నీతా అంబానీ

మహిళా వ్యాపారవేత్త, ముఖేష్ అంబానీ భార్య

నీతా అంబానీ ఒక భారతీయ మహిళా వ్యాపారవేత్త, సుప్రసిద్ద వ్యాపారవేత్త, భారతదేశ ధనవంతులలో మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ భార్య. ఈమె అధ్యక్షతన ఏర్పడిన ధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ విద్యతో బాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషిస్తోంది.

నీతా అంబానీ
షీబా అమ్మర్‌ను సన్మానించిన నీతా అంబానీ
జననం (1965-11-01) 1965 నవంబరు 1 (వయసు 58)
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థముంబయి విశ్వవిద్యాలయం (బీ.కామ్)
వృత్తిధీరుభాయ్ అంబానీ ఫౌండేషన్ అధ్యక్షురాలు
ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అధ్యక్షురాలు
ముంబై ఇండియన్స్ సహాధ్యక్షురాలు
ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ అదనపు డైరెక్టర్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రిలయన్స్ ఇండస్ట్రీస్, ముంబై ఇండియన్స్, దాతృత్వము
జీవిత భాగస్వామిముకేష్ అంబానీ
పిల్లలుఇషా, అనంత్, ఆకాశ్
బంధువులుమమతా దలాల్ (చెల్లెలు)

ఫోర్బ్స్‌లోకి ఎక్కగానే అకస్మాత్తుగా ఇవాళ ‘గ్రేట్ ఉమన్’ ఐపోలేదు నీతా అంబానీ.

  • ► ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. ఫోర్బ్స్ లిస్టులతో, ఫారిన్ కరెన్సీలతో ఆ ఇమేజ్‌ని తూకం వెయ్యలేం.
  • ► డబ్బుంది. మంచి మనసుంది. ఇచ్చే గుణం ఉంది. అందుకని ‘గ్రేట్ ఉమెన్’ ఐపోలేదు నీతా అంబానీ.
  • ► ఆల్రెడీ ఆమె ఇమేజ్ ఆమెకు ఉంది. విరాళాలతో, వితరణలతో, వ్యాపకాలతో కొత్తగా ఆమెకో ఇమేజ్‌ని ఇవ్వలేం.
  • ► అంత పెద్ద ‘రిలయన్స్’ కూడా.. అమె కటవుట్ ముందు అల్పమూ స్వల్పమే!
  • ► అవును! రిలయన్స్ అధినేత ధీరూభాయ్ అంబానీ మొదట ఆమె కటవుట్‌నే చూశారు.
  • ► ఆ తర్వాత ఆడిటోరియంలోకి వెళ్లి ఆమె డాన్స్ చూశారు. ఆ తీరు, పద్ధతి చూశారు. కోడలిగా చేసుకున్నారు.
  • ► ముప్పై ఏళ్ల తర్వాత కూడా.. ఆ మామగారి కోడలిగానే ఉన్నారు నీతా అంబానీ!
  • ► తనేం సాధించినా, తనెంత కీర్తిని ఆర్జిస్తున్నా... పెళ్ళికి ముందునాటి అమ్మాయిగానే ఉన్నారు. అదే ఆమె గ్రేట్‌నెస్!

నీతా అంబానీ! ముఖేశ్ అంబానీ భార్య. రిలయన్స్ సహ సారథి. ఇప్పుడు లేటెస్ట్‌గా మోస్ట్ పవర్‌ఫుల్ ఏషియన్ బిజినెస్ ఉమన్. ‘ఫోర్బ్స్’ మేగజైన్ ఏటా విడుదల చేస్తుండే ఈ లిస్ట్‌లో తొలిసారి నీతా పేరు కనిపించింది! లిస్ట్‌లో అందరికన్న పైన నీతా కనిపించారు! లిస్టులో నీతా చాలా దేశాలను బీట్ చేశారు. చైనా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, హాంకాంగ్, జపాన్, సింగపూర్, ఫిలిప్పీన్స్, న్యూజీలాండ్.. దేశాలలో మహిళా పారిశ్రామికవేత్తలందర్నీ వెనక్కి తోసి ఫోర్బ్స్ పరుగుల పందెంలో ముందుకు దూసుకువచ్చారు! నీతా గురించి ఫోర్బ్స్ ఏమని వ్యాఖ్యానించిందో చూడండి. ‘కోటీశ్వరుల భార్యలు... వాళ్లెంత సమర్థులైనా.. భర్తల నీడగానే మిగిలిపోతారు. నీతా అలా కాదు. ఆమె సాధించిన విజయాలన్నీ వెరీ ఇంప్రెసివ్’.

