పవిత్ర (2013 సినిమా)

2013లో జనార్ధన మహర్షి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం.

పవిత్ర 2013, జూన్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం.[2][3] జనార్ధన మహర్షి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియా సరన్, రోజా, సాయి కుమార్, కన్నెగంటి బ్రహ్మానందం తదితరులు నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. శ్రియా వేశ్యగా నటించిన ఈ చిత్రం తమిళ, మళయాల భాషల్లో కూడా విడుదల అయింది.

పవిత్ర
Pavitra Telugu Movie Poster.jpg
దర్శకత్వంజనార్ధన మహర్షి
నిర్మాతకె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి
రచనజనార్ధన మహర్షి
నటులుశ్రియా సరన్, రోజా, సాయి కుమార్, కన్నెగంటి బ్రహ్మానందం
సంగీతంఎం. ఎం. శ్రీలేఖ
ఛాయాగ్రహణంవి.ఎన్. సురేష్ కుమార్
కూర్పురమేష్
పంపిణీదారుఆదేష్ ఫిల్మ్స్
విడుదల
7 జూన్ 2013 (2013-06-07)[1]
నిడివి
129 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథసవరించు

అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కాపాడేందుకు పవిత్ర (శ్రియా) యుక్త వయస్సులోనే మేనమామ సంరక్షణలోనే పవిత్రురాలిగా మారుతుంది. రాజకీయ నాయకులు, స్వామీజీలు ఎంతోమంది విటులు ఆమె దగ్గరకు వస్తుంటారు. సమాజంలో తనకు జరిగినట్లే మరికొంతమందికి అన్యాయం జరుగుతుందని తెలుసుకున్న పవిత్ర మోడలింగ్‌లో మోసపోయిన ఆరుగురును రక్షించి, వారికి అన్యాయం చేసిన స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ శివ (శివాజీ) ను జైలుకు పంపిస్తుంది. విటుడుగా ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె గతాన్ని తెలుసుకున్న సుదర్శన్‌ (సాయికుమార్‌), తన రాజకీయ ఎదుగుదల కోసం తన కొడుకైన మున్నా (కౌశిక్‌బాబు)కు పవిత్రనిచ్చి పెండ్లి చేస్తాడు. ఆ తర్వాత ఆమెను చంపాలని ప్రయత్నించి, అనుకోకుండా తనే గుండెపోటుతో మరణిస్తాడు. అనంతరం జరిగిన పరిణామలతో ఎం.ఎల్‌.ఎ.గా నిలబడి పవిత్ర గెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • రచన, దర్శకత్వం: జనార్ధన మహర్షి
 • నిర్మాత: కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి
 • సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ
 • ఛాయాగ్రహణం: వి.ఎన్. సురేష్ కుమార్
 • కూర్పు: రమేష్
 • పంపిణీదారు: ఆదేష్ ఫిల్మ్స్

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటలకు ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. 2013, ఏప్రిల్ 6వ తేదీన విశాఖపట్టణంలోని హవామహల్ లో చిత్ర పాటల విడుదల కార్యక్రమం జరిగింది.[4] ఈ కార్యక్రమంలో శ్రియా సరన్, కౌశిక్‌బాబు, ఎం.ఎం. శ్రీలేఖ, సాయి కుమార్, జనార్ధన మహర్షి, బెల్లంకొండ సురేష్, కె. సాధక్ కుమార్, జి. మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.[5]

పాటల జాబితా
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "పవిత్ర టైటిల్ ట్రాక్"  కె. ఎస్. చిత్ర 4:01
2. "రార వేణు"  గీతా మాధురి 3:43
3. "సుకుమారా రారా"  కె. ఎస్. చిత్ర 4:05
4. "ఎంత అందమో"  టిప్పు & ఎం.ఎం. శ్రీలేఖ 3:58
5. "దూల తీరిందా"  శ్రీకృష్ణ, రఘు, ధనుంజయ్ 2:15

మూలాలుసవరించు

 1. "Pavitra set to release on June 7 - 123telugu.com". 26 May 2013. Cite web requires |website= (help)
 2. "Shriya Pavithra photo gallery, US". idlebrain.com. 5 January 2013. Retrieved 28 July 2019. Cite web requires |website= (help)
 3. "Shriya in Pavithaworking stills, US". idlebrain.com. 5 Jan 2013. Retrieved 28 July 2019. Cite web requires |website= (help)
 4. "News18.com: CNN-News18 Breaking News India, Latest News Headlines, Live News Updates". News18.
 5. "Pavithra Audio Release Photos". moviegalleri.net. 6 April 2013. Retrieved 29 July 2019. Cite web requires |website= (help)

ఇతర లంకెలుసవరించు