నిన్నిలా నిన్నిలా

అని.ఐ.వి.శ‌శి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా.

నిన్నిలా నిన్నిలా, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానరులో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి అని.ఐ.వి.శ‌శి దర్శకత్వం వహించాడు. ఇందులో అశోక్ సెల్వన్, నిత్య మేనన్‌, రీతు వర్మ ముఖ్య పాత్రల్లో నటించగా, రాజేష్ మురుగేశన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా తెలుగులో నిన్నిలా నిన్నిలా పేరుతో, తమిళంలో థీని పేరుతో విడుదలయింది.[2][3][4][5][6][7]

నిన్నిలా నిన్నిలా
నిన్నిలా నిన్నిలా సినిమా పోస్టర్
దర్శకత్వంఅని శశి
రచనఅని.ఐ.వి.శ‌శి
నిర్మాతబివిఎస్ఎన్ ప్రసాద్
తారాగణంఅశోక్ సెల్వన్
నిత్య మేనన్‌
రీతు వర్మ
ఛాయాగ్రహణందివాకర్ మణి
కూర్పునవీన్ నూలి
సంగీతంరాజేష్ మురుగేశన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుజీ ప్లెక్స్
విడుదల తేదీs
26 ఫిబ్రవరి, 2021
సినిమా నిడివి
118 నిముషాలు[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం

మార్చు

జీవితంలో ఎలాంటి దిశానిర్దేశం లేని ఒక చెఫ్ అయిన దేవ్ (అశోక్ సెల్వన్), తన అధిక బరువు వల్ల అనేక ఇబ్బందులు పడుతుంటాడు. అదే సమయంలో లండన్ వెళ్ళి మాస్టర్ చెఫ్ (నాజర్) కింద పనిచేస్తుంటాడు. అక్కడ మరో చెఫ్ అయిన తారా (రీతు వర్మ)ను కలుస్తాడు. ఒకరోజు దేవ్, తారా ఇద్దరూ అనుకోకుండా వంటగదిలో చిక్కుకుంటారు. అక్కడ నుండి అన్ని విషయాలు మారిపోతాయి. దేవ్ గురించి, మాయ (నిత్యా మీనన్)తో అతని గతం గురించి తెలుసుకున్న తారా, అతనితో ప్రేమలో పడిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటీనటులు

మార్చు
  • అశోక్ సెల్వన్ (దేవ్)
  • రితు వర్మ (తార, బాల్యంలో అమరా)
  • నిత్యా మీనన్ (మాయ)
  • నాజర్ (రెస్టారెంట్ హెడ్ చెఫ్)
  • సత్య (దేవ్ స్నేహితుడు, సహోద్యోగిగా రాజేష్)
  • బ్రహ్మాజీ
  • లక్ష్మీ నారాయణ
  • శివనారాయణ
  • కేదార్ శంకర్
  • కల్పలత
  • సంధ్య జనక్
  • అన్నా అసేవాడో
  • క్లియోపాత్రా వుడ్
  • డేవ్ వాంగ్
  • దేవెన్ మోధ
  • గార్వాన్మక్‌గ్రాత్
  • పాల్ డేవిస్
  • టామ్ క్లెగ్గ్

విడుదల

మార్చు

2021, ఫిబ్రవరి 26న పే-పర్-వ్యూ మోడల్ ద్వారా జీ ప్లెక్స్ లో తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది.[8]

స్పందన

మార్చు

"నిన్నిలా నిన్నిలా సినిమా మానవ సంబంధాలు, దుఃఖం, ప్రేమ గురించిన సరళమైన కథాచిత్రం" అని ఫస్ట్‌పోస్ట్ పత్రిక విమర్శకుడు హేమంత్ కుమార్ రాశాడు.[9] "సాధారణ కథతో ఈ సినిమా బాగుంది. దేవ్, తారా, మాయ జీవితాలలో అనేక భావాలను అనుభవించవచ్చు" అని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు చెందిన అవినాష్ రామచంద్రన్ రాశారు.[10] టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సమీక్షకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు.[11]

మూలాలు

మార్చు
  1. "Ninnila Ninnila". Preview | Houston Arts & Entertainment Guide. Retrieved 2021-03-14.
  2. "Watch: Ashok Selvan's 'Theeni' and 'Ninnila Ninnila' trailers released". The News Minute. 6 February 2021. Retrieved 2021-03-14.
  3. "Ninnila Ninnila Trailer: Ashok Selvan starrer is all about food, love and muscle spasm". The Times of India. 5 February 2021. Retrieved 2021-03-14.
  4. "Ninnila Ninnila Trailer: 'Live Love Laugh' feels!". www.gulte.com. 5 February 2021. Retrieved 2021-03-14.
  5. "'నిన్నిలా నిన్నిలా' సినిమా ట్రైల‌ర్ విడుద‌ల.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్.. సినిమా ఎప్పుడు వస్తోందంటే." TV9 Telugu. 5 February 2021. Retrieved 2021-03-14.
  6. "మరో సరికొత్త ప్రేమకథ 'నిన్నిలా.. నిన్నిలా'". Eenadu. 6 February 2021. Retrieved 2021-03-14.
  7. "Vijay Deverakonda praises 'Ninnila Ninnila' trailer". The Siasat Daily. 6 February 2021. Retrieved 2021-03-14.
  8. "Dhanush, Mohanlal & Sai Dharam Tej unveil trailers of bilingual Theeni & Ninnila Ninnila". Republic World. 5 February 2021. Retrieved 2021-03-14.
  9. "Ninnila Ninnila movie review: Nithya Menen, Ashok Selvan, Ritu Varma shine in a heartwarming film about food and love". Firstpost. 2021-02-27. Retrieved 2021-03-14.{{cite web}}: CS1 maint: url-status (link)     
  10. "'Ninnila Ninnila' review: A delectable tale of love, loss and longing". The New Indian Express. Retrieved 2021-03-14.
  11. "Ninnila Ninnila Review: A light-hearted tale for the foodie in you". The Times of India. Retrieved 2021-03-14.     

బయటి లింకులు

మార్చు