పశ్చిమ చంపారణ్

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో పశ్చిమ చంపారణ్ జిల్లా (హిందీ:पश्चिम चंपारण ज़िला) (ఉర్దూ : مغرِبی چمپارن ضلع)ఒకటి. బెటియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[1] బెటియా జిల్లా తిరుహట్ డివిషన్‌లో భాగంగా ఉంది. ఇది నేపాల్ సరిహద్దులో ఉంది. ప్రజలు ఇక్కడి నుండి సులువుగా నేపాల్‌కు వచ్చి పోతూ ఉంటారు. నేపాల్- బిర్గుంజ్ మార్కెట్లో చైనా, కొరియా, జపాన్ తయారీ వస్తువులు లభిస్తుంటాయి. ప్రజలు పుట్టిరోజు, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి నేపాల్‌కు పోతుంటారు. నేపాల్ ఇక్కడి ప్రజల నుండి వ్యాపార ఆదాయం లభిస్తుంది. చంపారణ్య ప్రజలు బిర్గుంజ్ వద్ద మెడికల్ కాలేజీని స్థాపించారు.

West Champaran జిల్లా

पश्चिमी चंपारण ज़िला,مغربی چمپارن
Bihar లో West Champaran జిల్లా స్థానము
Bihar లో West Champaran జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముTirhut
ముఖ్య పట్టణంBettiah
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుPaschim Champaran, Valmiki Nagar
 • శాసనసభ నియోజకవర్గాలుValmiki Nagar, Ramnagar, Narkatiaganj, Bagaha, Lauriya, Nautan, Chanpatia, Bettiah, Sikta
విస్తీర్ణం
 • మొత్తం5,229 కి.మీ2 (2,019 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం39,22,780
 • సాంద్రత750/కి.మీ2 (1,900/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత58.06 per cent
 • లింగ నిష్పత్తి906
ప్రధాన రహదార్లుNH 28B
జాలస్థలిఅధికారిక జాలస్థలి

చరిత్రసవరించు

1972లో పశ్చిమ చంపారణ్ జిల్లా పాత చంపారణ్ జిల్లానుండి రూపొందించబడింది. ముందు ఇది శరన్ జిల్లాలో డివిజన్‌లో భాగంగా ఉంది. తరువాత చంపారణ్ జిల్లాలో భాగంగా ఉంది. జిల్లాకేంద్రంగా బెటియా పట్టణం ఉంది.

పేరువెనుక చరిత్రసవరించు

బెటియా అనే పేరు బెయింట్ (కేన్) నుండి వచ్చింది. ఈ ప్రాంతంలో కేన్ అధికంగా కనిపిస్తుంటాయి కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. చంపారణ్యం అనే పేరు కాలక్రమంగా చంపారణ్ అయింది. చంపక వృక్షాలు అధికంగా ఉన్నందున ఈ ప్రాంతానికి చంపారణ్యం అనే పేరు వచ్చింది.

