నిమ్మగడ్డవారిపాలెం
నిమ్మగడ్డవారిపాలెం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
నిమ్మగడ్డవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′51″N 80°21′03″E / 16.180827°N 80.350775°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | ప్రత్తిపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522019. |
ఎస్.టి.డి కోడ్ | 0863 |
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుఒకే ఉపాధ్యాయుడు, 25 మంది విద్యార్థులూ ఉన్న ఈ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రైవేటుకు దీటుగా నిలుచుచున్నది. బొమ్మలతో విద్యాబోధన చేయుచూ, విద్యార్థులలో ఉన్న మేధాశక్తిని వెలికి తీయుచూ పలువురుకు ఆదర్శంగా నిలుచుచున్నది. గ్రామస్థుల మెప్పు పొందుతుంది.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో చేవూరి పద్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా నూతలపాటి రాంబాబు ఎన్నికైనాడు
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ అంకమ్మ తల్లి, పోతురాజుస్వామివార్ల ఆలయo
మార్చుగ్రామములోని ఈ ఆలయంలో, నూతన యంత్ర, విగ్రహ స్థిర ప్రతిష్ఠా కార్యక్రమాలలో భాగంగా, 2014,మార్చి-7, శుక్రవారం నాడు, మంగళవాద్యాలు, వేదఘోషతో గ్రామ ప్రదక్షిణం, అనంతరం గోపూజ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, దీక్షాధారణ, యాగశాల ప్రవేశం, అఖండస్థాపన, వాస్తుపూజ, అగ్నిమధన, అగ్ని ప్రతిష్ఠ, వాస్తుహోమం, మండప దేవతా హోమాలు, చండీ,రుద్ర హోమాలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం నాడు, ఈ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు, వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతం, నిత్యనిధి మండపార్చనలు, అనంతరం హోమాలు, గర్తన్యాస, రత్నన్యాస పూజలు, యంత్ర ప్రతిష్ఠ, బింబస్థాపన, ప్రాణప్రతిష్ఠ, కళాన్యాసం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. తరువాత భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]
ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవం, 2017,మార్చి-4వతేదీ శనివారనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుగ్రామంలో ప్రధాన వృత్తులు
మార్చువ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
మార్చు- లల్లాదేవి - ప్రఖ్యాత నవలా రచయిత.
గ్రామంలోని విశేషాలు
మార్చుఈ గ్రామంలో కన్నెగంటి శ్రీనివాసరావు అను ఒక రైతు ఉన్నారు. తరతరాలుగా ఆ కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. ఈయనకు వ్యవసాయమంటే ఎంత ఇష్టమో, ఎడ్లను పెంచటం, వాటిని పందేలకు సిద్ధం చేయడం గూడా అంతే ఇష్టం. ఈయన తన కుటుంబంలో తన సంతానంతోపాటు ఎడ్లపైనా అంత మమకారం చూపించుతారు. ఎడ్లకు అవసరమైన ఆహారం, నీరు సకాలంలో అందించుచూ వాటిపై ఎనలేని ప్రేమ చూపించుంతారు. పందెంలో తన ఎడ్లు గెలుపొందినపుడు, ఈయన పొందే ఆనందానికి అవధులుండవు. ఈ నేపథ్యంలో గత 30 సంవత్సరాలుగా, ఈయన రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో జరిగిన ఎడ్లపందేలలో పాల్గొనుచున్నారు. ఒకచోట పందెంలో పాల్గొననగానే, అటునుండి అటే ఇంకో గ్రామంలో జరిగే పందెంలో పాల్గొంటారు. ఈయన తొలిసారిగా 1984లో తెనాలిలో జరిగిన జిల్లా స్థాయి ఎడ్లపందేలలో ప్రథమస్థానం సాధించారు. ఆ తరువాత మహానంది (కర్నూలు), గుడ్లవల్లేరు (కృష్ణా), మైదుకూరు (కడప) వంటి ప్రాంతాలలో జరిగిన అనేక పందేలలో పాల్గొని అనేక బహుమతులు స్వంతం చేసుకున్నారు. ఇప్పటివరకు 150 కి పైగా బహుమతులు పొందినారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పందేలకు వెళ్ళే క్రమంలో, నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటారు. తన ఎడ్లను గెలిపించడం, తనవారికి గెలుపు సమాచారం అందించడంతో కాలం గడుతుంటారు. ఈ పందేలకు వెళ్ళటం, అందుకు అనువుగా ఎడ్లను తీర్చిదిద్దటం, ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ప్రతి సంవత్సరం కనీసం 15 లక్షల రూపాయలను ఈ విధంగా ఖర్చు పెడుతుంటారు. ఈయన పరిసర ప్రాంత గ్రామాలయిన కొత్తమల్లాయపాలెం, గొట్టిపాడు మొదలగు గ్రామాలనుండి పందెపు కోడెదూడలను కొనుగోలుచేసి, పందేలకు సిద్ధంచేస్తుంటారు. వీటికి బలవర్ధకమైనా ఆహారం అందించుచూ, విజయం సాధించేలాగా తీర్చిదిద్దుతారు.