నీతా లుల్లా (జననం 1965 మార్చి 5) భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్. ఆమె 300 చిత్రాలకు పైగా పని చేసింది. ఆమె 1985 నుండి వివాహ దుస్తులను డిజైన్ చేస్తోంది. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఖుదా గవా, దేవదాస్‌లో చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంతో ఆమె ప్రసిద్ధి చెందింది.

నీతా లుల్లా
2012లో నీతా లుల్లా
జననం (1965-03-05) 1965 మార్చి 5 (వయసు 59)
వృత్తి
 • కాస్ట్యూమ్ డిజైనర్
 • కోటురియర్
 • ఫ్యాషన్ స్టైలిస్ట్
(కోటురియర్ అంటే మహిళల కోసం ఖరీదైన, ఫ్యాషన్ దుస్తులను డిజైన్ చేసి విక్రయించే వ్యక్తి.)
Label(s)
నీతా లుల్లా ఫ్యాషన్స్
జీవిత భాగస్వామిశ్యామ్ లుల్లా
పిల్లలు2[1]
పురస్కారాలుభారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్

లమ్హే (1990), దేవదాస్ (2002), జోధా అక్బర్ (2002), బాలగంధర్వ (2010) చిత్రాలకు రూపకల్పన చేసిన ఆమె ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను పొందింది.

కెరీర్

మార్చు

నటీమణులు సల్మా ఆఘా, శ్రీదేవి లకు కాస్ట్యూమ్ డిజైన్‌లతో ఆమె ప్రసిద్ధిచెందింది. అభిషేక్ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్ ల వివాహ సమయంలో ఆమె డిజైన్ చేసిన దుస్తులు నీతా లుల్లా కెరీర్‌ను మలుపుతిప్పాయి. తన ఫేవరెట్ నటి దివ్యభారతితో పాటు బాలీవుడ్ లో శిల్పాశెట్టి, సప్నా, సల్మా ఆజాద్, ఇషా కొప్పికర్, జుహీ చావ్లా మరెందరో అగ్రశ్రేణి నటీమణులకు ఆమె డిజైన్ చేసింది.

మొహెంజో దారో (2016) వంటి చిత్రాలకు రూపకల్పన చేసేన ఆమె[2] గౌతమీపుత్ర శాతకర్ణితో టాలీవుడ్‌లో తిరిగి అడుగుపెట్టింది.[3]

వ్యక్తిగత జీవితం

మార్చు

ముంబైకి చెందిన నీతా లుల్లా గణనీయమైన సమయాన్ని నగరంలోని ఫిల్మ్‌సిటీలో గడిపింది.[4] ఆమె సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్యామ్ లుల్లాను వివాహం చేసుకుంది.[5]

కలెక్షన్స్

మార్చు
 • మేక్ ఇన్ ఇండియా: 2016 ఫిబ్రవరి 17న కాంటెంపరరీ సెపరేట్‌లతో తయారు చేసిన ప్రత్యేకమైన పైథానీ సేకరణను ప్రదర్శించారు
 • #SheIsMe: 2016 ఏప్రిల్ 6న లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించబడింది[6]

అవార్డులు

మార్చు

జాతీయ చలనచిత్ర అవార్డులు

మార్చు
Year Film Result
1991 లమ్హే విజేత
2002 దేవదాస్ విజేత
2008 జోధా అక్బర్ విజేత
2011 బాలగంధర్వ విజేత

ఫిల్మ్‌ఫేర్ అవార్డులు

మార్చు
Year Film Result Ref.
2003 దేవదాస్ నామినేటెడ్ [7]
2009 జోధా అక్బర్ నామినేటెడ్ [8]

బాలీవుడ్ మూవీ అవార్డులు

మార్చు
Year Film Result Ref.
2001 మిషన్ కాశ్మీర్ విజేత
2003 దేవదాస్ విజేత

IIFA అవార్డులు

మార్చు
Year Film Result Ref.
2000 తాల్ విజేత
2009 జోధా అక్బర్ విజేత

జీ సినీ అవార్డులు

మార్చు
Year Film Result Ref.
2002 దేవదాస్ విజేత

కింగ్‌ఫిషర్ ఫ్యాషన్ అవార్డు

మార్చు
 • ప్రత్యేక గౌరవ పురస్కారం (2005)

ఇండియా లీడర్‌షిప్ కాన్క్లేవ్

మార్చు
 • దశాబ్దపు ఫ్యాషన్ డిజైనర్ (2016)

మూలాలు

మార్చు
 1. "Designer Neeta Lulla With Daughter Nishka Lulla At The Wedding Reception Of Ahana Deol In Mumbai". Rediff. 3 February 2014. Archived from the original on 7 మే 2017. Retrieved 5 November 2018.
 2. Varma, Lipika (25 July 2016). "Styling for the era not easy: Neeta Lulla". Deccan Chronicle. Retrieved 5 November 2018.
 3. "Neeta Lulla to work in Tollywood again". Deccan Chronicle. 17 July 2016. Retrieved 5 November 2018.
 4. Bakshi, Asmita (24 February 2014). "Mumbai exudes a lot of style, says Neeta Lulla". India Today.
 5. "Celebrity Designer Neeta Lulla's Daughter Nishka Lulla Ties The Knot With Businessman Dhruv Mehra". BollywoodShaadis. Retrieved 2020-05-18.
 6. "We need to raise our voice against abuse: Neeta Lulla". Times of India. 6 April 2016. Retrieved 26 June 2016.
 7. "2003 Filmfare Awards - Winners and Nominees". Awards & Winners. Retrieved 15 December 2017.
 8. "54th Filmfare Award Nominations". Indicine. 6 February 2008. Archived from the original on 6 January 2014. Retrieved 7 November 2014.