పాలకులుసవరించు

జిల్లా గజటీర్ అనుసరించి చంపారణ్యాన్ని ఆర్యులు ఆక్రమించి విదేహ రాజ్యంలో భాగంగా చేసారు. విదేహరాజ్యపతనం తరువాత వైశాలి రాజధానిగా భూభాగం వ్రిజ్జైన్ ఒలిగార్చియల్ రిపబ్లిక్ అవతరుంచింది. వ్రిజ్జైన్ ఒలిగార్చియల్ రిపబ్లిక్‌లో లిచ్చివీలు శక్తివంతులుగా ఉండి ఆధిక్యతలో ఉన్నారు. మగధరాజు ఆజాతశత్రువు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి తనబ్బూభాగంలో కలుపుకుని తనసామ్రాజ్యాన్ని చంపారణ్యం వరకు విస్తరించాడు. తరువాత వంద సంవత్సరాల కాలం ఈ ప్రాతం మౌర్యుల పాలనలో ఉంది. మౌర్యుల తరువాత మగధ భూభాగాన్ని సుంగాలు, కంవాలు పాలించారు. తరువాత ఈ భూభాగం కంవాల పాలనలోకి మారింది. తరువాత కుషన్ పాలకులు ఈ భూభాగాన్ని పాలించారు. తరువాత గుప్తులు ఈ ప్రాంతానికి పాలకులు అయ్యారు. తిరుహట్‌తో చేర్చి చంపారణ్యం హర్షవర్ధనుడి వశం అయింది. హర్షవర్ధనుడి కాలంలో చైనాయాత్రికుడు హూయంత్సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. 750 నుండి 1155 వరకు బెంగాల్ పాలాలు తూర్పుభారతదేశం మీద ఆధిక్యం సాధించి ఈ ప్రాంతాన్ని తమ రాజ్యంలో చేర్చుకున్నారు.10వ శతాబ్దం చివరిదశలో కళాచేరి వంశానికి చెందిన గంగయదేవా చంపారణ్యం మీద విజయం సాధించాడు. తరువాత చాళుఖ్య వంశానికి చెందిన విక్రమాదిత్యుడు ఈ భాగానికి పాలకుడయ్యాడు.

ముస్లిం పాలకులుసవరించు

1213, 1227 మద్యకాలంలో బెంగాల్ రాజప్రతినిధి జియాసుద్దీన్ ఇవాజ్ త్రొభుక్తి వరకు అధికారాన్ని కొనసాగించాడు. ఇది పూర్తిగా ఈ ప్రాంతం మీద విజయం సాధించడం కానప్పటికీ సింరాయన్ రాజైన నరసింగదేవా నుండి ఈ ప్రాంతం మీద ఆధికారాన్ని పొందాడు. 1320 నాటికి తుగ్లక్ తిరుహట్‌ వరకు తన సామ్రాజ్యంలో కలుపుకుని కామేశ్వర్ ఠాకూరును ఈ ప్రాంతానికి రాజప్రతినిధిని చేసాడు. తరువాత కామేశ్వర్ ఠాకూరు ఠాకూర్ సామ్రాజ్యం (సుగాన్ సామ్రాజ్యం) స్థాపించాడు. ఇది కొంతకాలం కొనసాగింది. తరువా 1530లో అల్లావుద్దీన్ కుమారుడ్జు నసరత్ షాహ్ తిరుహట్ మీద దాడి చేసి రాజాను చంపి ఠాకూర్ రాజ్యానికి ముగింపు పలికాడు. తరువాత నసరత్ షాహ్ తన అల్లుడిని ఈ ప్రాంతానికి వైశ్రాయిని చేసాడు. తరువాత ఈ ప్రాంతాన్ని ముస్లిములు పాలించారు. మొగల్ సామ్రాజ్య పతనం తరువాత ఈ ప్రాంతం బ్రిటిష్ పాలకుల వశం అయింది.

బ్రిటిష్సవరించు

బ్రిటిష్ కాలంలో ఈ ప్రాంతం బెటియా రాజ్ ఆధిక్యతలో కొనసాగింది. బెటియా రాజ వంశం గొప్ప రాజవంశంగా గుర్తించబడుతుంది. ఇది ఉజ్జయిన్ సింగ్‌తో మొదలైంది. ఉజ్జయిన్ సింగ్ కుమారుడు గజాసింగ్ షాజహాన్ చక్రవర్తి (1528-58) నుండి రాజాపట్టం అందుకున్నాడు. 18వ శతాబ్దంలో మొగల్ సామ్రాజ్యం పతనం ఆరంభం అయ్యే వరకు ఈ రాజకుటుంబం ఈ ప్రాంతానికి స్వతంత్ర రాజప్రతినిధులుగా ఉన్నారు. తరువాత చంపారణ్యం బ్రిటిష్ పాలకుల వశం అయింది. తరువాత ఈ భూభాగం మీద అధికారం రాజా జుగల్ కిషోర్ సింగ్ వశం అయింది. 1763 నాటికి కిషోర్ సింగ్ కుమారుడు ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. బ్రిటిష్ పాలనలో చివరిగా హరేంద్రసింగ్ ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. హరేంద్రసింగ్ వారసత్వరహితంగా 1893లో మరణించాడు. తరువాత ఆయన మొదటి భార్య అధికారం స్వీకరించింది. 1896లో హరేంద్రసింగ్ భార్య మరణించిన తరువాత అధికారం కోర్టుకు పోయింది. 1897 నుండి అధికారం హరేంద్రసింగ్ చిన్నభార్య మహారాణి జానకి కౌర్ హస్థగతం అయింది.

