రణం
2006 సినిమా
రణం అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 2006 నాటి రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఇందులో గోపీచంద్, కామ్న జెత్మలాని ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాను పోకూరి బాబురావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
రణం | |
---|---|
![]() | |
దర్శకత్వం | అమ్మ రాజశేఖర్ |
రచన | అమ్మ రాజశేఖర్ |
నిర్మాత | పోకూరి బాబురావు |
తారాగణం | గోపీచంద్, కామ్న జెఠ్మలాని, చంద్రమోహన్, ఆలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రమాప్రభ |
సంగీతం | మణిశర్మ |
విడుదల తేదీ | ఫిబ్రవరి 10, 2006[1] |
భాష | తెలుగు |
కథ
మార్చుచిన్నా చదువుకోసం హైదరాబాద్ వస్తాడు. అందరూ భయపడే భగవతి అనే డాన్ చెల్లెలు మహేశ్వరితో ప్రేమలో పడతాడు. భగవతి అతన్ని భయపెట్టడానికి వస్తే తెలివిగా తప్పించుకుంటూ ఉంటాడు. చిన్నా అతన్ని తప్పించుకుని చివరికి తన ప్రేమను ఎలా నెగ్గించుకున్నాడన్నది మిగతా కథ.
నటవర్గం
మార్చు- చిన్నాగా గోపీచంద్
- మహేశ్వరిగా కామ్న జెఠ్మలాని
- భగవతిగా బిజు మేనన్
- చిన్నా తండ్రిగా చంద్రమోహన్
- ఆలీ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- మహేశ్వరి బామ్మగా రమాప్రభ
- వేణు మాధవ్
- సుమన్ శెట్టి
- వేణు
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు: అమ్మ రాజశేఖర్
- నిర్మాత: పోకూరి బాబు రావు
- సంగీత దర్శకత్వం: మణిశర్మ
- పాటల రచయిత: మణిశర్మ, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్
- గాయకులు: నవీన్, సుచిత్ర, మల్లికార్జున్, మహాలక్ష్మి అయ్యర్, అనురాధ శ్రీరామ్, టిప్పు, జెస్సీ గిఫ్ట్. కెకె
పాటలు
మార్చుఈ సినిమాలో కందికొండ, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు.
- నా పేరు చిన్నా నా మనను వెన్న
మూలాలు
మార్చు- ↑ "Ranam (2006) | Ranam Movie | Ranam Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-05-14.