4. నైగాన్
  5. డేగ్లూర్
  6. ముఖేడ్

నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు మార్చు

  • 1967: వెంకటరావు తారోడేకర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1971: వెంకటరావు తారోడేకర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1977: కేశవ్ ఢోంగ్డే (జనతాపార్టీ)
  • 1980: శంకర్‌రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1984: శంకర్‌రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1987 (ఉప ఎన్నిక) : అశోక్‌రావు చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1989: వెంకటేష్ కబ్డే (జనతాదళ్)
  • 1996: గంగాధర్ కుంటుర్కర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1998: భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 1999: భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)
  • 2004: దిగంబర్ పాటిల్ (భారతీయ జనతా పార్టీ)
  • 2009: భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ (కాంగ్రెస్ పార్టీ)

2009 ఎన్నికలు మార్చు

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన సంభాజీ పవార్‌పై 74,614 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. భాస్కర్‌రావు ఖట్‌గాంకర్‌కు 3,46,400 ఓట్లు రాగా, సంభాజీకు 2,71,786 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు