నోబెల్ బహుమతి పొందిన స్త్రీలు

1901 నుంచి నోబెల్ బహుమతులను ప్రకటిస్తున్నారు. నేటివరకు వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి 867 అవార్డులు ఇచ్చారు. మొత్తం అవార్డుల్లో మహిళలకు లభించినవి 46 మాత్రమే. 1964లో బ్రిటీష్‌ కెమిస్ట్‌ డొర్తి క్రోఫూట్‌ హాడ్కిన్‌ కెమిస్ట్రీలో నోబెల్‌ను పొందిన తర్వాత 50 ఏళ్లకు మలాలా ఎంపికైంది.[1]

నోబెల్ బహుమతి పొందిన మహిళల కాలరేఖ

నోబెల్ బహుమతులుసవరించు

నోబెల్ బహుమతులను స్వీడన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్ పేరు మీద ఏర్పాటు చేశారు. 1833 అక్టోబరు 21లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ జన్మించారు. ఆయన 355 ఆవిష్కరణలు చేశారు. అందులో అత్యంత ప్రధానమైంది డైనమైట్. నోబెల్ 1895లో రాసిన వీలునామా ప్రకారం ఈ బహుమతులను ఇస్తున్నారు. మానవాళి అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ఐదు రంగాల్లో బహుమతులు ఇవ్వాలని వీలునామాలో రాసి 1896 డిసెంబరు 10లో నోబెల్ మరణించారు. ఆయన పేర్కొన్న ఐదు విభాగాలు భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం, శాంతి.

నోబెల్ బహుమతులను తొలిసారి 1901లో ప్రదానం చేశారు. వీటిని ప్రతి ఏటా ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబరు 10న బహూకరిస్తారు. స్వీడన్ కేంద్ర బ్యాంక్ ‘స్వెర్జిస్ రిక్స్ బ్యాంక్’ 1968లో ఆల్‌ఫ్రెడ్ నోబెల్ స్మారకార్థం ఆర్థిక శాస్త్రంలో బహుమతిని ఏర్పాటు చేసింది. 1969 నుంచి దీన్ని ప్రదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆరు విభాగా ల్లో నోబెల్ బహుమతులను ఇస్తున్నారు.

ఇప్పటివరకు 46 మంది మహిళలకు నోబెల్ బహుమతి లభించింది. ఈ బహుమతి పొందిన మొదటి మహిళ మేరీ క్యూరీ (1903). మదర్ థెరిసా (1979), ఆంగ్‌సాన్ సూకీ (1991), షిరీన్ ఎబాదీ (2003), వంగరి మతాయ్ (2004), ఎలెన్ జాన్సన్ సర్‌లీఫ్ (2011) వంటి వారు నోబెల్ బహుమతిని పొందారు.[2]

