నాగలాపురం
నాగలాపురం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నాగలాపురం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 12 కి.మీ. దూరంలో, తిరుపతికి 70 కి.మీ. వాయవ్యంగా ఉంది. ఈ గ్రామంలోని శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైంది. శ్రీమహావిష్ణువు మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి మత్స్యావతార మెత్తుతాడు. సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుంకు దశావతార వడ్డాణం ఉంటుంది.
నాగలాపురం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 13°23′N 79°47′E / 13.383°N 79.783°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి |
మండలం | నాగలాపురం |
విస్తీర్ణం | 14.32 కి.మీ2 (5.53 చ. మై) |
జనాభా (2011)[1] | 11,166 |
• జనసాంద్రత | 780/కి.మీ2 (2,000/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 5,468 |
• స్త్రీలు | 5,698 |
• లింగ నిష్పత్తి | 1,042 |
• నివాసాలు | 2,830 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 517589 |
2011 జనగణన కోడ్ | 596345 |
15వ శతాబ్దంలో విజయనగర మహాసామ్రాజ్య చక్రవర్తి తుళువవంశ కృష్ణదేవ మహారాయలు తల్లిగారైన నాగలాంబదేవి (గాజులవారి ఆడపడచు) జన్మించిన హరిగండపురం అనే గ్రామాన్ని, తానూ చిన్నతనం నుండి ఎంతో అల్లారుముద్దుగా పెరుగుతూ వచ్చిన గ్రామాన్ని, తమ తల్లిగారి పేర నాగలాంబపురం అని పేరు పెట్టి అభివృద్ధి చేయడంతో అప్పటినుండి ఈ పట్టణానికి నాగలాంబపురం, నాగలాపురం అని పేరు ప్రసిద్ధి కలిగింది.
దేవాలయనిర్మాణం
మార్చువేదనారాయణస్వామి దేవాలయాన్ని 3 ప్రాకారాలతో కచ్చితమైన ఖగోళ గ్రహగతుల విజ్ఞానంతో విజయనగర మహాసామ్రాజ్య చక్రవర్తి శ్రీ తుళువ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని ఆలయ శాసనాలు స్పష్టపరుస్తున్నట్టు చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయ ప్రాకారాలు విజయనగర కాలపు శిల్పకళా నైపుణ్యానికి ఒక మచ్చు తునక. జీర్ణావస్థలో ఉన్న ఈ దేవాలయ ప్రాకారాలను ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం జీర్ణోద్దరణ చేస్తోంది.
ఆలయ విశిష్టత
మార్చుఈ ఆలయ విశిష్టత ఏమంటే ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరిస్తాయి. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.
పండుగలు
మార్చు- ఇక్కడ పాల్గుణ మాసం శుద్ధ ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, విశేషం. ఈ మూడు రోజుల్లో సూర్య కిరణాలు వరుసగా స్వామివారి పాదాలపై, నాభిపై, నుదుటిపై పడతాయి. ఈ మూడు రోజులు ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది.
- జేష్ఠ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
- వైకుంఠ ఏకాశి
- ఆండాళ్ళ నీరోత్సవం
- భోగి
- సంక్రాతి
- కనుమ
- రథసప్తమి
- కంచిగరుడసేవ
శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుస్వామి ఆలయం
మార్చుఈ ఆలయంలో 23-8-2020 ఆదివారంనాడు నూతన ధ్వజస్థంభ ప్రతిష్ఠచేసారు. అరక్కోణం నుండి తెచ్చిన టేకువృక్షంతో, ఈ ధ్వజస్థంభాన్ని సిద్ధం చేసినారు.
బయటి లింకులు
మార్చు- తితిదే వెబ్ సైటు[1]
ఇవి కూడా చూడండి
మార్చుగణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2830 ఇళ్లతో, 11166 జనాభాతో 1432 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5468, ఆడవారి సంఖ్య 5698. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4296 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 228. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596345[2].పిన్ కోడ్: 517589.
విద్యా సౌకర్యాలు
మార్చుగ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్/ సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, మేనేజిమెంటు కళాశాల పుత్తూరులో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతి లోను, పాలీటెక్నిక్ సత్యవీడులోను, ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల పిచ్చటూరు లోను, ఉన్నాయి.
వైద్య సౌకర్యం
మార్చుప్రభుత్వ వైద్య సౌకర్యం
మార్చునాగలాపురంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
మార్చుగ్రామంలో3 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఒక ఎమ్బీబీయెస్ డాక్టరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. నాలుగు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
మార్చుగ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మార్చుమురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
మార్చునాగలాపురంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
మార్చుగ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి. సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
మార్చుగ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
విద్యుత్తు
మార్చుగ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
మార్చునాగలాపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 300 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 179 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 65 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 51 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 224 హెక్టార్లు
- బంజరు భూమి: 364 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 246 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 29 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 805 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
మార్చునాగలాపురంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 211 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 593 హెక్టార్లు
- చెరువులు: 1 హెక్టార్లు
ఉత్పత్తి
మార్చునాగలాపురంలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".