నిప్పులాంటి మనిషి (1974 సినిమా)
నిప్పులాంటి మనిషి 1974లో ఎస్.డి.లాల్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం జంజీర్ ఆధారంగా నిర్మితమయ్యింది.[1] అమితాబ్ కు యాంగ్రీ యంగ్ మాన్ ఇమేజి తీసుకువచ్చిన జంజీర్, రామారావు రెండవ ఇన్నింగ్స్ కు మార్గం సుగమం చేసింది. హిందీలో అజిత్ పోషించిన పాత్రను తెలుగులో ప్రభాకరరెడ్డి పోషించాడు. ప్రాణ్ పాత్ర (షేర్ ఖాన్) సత్యనారాయణకు మంచి పేరు తెచ్చింది. మన్నాడె పాట యారి హై ఈమాన్ మెరి తెలుగులో స్నేహమే నా జీవీతంగా వచ్చి హిట్ పాటగా నిలిచింది. ఈ చిత్రం హిట్ ఐన తరువాత రామారావు అనేక రిమేక్ చిత్రాలలో నటించారు. (నేరం నాది కాదు ఆకలిది, మగాడు, అన్నదమ్ముల అనుబంధం, లాయర్ విశ్వనాథ్, యుగంధర్ మొదలైనవి)
నిప్పులాంటి మనిషి (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.డి.లాల్ |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, లత, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నేపథ్య గానం | బాలు, పి. సుశీల |
సంభాషణలు | గొల్లపూడి |
ఛాయాగ్రహణం | ఎస్.ఎస్. లాల్ |
కూర్పు | కె. బాలు |
నిర్మాణ సంస్థ | రవి చిత్ర ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
చిత్రకథ
మార్చువిజయ్ (రామారావు) చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. చేతికి పురుగెత్తే గుర్రం బొమ్మ ఉన్న బ్రేస్లెట్ ధరించి ఉన్న వ్యక్తి తండ్రిని కాల్చి చంపడం రామారావుకు గుర్తు ఉంటుంది. పెద్దయ్యాక రామారావు పోలీసు ఆఫీసరు ఔతాడు. జగదీష్ ప్రసాద్ (ప్రభాకరరెడ్డి) చేసే దొంగ వ్యాపారాలకు అడ్డుఅవుతాడు. లక్ష్మి (లత) కత్తులకు సాన పెట్టే వృత్తితో జీవిస్తుంటే, రామారావు ఆసరా ఇస్తాడు. అతని వదిన (దేవిక) లక్ష్మికి విద్యాబుద్ధులు నేర్పించి వారితోనే ఉంచుకుంటుంది. వృత్తి పరంగా షేర్ఖాన్ (సత్యనారాయణ) తో గొడవపడి తర్వాత స్నేహితుడౌతాడు. మధ్యలో ప్రభాకరరెడ్డి కుట్రతో ఉద్యోగం నుండి సస్పెండ్ ఔతాడు. తండ్రిని చంపిన వ్యక్తిని కనిపెట్టి పగ తీర్చుకోవటం మిగతా కథ. అతనికి తన ముగ్గురు కొడుకుల్నీ కోల్పోయిన డేవిడ్ (రేలంగి) సహాయపడతాడు.
పాత్రలు-పాత్రధారులు
మార్చు- ఎన్.టి.రామారావు - పోలీసు అధికారి విజయ్
- లత - లక్ష్మి
- ప్రభాకరరెడ్డి - జగదీష్ చంద్ర ప్రసాద్ డాన్
- కైకాల సత్యనారాయణ - షేర్ ఖాన్
- దేవిక - విజయ్ వదిన
- రాజబాబు - పోలీస్ కానిస్టేబుల్, అతని తమ్ముడిగా ద్విపాత్రాభినయం
- రేలంగి వెంకట్రామయ్య - డేవిడ్
- సుజాత
పాటలు
మార్చు- స్నేహమే నా జీవితం స్నేహమేరా శాశ్వతం (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: బాలు)
- కత్తికి సాన చురకత్తికి సాన (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: సుశీల)
- వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: ఎల్.ఆర్.ఈశ్వరి)
- ఏదో అనుకొన్నాను (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: సుశీల)
- ఒరబ్బీ ఒరబ్బీ (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకుడు: బాలు, జానకి)
బయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (11 November 1974). "నిప్పులాంటి మనిషి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 3. Retrieved 24 October 2017.[permanent dead link]