వెలుగు వెనుక జ్వాల నీతా గురించి ప్రపంచానికి కొత్తగా తెలియాల్సిందేమీ లేదు. అయితే ఎన్నిసార్లు తెలుసుకున్నా మళ్లీ మళ్లీ తెలుసుకోవలసింది.. ఆమె అంబానీ గారింటి కోడలు ఎలాగయ్యారన్నదే! అనిల్-టీనాల ప్రేమ కథ వాళ్లిద్దర్నీ వెలుగులోకి తెస్తే, ముఖేశ్-నీతాల ప్రేమకథ మనిషి జీవితంలో ప్రేమ గొప్పదనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ వెలుగు వెనక జ్వాల.. నీతా! అనిల్ ప్రేమకు తండ్రి ధీరూభాయ్ అంబానీ ఒప్పుకోలేదు. అనిల్ ఒప్పించాడు. ముఖేశ్ కు స్వయంగా ధీరూభాయే నీతాను వెదికి తెచ్చారు!

ఎలిజబెత్ టేలర్! నీతా గుజరాతీ అమ్మాయి. అమ్మ జానపద నృత్యకళాకారిణి. నీతాకు ఎనిమిదేళ్ల వయసులో తల్లి దగ్గరే నృత్యప్రాశన జరిగింది. భరతనాట్య నర్తకిగా ఎదిగింది. దేశమంతా ప్రదర్శనలు ఇస్తోంది. ఓరోజు ధీరూభాయ్ ముంబైలోని ‘బిర్లా మాతోశ్రీ’ ఆడిటోరియంలో ఆమె డాన్స్ చూశారు. డాన్స్ బాగుంది. అమ్మాయి బాగుంది. ఎంత బాగుందీ అంటే.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకే అందం తెస్తోంది! ‘ఆ అమ్మాయి ఎవరు?’ అని నిర్వాహకుడిని అడిగారు ధీరూభాయ్. ఆ కుటుంబం గురించి అందుబాటులో ఉన్న వివరాలన్నీ రాబట్టారు. ఆఖరికి ఫోన్ నెంబరు కూడా.

ఆ మర్నాడే నీతా ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. నీతానే ఫోన్ లిఫ్ట్ చేసింది. ‘‘నేను ధీరూభాయ్ అంబానీనీ. నీతాతో మాట్లాడాలి’. అటునుంచి గంభీరమైన స్వరం. ‘‘అవునా! అయితే నేను ఎలిజబెత్ టేలర్’’ అని నీతా సమాధానం. అలా అనేసి, వెంటనే ఫోన్ పెట్టేసింది. అంత పెద్ద బిజినెస్‌మేన్ తన కోసం కాల్ చేస్తాడని ఎలా అనుకుంటుంది? మళ్లీ ఫోన్ రింగ్ అయింది. ఈసారి నీతా నాన్న ఫోన్ లిఫ్ట్ చేశారు. ధీరూభాయ్ గొంతు గుర్తుపట్టారు. ఫోన్ మాట్లాడాక నీతా వైపు తిరిగి, మనం ధీరూభాయ్‌ని కలవడానికి వెళుతున్నాం అన్నారు. నీతా ఆసక్తి చూపలేదు. తండ్రి ఆమెను ఒప్పించాడు.

