రీతు వర్మ (జననం:10 మార్చి 1990[1]) తెలుగు సినిమా నటి. కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో చేసిన నటనకు గాను ఆమె పేరొందింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన రీతు షార్ట్ ఫిలింస్ ద్వారా సినిమాల్లో కెరీర్ ప్రారంభించింది. పెళ్ళిచూపులు (2016) సినిమాలో కథానాయిక పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

రీతు వర్మ
Ritu varma.jpg
జననంరీతు వర్మ
(1990-03-10) 1990 మార్చి 10 (వయస్సు: 30  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
స్వస్థలంహైదరాబాద్
మతంహిందూ మతం

తొలినాళ్ళుసవరించు

రీతు వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఆమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. ఇంజనీరింగ్ అనంతరం డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో పాల్గొని రెండవ స్థానం పొందారు.

కెరీర్సవరించు

రీతు వర్మ అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో నటించడంతో పేరు పొందారు. ఈ షార్ట్ ఫిల్మ్ 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ కాంపిటేషన్ లో ఉత్తమ చిత్రంగా గెలుపొందింది, ఇందులో నటనకు రీతు వర్మ ఉత్తమ నటిగానూ అవార్డు పొందారు.[2] 2013లో సినిమా కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ లో ప్రదర్శితమైంది.[3]

అనుకోకుండాలో నటించాకా, ఆమె తొలిగా తెలుగు సినిమా పరిశ్రమలో నటించడం ప్రారంభించారు.[4]ప్రేమ ఇష్క్ కాదల్[5] నటిగా ఆమెకు తొలి సినిమా, అందులో కాస్ట్యూం డిజైనర్ పాత్రను పోషించారు. తర్వాత నా రాకుమారుడు సినిమాలోనూ, ఆపైన ఎవడే సుబ్రహ్మణ్యంలోనూ నటించారు.[6] చిన, పిరై తేడియ నాట్కల్ అన్న తమిళ సినిమాల్లోనూ నటిస్తున్నారు.[7] 2016లో విజయ్ దేవరకొండ కథానాయకునిగా పెళ్ళిచూపులు సినిమాకు కథానాయిక పాత్ర పోషించారు. ఈ సినిమాలో ఆమె పాత్ర కీలకమైనది కావడం, ఆమె మంచి నటన కనబరడంతో ప్రశంసలు పొందారు.[8]

సినిమాల జాబితాసవరించు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2013 బాద్‍షా తెలుగు
2013 ప్రేమ ఇష్క్ కాదల్ సమీర తెలుగు
2014 నా రాకుమారుడు బిందు తెలుగు
2015 ఎవడే సుబ్రహ్మణ్యం రియా తెలుగు ఐఐఎఫ్ఓ ఉత్సవంలో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్
2016 చిన
షెర్లిన్ తమిళం పోస్ట్-ప్రొడక్షన్
2016 పెళ్ళిచూపులు చిత్ర తెలుగు విమర్శకుల ప్రశంసలు, గుర్తింపు
2016 పిరై తేడియల్ నాట్కల్ తమిళం చిత్రీకరణ దశలో

మూలాలుసవరించు

  1. "Date of Birth and Biography". Retrieved 24 April 2015.
  2. http://www.newindianexpress.com/cities/hyderabad/article380423.ece
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-12-26. Retrieved 2016-09-10.
  4. "Ritu Varma excited about her Telugu debut". The Times of India. Retrieved 26 November 2013.
  5. "Prema Ishq Kadhal to be aired on TV soon". The Times of India. Retrieved 17 April 2015.
  6. "Ritu Varma to romance Nani".
  7. "Ritu Varma's becoming familiar with Tamil".
  8. http://www.deccanchronicle.com/151102/entertainment-tollywood/article/vijay-and-ritu-pelli-choopulu

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=రీతు_వర్మ&oldid=2818572" నుండి వెలికితీశారు