పలివెల (కొత్తపేట మండలం)

కోనసీమ జిల్లా కొత్తపేట మండలలోని గ్రామం

పలివెల, కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తపేట నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. పలివెల రాజమహేంద్రవరంకి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. అమలాపురానికి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.

పలివెల (కొత్తపేట మండలం)
పలివెల ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం
పలివెల ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం
పటం
పలివెల (కొత్తపేట మండలం) is located in ఆంధ్రప్రదేశ్
పలివెల (కొత్తపేట మండలం)
పలివెల (కొత్తపేట మండలం)
అక్షాంశ రేఖాంశాలు: 16°41′58.920″N 81°53′24.900″E / 16.69970000°N 81.89025000°E / 16.69970000; 81.89025000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ
మండలంకొత్తపేట
విస్తీర్ణం12.63 కి.మీ2 (4.88 చ. మై)
జనాభా
 (2011)
7,897
 • జనసాంద్రత630/కి.మీ2 (1,600/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు3,955
 • స్త్రీలు3,942
 • లింగ నిష్పత్తి997
 • నివాసాలు2,205
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్533229
2011 జనగణన కోడ్587682

గణాంకాలు

మార్చు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,082. ఇందులో పురుషుల సంఖ్య 4,083, మహిళల సంఖ్య 3,999, గ్రామంలో నివాస గృహాలు 2,038 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2205 ఇళ్లతో, 7897 జనాభాతో 1263 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3955, ఆడవారి సంఖ్య 3942. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2923 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 168. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587682[2].

గ్రామం పేరు వెనుక చరిత్ర

మార్చు

"పలివెల" అను పేరు ఈ గ్రామానికి రావడం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

పౌరాణిక గాథ

పౌరాణిక గాథ ననుసరించి, క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతలింగాన్ని రాక్షసులు ఒక 'పల్వలము' (గొయ్యి) లో దాచారు. అగస్త్యమహాముని ఆ అమృతలింగాన్ని పరమేశ్వరితో సహా అక్కడే ప్రతిష్ఠించాడు. ఆ పల్వలమే కాలక్రమేణా పలివెలగా మారింది.

చారిత్రక గాథ.

ఈ ప్రాంతాన్ని పూర్వకాలములో పల్లవులు పాలించుట వలన "పల్లవ" నుండి "పలివెల" అయిందని అంటారు.

ఉమా కొప్పులింగేశ్వర స్వామి ఆలయం

మార్చు

ఇక్కడి శివలింగ ప్రతిష్థ అగస్త్య మహర్షి ద్వారా జరిగింది అని ప్రతీతి. ఈ దేవాలయములోని కళ్యాణ మండపాన్ని11 వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుడు జీర్ణోద్ధారణ చేశాడని చెబుతారు. ఈ ఆలయ కళ్యాణమండపములో వేదిని అల్లాదరెడ్డి సా.శ. 1416లో కట్టించి ఈ మండపమునకు కొత్త రూపాన్ని ఇచ్చినట్లు ఈ మండపములోనే శాసనము ఉంది. అగస్త్యమహర్షి శివ పార్వతుల కళ్యాణం చూడవలెనని కొరికతో కౌశిక నది ఒడ్డున శివలింగ ప్రతిష్థ చేశాడు. దక్ష యజ్ఞానికి పూర్వం ఇంద్రాది దేవతలు, హిమవంతుడు అగస్త్య మహర్షి పార్వతి కళ్యాణానికి వస్తే ప్రళయం వస్తుంది అని భావించి విశ్వంభరుడుని అగస్త్య మహర్షి వద్దకు పంపుతారు. అగస్త్య మహర్షి తన దివ్యదృష్టితో శివ పార్వతుల కళ్యాణం వీక్షించగా శివ పార్వతులు మధుపర్కాలలో కనిపిస్తారు. అగస్త్య మహర్షి శివుని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై వరాన్ని కొరుకోమనగా అగస్త్య మహర్షి శివపార్వతులను ఒకే పీఠంపై అనుగ్రహించమని కోరుతాడు. ఇదే ఇక్కడ విశేషం. వేరే ఎక్కడ శివ పార్వతులు ఒకే పీఠం మీద కనపడరు. మొదట ఈ క్షేత్రంలో శివుడు లోల అగస్త్య లింగేశ్వరునిగా తరువాత కొప్పులింగేశ్వర స్వామిగా పూజలందుకొంటున్నాడు.

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. గ్రామంలో ఒక ప్రైవేటు మేనేజిమెంటు కళాశాల  ఉంది. సమీప మాధ్యమిక పాఠశాల కొత్తపేటలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొత్తపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల అమలాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అమలాపురంలోను, పాలీటెక్నిక్ రావులపాలెంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం కొత్తపేటలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

పలివెలలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ముగ్గురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు కూడా సరఫరా అవుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.

చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

పలివెలలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో వ్యవసాయ పరపతి సంఘం ఉంది. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

పలివెలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 147 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1112 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 4 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1108 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

పలివెలలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 847 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 256 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 4 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

పలివెలలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, కొబ్బరి, కూరగాయలు

ప్రముఖులు

మార్చు
  • కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి (జ: 2-2-1863 - మ: 29-10-1940) ప్రముఖ తెలుగు రచయిత ఇక్కడే జన్మించారు.
  • ప్రత్యక్ష బాహాట పాంకాల శయ్యల చదివింప నేర్తునే చదువ నేర్తు అని ప్రకటించుకున్న బులుసు రామగోవింద శాస్త్రి పెద్దాపుర సంస్థానం మహారాజ రాజా వత్సవాయ తిమ్మజగపతి బహద్దరు గారి ఆస్థాన పౌరాణికులు - తిమ్మజగపతి కుమారుడైన రాజా రాయ జగపతి హరిభక్తి సుధోదయం అనే కృతిని సమర్పించడం జరిగింది.[3]

మూలాలు

మార్చు
  1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. ఆంధ్ర సంస్థానాలు - ముఖ్య సంస్థానాలు - పేజీ నెం - 269

బాహ్య లంకెలు

మార్చు