అంబానీవారింటికి ఆహ్వానం ధీరూభాయ్‌ని ఆఫీసుకు వెళ్లి కలిశారు తండ్రీకూతుళ్లు. నీతాను చాలా విషయాలు అడిగారు ధీరూభాయ్. చదువు గురించి, అలవాట్ల గురించి, వంట నైపుణ్యం గురించీ.. ఇంకా చాలా! తర్వాత తమ ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఎందుకు అన్నట్లు చూసింది నీతా. ‘నిన్ను మా ముఖేశ్ జీవిత భాగస్వామిగా చూడాలనుకుంటున్నాను’ అన్నారు ధీరూభాయ్. నీతా ఆశ్చర్యపోయింది. అవుననలేదు. కాదనలేదు. ఆ రాత్రి నీతా కుటుంబ సభ్యులంతా కూర్చుని మాట్లాడుకున్నారు. మర్నాడు నీతా.. ధీరూభాయ్ వాళ్లింటికి వెళ్లింది. కాలింగ్ బెల్ నొక్కింది. ఇక ఇక్కడి నుంచి జరిగిందంతా నీతా మాటల్లోనే వినాలి!

వరుడే ఎదురొచ్చాడు! ‘‘కాలింగ్ బెల్ నొక్కాను. తలుపు తెరుచుకుంది. ఎదురుగా.. తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంటు వేసుకుని ఉన్న ఒక యువకుడు. ‘హాయ్.. ఐ యామ్ ముఖేశ్’ అన్నాడు. అతనికై అతనే వచ్చి నా కోసం తలుపు తెరవడం ఇప్పటికీ నాకొక ఆశ్చర్యం. అది నవంబరు నెల. డిసెంబరులో ప్రపోజ్ చేశాడు. పెళ్ళి చేసుకుందాం అన్నాడు. అప్పుడు ట్రాఫిక్‌లో ఉన్నాం. గ్రీన్ లైట్ వెలిగింది. మా కారు కదల్లేదు. నువ్వు ఏ సంగతీ చెప్పేవరకు కారు కదిల్చేది లేదు అన్నాడు. వెనుక నుంచి హారన్స్. ఒకటే హోరు. ‘ఎస్’ చెప్పాను. మార్చిలోనే మా పెళ్ళి జరిగింది. 1985 మార్చి 8 మా పెళ్ళి రోజు’’.

అంతగా ఏం నచ్చింది? ‘‘ఆ అమాయకత్వం నాకింకా గుర్తు. ఎంత సింపుల్‌గా ఉంది! తనలో తెచ్చిపెట్టుకున్నదేదీ లేదు. ఒక మంచి అమ్మాయికి నేను మనసిచ్చేశానని నాకు అక్కడికక్కడే అర్థమైపోయింది’’ అంటారు ముఖేశ్. నీతాలోని పట్టుదల కూడా ముఖేశ్‌కు నచ్చింది. దేన్నీ ఆమె మధ్యలో వదిలేయదు. దేన్నీ క్షణ్ణంగా అర్థం చేసుకోకుండా నిర్ణయం తీసుకోదు. మంచి బిజినెస్‌మేన్‌కిగానీ ఉమన్‌కి గానీ ఉండవలసిన లక్షణాలు ఇవి. అదొక ప్లస్ పాయింట్ అంబానీ కుటుంబానికి.

పిల్లల్ని అంబానీల్లా పెంచలేదు నీతా పిల్లలు ‘క్యాంపియన్’ స్కూలో చదివేవారు. ఓ రోజు చిన్న కొడుకు వచ్చాడు. ఐదు రూపాయలు అడిగాడు. ప్రతి శుక్రవారం వాడికి నీతా ఐదు రూపాయలు ఇస్తారు. ఆ కోటా అయిపోయింది. ‘‘ఇచ్చాను కదరా! మళ్లీ ఎందుకు అడుగుతున్నావ్?’’ అన్నారు నీతా. ‘‘ఈరోజు నేను రెండు సమోసాలు కొనుక్కోవాలి’’ అన్నాడు వాడు. అప్పుడే ఇంకో సంగతి కూడా చెప్పాడు. స్కూల్లో తనను అంతా ‘తూ అంబానీ హై యా బికారీ హై’ అని అంటున్నారట. అది విని ముఖేశ్ కదలిపోయారు కానీ, నీతా చలించలేదు. పిల్లల దగ్గర ఎక్కువ డబ్బు ఉండకూడదు అని చెప్పి పంపారు కొడుకుని.