పట్టికసవరించు

సంవత్సరం చిత్రం పురస్కార గ్రహీత దేశం వర్గం
2013   ఆలిస్ మన్రో [3] (సాహిత్యం- 2013) కెనడా
1982   ఆల్వా రీమర్ మిర్డాల్ [4] (శాంతి - 1982) స్వీడన్
1991   అంగ్ సాన్ సూకీ [5] (శాంతి - 1991) బర్మా
2009   అడాయీ యోనత్ [6] (రసాయనశాస్త్రం -2009) ఇజ్రాయిల్
2013   అలైస్ ముంరో [7] (సాహిత్యం-2013) కెనడా
2004   ఎల్ఫిదీ జెరినెక్ [8] (సాహిత్యం - 2004) ఆస్ట్రియా
1946   ఎమిలీ గ్రీన్ బాల్చ్[9] (శాంతి - 1946) యునైటెడ్ స్టేట్స్
2009   ఎలిజబెత్ బ్లాక్‌బన్ [10] (ఫిజియాలజీ-2009) ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్
2009   ఎలినార్ అస్ట్రోం [11] (ఎకానమీ- 2009) యునైటెడ్ స్టేట్స్
2011   ఎలెన్ జాంసన్ [12] (శాంతి-2011) లిబరియా
1935   ఐరీన్ జూలియట్ క్యూరీ [13] (రసాయన శాస్త్రం - 1935) ఫ్రాంస్
2009   కరోల్ డబల్యూ గ్రీడర్ (ఫిజియాలకీ-2009) యునైటెడ్ స్టేట్స్
1995   క్రిస్టేన్ సుస్లీన్ వోల్హార్డ్ (ఔషధి/శరీర శాస్త్రం - 1995) జర్మనీ
1947   గెర్టీ థెరెసా కోరీ (చికిత్సా విజ్ఞానం - 1947) యునైటెడ్ స్టేట్స్
1945   గబ్రియేలా మిస్ట్రాల్ (సాహిత్యం - 1945) చిలీ
1926   గ్రేజియా డెలెడా (సాహిత్యం - 1926) ఇటలీ
1997   జోడీ విలియమ్స్ (శాంతి - 1997) యునైటెడ్ స్టేట్స్
1988   జర్‌ట్రూడ్ బేలే ఎలియన్ (ఔషధి/శరీర శాస్త్రం - 1988) యునైటెడ్ స్టేట్స్
1931   జేన్ ఆడమ్స్ (శాంతి - 1931) యునైటెడ్ స్టేట్స్
2011   తవాకెల్ కర్మన్ (శాంతి-2011) యేమన్
2015   తు యుయు (ఫిజియాలజీ-2015) చైనా
1991   నదీన్ గోర్డీమర్ (సాహిత్యం - 1991) దక్షిణ ఆఫ్రికా
1993   టోనీ మారిసన్ (సాహిత్యం - 1993) యునైటెడ్ స్టేట్స్
2007   డోరిస్ లెస్సింగ్ (సాహిత్యం- 2007) యునైటెడ్ స్టేట్స్
1964 దస్త్రం:Dorothy Hodgkin Nobel.jpg డోరోతీ మేరీ క్రోఫుట్ హాజ్‌కిన్ (రసాయన శాస్త్రం - 1964) యునైటెడ్ కింగ్డం
1966   నెల్లీ శాక్స్ (సాహిత్యం - 1966) స్వీడన్-జర్మనీ
1938   పర్ల్ బక్ (సాహిత్యం - 1938) యునైటెడ్ స్టేట్స్
2008   ఫ్రాన్‌కోయిస్ బారే సినౌసీ (ఫిజియాజజీ -2008) ఫ్రాంస్
1906   బర్ధావాన్ సట్‌నర్ (శాంతి - 1906) ఆస్ట్రియా- హంగేరీ
1983   బార్బరా మెక్లింటాక్ (ఔషధి/శరీర శాస్త్రం - 1983) యునైటెడ్ స్టేట్స్
1976   బెట్టీ స్మిత్ విలియమ్స్ (శాంతి - 1976) యునైటెడ్ కింగ్డం
2014   మలాలా యూసఫ్ జై (శాంతి-2014) పాకిస్తాన్
2014   మే-బ్రిట్ మోసర్ (ఫిజియాలజీ-2014) నార్వే
1979   మదర్ థెరెసా (శాంతి - 1979) భారతదేశం
1963   మరియా గెప్పర్ట్ మాయర్ (భౌతిక శాస్త్రం - 1963) యునైటెడ్ స్టేట్స్
1976   మేయ్‌రీడ్ కోరీగన్ (ఫిజియాలజీ - 1976) యునైటెడ్ - కింగ్డం
1903   మేరీ క్యూరీ (భౌతిక శాస్త్రం - 1903) పోలాండ్- ఫ్రాంస్
1911   మేరీ క్యూరీ (రసాయనశాస్త్రం-1911 ) పోలాండ్- ఫ్రాంస్
1992   రిగో బర్టా మేంచూ (శాంతి - 1992) గౌతమాలా
1986   రీటా లెవీ మెంటాల్చినీ (ఔషధి/శరీర శాస్త్రం - 1986) ఇటలీ- యునైటెడ్ స్టేట్స్
1977   రోజ్లిన్ సస్‌మెన్ యాలో (ఔషధి/శరీర శాస్త్రం - 1977) యునైటెడ్ స్టేట్స్
2004   లిండా బి. బక్ (ఔషది/శరీర శాస్త్రం - 2004) యునైటెడ్ స్టేట్స్
2011   లేమాహ్ గ్బోవీ (శాంతి- 2011) లిబరియా
2004   వాంగరీ మాథాయి (శాంతి - 2004) కెన్యా
1996   విస్లావా సింబోర్స్‌కా (సాహిత్యం - 1996) పోలండ్
1909   సెల్మా లాగర్ లోఫ్ (సాహిత్యం - 1909) స్వీడన్
1928   సిగ్రిడ్ అండ్సెట్ (సాహిత్యం - 1928) నార్వే
2015   స్వెత్లానా అలెక్సీవిచ్‌ (సాహిత్యం-2015) బెలారస్
2008   హెర్టా ముల్లర్ (సాహిత్యం-2008) జర్మనీ, రోమానియా
2003   షిరీన్ ఇబాదీ (శాంతి - 2003) ఇరాన్

మూలాలుసవరించు

సాధారణ
  • "Women Nobel Laureates". Nobel Foundation. Retrieved 2009-10-13.
ప్రత్యేక

ఇతర లింకులుసవరించు