నేరెడుపల్లి (పెదచెర్లోపల్లి)

ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం లోని గ్రామం


నేరెడుపల్లి, ప్రకాశం జిల్లా, పెదచెర్లోపల్లి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523111. ఎస్.టి.డి కోడ్:08402.

నేరెడుపల్లి
రెవిన్యూ గ్రామం
నేరెడుపల్లి is located in Andhra Pradesh
నేరెడుపల్లి
నేరెడుపల్లి
నిర్దేశాంకాలు: 15°15′54″N 79°37′19″E / 15.265°N 79.622°E / 15.265; 79.622Coordinates: 15°15′54″N 79°37′19″E / 15.265°N 79.622°E / 15.265; 79.622 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపెదచెర్లోపల్లి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,065 హె. (2,632 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,498
 • సాంద్రత230/కి.మీ2 (610/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523111 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

పోతవరం 2 కి.మీ, పెద అలవలపాడు 3 కి.మీ, రాజోలుపాడు 6 కి.మీ, బోగనంపాడు 7 కి.మీ, గూడేవారిపాలెం 9 కి.మీ, వేపగంపల్లి 9 కి.మీ.

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన కనిగిరి మండలం, దక్షణాన వోలేటివారిపాలెం మండలం, తూర్పున పొన్నలూరు మండలం, దక్షణాన లింగసముద్రం మండలం.

సమీప పట్టణాలుసవరించు

పెదచెర్లోపల్లి 4.9 కి.మీ, కనిగిరి 17.2 కి.మీ, వోలేటివారిపాలెం 17.7 కి.మీ, పొన్నలూరు 19.3 కి.మీ.

గ్రామ ప్రముఖులుసవరించు

గుజ్జుల యెల్లమందారెడ్డిసవరించు

పోరాటయోధుడు, నిస్వార్ధ ప్రజాసేవకుడు అయిన గుజ్జుల యెల్లమందారెడ్డి స్వగ్రామం ఇది. ఈయన రాజకీయ చైతన్యం లేని రోజులలో, ఒక కుగ్రామంలో, సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో ప్రజలకు రాజకీయ ఓనమాలు దిద్దించి దున్నేవాడికే భూమి దక్కాలనీ, పుల్లరికి వ్యతిరేకంగానూ, రైతులకోసం పోరాడిన మహానుభావుడు.వీరు ప్రాథమిక విద్యను ఒంగోలులో, ఉన్నత విద్యను నెల్లూరులో అభ్యసించారు. 1943 లో సీ.పీ.ఐ జాతీయ సమితి సభ్యునిగా, కేంద్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. 1952 నుండి 1962 వరకూ ఎం.ఎల్.ఏగా పనిచేసి గ్రామసమస్యలూ, రైతులు, కార్మికులూ ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ఏకరువు పెట్టిన నాయకుడీయన. 1962లో మార్కాపురం ఎం.పీగా ఎన్నికై ఉక్కు ఫ్యాక్టరీ కోసం తన ఎం.పీ పదవికి రాజీనామా చేశారు.యల్లమందారెడ్డి వంటి నాయకుల పోరాటాలవలననే మనకు నాగార్జునసాగర్, వెలిగొండ ప్రాజెక్టులు వచ్చినవి. పామూరు బస్ స్టాండులో యల్లమందారెడ్డి, ఆయన భార్య సరళాదేవి విగ్రహాలను ఏర్పాటుచేశారు. [1]

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,498 - పురుషుల సంఖ్య 1,282 - స్త్రీల సంఖ్య 1,216 - గృహాల సంఖ్య 630;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,400.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,228, మహిళల సంఖ్య 1,172, గ్రామంలో నివాస గృహాలు 536 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,065 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

[1] ఈనాడు ప్రకాశం; 2013,జూలై-21; 8వపేజీ.