ఇవాళ్టికి ఈషాకి గానీ, ఆకాశ్‌కి గానీ, అనంత్‌కి గానీ డబ్బులు కావాలంటే వచ్చి అమ్మను అడగాల్సిందే. అలాగని పిల్లల్ని మరీ కట్టడి చెయ్యలేదు నీతా. వాళ్లు చెప్పింది వింటారు. తను చెయ్యదలచుకుంది చేస్తారు. అది ఇద్దరికీ అమోదయోగ్యంగా ఉంటుంది. ఇదే సూత్రాన్ని కంపెనీ నిర్వహణలోనూ పాటిస్తున్నారు నీతా. ఈషా యేల్ యూనిర్శిటీలో చదువుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ పనుల్లో తల్లికి సహాయంగా ఉంటోంది. పెద్ద కొడుకు ఆకాశ్ 4జి సర్వీసులలో తండ్రిగా చేదోడుగా ఉంటున్నాడు. చిన్నకొడుకు అనంత్ అంబానీ. ఈమధ్య వెయిట్ తగ్గి కనిపిస్తున్న కుర్రాడే ఇతడు.

పద్ధతులే.. ప్రణాళికలు నీతా ఇంట్లో రెండు దేవాలయాలు ఉన్నాయి. ఒకటి వాళ్లు కట్టించుకున్నది. ఇంకొకటి వాళ్లు దేవాలయంలా చూసుకునేది. అదే.. డైనింగ్ హాల్. కుటుంబ సభ్యులంతా ముంైబె లోనే ఉన్నప్పుడు ఏ ఒక్కరు రాకున్నా వారి భోజనం మొదలవదు. ఈ నియమాన్ని నీతానే పెట్టారు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా, అది సమాజానికి ఏదో ఒక రూపంలో ప్రయోజనకరం అయి ఉండాలని మరో నియమం. ఇది భార్యాభర్తలిద్దరూ కలిసి పెట్టుకున్నది. ఇంకా చెప్పాలంటే దేశనిర్మాణానికి సంబంధించిన ఏ కలనైనా నీతా-ముఖేశ్ ఇద్దరూ కలిసే కంటారు. ఆ కలను నిజం చేసుకోడానికి కలిసే కష్టపడతారు. అయితే ఇందులో ప్రధాన భాగస్వామ్యం నీతాదేనని అంబానీ గ్రూపు కుటుంబ సభ్యులంతా నమ్ముతారు.

ముంబై ఇండియన్.. నీతా నీతా అంబానీకి క్రీడలంటే అమితమైన ఆసక్తి. 2008లో రిలయన్స్ సంస్థ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును కొనడానికి ప్రధాన కారణం కూడా ఆమే. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న తొమ్మిదో సీజన్ వరకు దాదాపు జట్టు ఆడిన ప్రతి మ్యాచ్‌కూ ఆమె హాజరవుతూనే ఉన్నారు. ఐపీఎల్‌లో ప్రతి ఏడాదీ ముంబైలో జరిగే ఒక మ్యాచ్‌కు కచ్చితంగా అనాథపిల్లలను తీసుకొచ్చి మ్యాచ్ చూపిస్తుంటారు నీతా. వారికి రవాణా, ఆహారం అన్నీ ఉచితంగా అందిస్తారు. భారతదేశంలో క్రీడలంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదని, ఇతర క్రీడలను కూడా ప్రోత్సహిస్తుండాలని నీతా తరచుగా చెబుతుంటారు. ఇందులో భాగంగా పుట్టిందే ఇండియన్ సూపర్ లీగ్. ఈ ఫుట్‌బాల్ టోర్నమెంట్ భారతదేశంలో జరగడానికి ప్రధాన కారణం నీతా. కేవలం రెండేళ్లలోనే ఐఎస్‌ఎల్ ప్రపంచంలో మూడో పాపులర్ ఫుట్‌బాల్ లీగ్‌గా ఎదగడానికి ఆమె ప్రణాళికలే కారణం. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా యంగ్ చాంపియన్స్ అనే ఫుట్‌బాల్ కార్యక్రమాన్ని నిర్వహించి దేశవ్యాప్తంగా టాలెంట్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే 2013 నుంచి జూనియర్ ఎన్‌బీఏ ప్రోగ్రామ్ పేరుతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో బాస్కెట్‌బాల్‌లో నైపుణ్యం ఉన్న పిల్లలను వెలికి తీస్తున్నారు.

ఇవి కూడ చూడండి

మార్చు

హరీష్ సాల్వే