20వ శతాబ్దంసవరించు

బ్రిటిష్ రాజ్ ప్యాలెస్ నగరకేంద్రంలో విశాలమైన ప్రదేశం ఆక్రమించింది. 1919లో మహారాణి ప్రార్థన అభ్యర్ధన మీద కొలకత్తా లోని గ్రహం ప్యాలెస్ రూపొందించిన నిర్మాణకళాకారులచేత ఈ ప్యాలెస్ నిర్మించబడింది. ప్రస్తుతం ఇది బెటియా రాజ్ ఆధీనంలో ఉంది.

గాంధీజీసవరించు

20వ శతాబ్దంలో జాతీయ ఉద్యమం తీవ్రం అయిన తరువాత బెటియా రాజకీయాలు ఇండిగో (నీలిమందు) ప్లాంటేషన్‌తో ముడిపడ్డాయి. రియాత్ రాజకుమార్, చంపారణ్య ఇండిగో వ్యవసాయదారుడు గాంధీజీని కలుసుకున్నారు. వారు రైతులు, రియాత్‌ల సమస్యలను గాంధీజీ దృష్టికి తీసుకువచ్చారు. 1917లో గాంధీజి చంపారణ్యానికి వచ్చి వారి సమస్యలను స్వయంగా విని తెలుసుకున్నాడు. తరువాత చంపారణ్యంలో సత్యాగ్రహం మొదలైంది. ఇండిగో ప్లాంటర్ల అణిచివేతతో ఉద్యమం ముగింపుకు వచ్చింది. 1918 దీర్ఘకాల ఇండిగో వ్యవసాయదారులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం స్వాతంత్ర్య సమరకేంద్రాలలో ఒకటిగా మారింది. తరువాత బెటియా పరిసర ప్రాంతాలన్ని ఇండిగో ప్లాంటేషన్ వ్యవసాయంతో నిండిపోయింది. ఇండిగో పంట మూలంగా బ్రిటిష్ వారికి అధిక ఆదాయం లభించింది. అయినప్పటికీ వ్యవసాయభూములు కలుషితమై ఇతర పంటలు పండించడానికి వీలు కాని పరిస్థితి ఎదురైంది. ఇప్పటికీ గతంలో ఇండిగో పండించిన భూమి నిష్ఫలంగా బీడుభూమిగా మారింది. అదిప్పుడు పొదలతో నిండిన బీడుగానే ఉంది.

నెహ్రూ విజయంసవరించు

1959లో ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ బెటియాను సందర్శించాడు. ఆసమయంలో ఈ నగరం భారతదేశ 5వ మహానగరంగా ఉండేది. బెటియా రాజ్‌లో ఉన్న 1800 చక్కెర మిల్లులు ఈ ప్రాంతానికి ప్రత్యేకతను సంతరించాయి. మిల్లులకు అద్దెగా దాదాపు 2 మిలియన్ల రూపాయలు లభ్యమౌతుంది. (బీహార్‌లో ఇది రెండవ స్థానంలో ఉంది). ఇండియాలో జమీందారీ వ్యవస్థ రద్దైన తరువాత ఇది నిషేధానికి గురైంది.

భౌగోళికంసవరించు

చంపారణ్ జిల్లా వైశాల్యం 5228 చ.కి.మీ.[2] ఇది కెనడా దేశంలోని అముద్ రింగ్నెస్ ద్వీపం వైశాల్యానికి సమానం.[3]

వృక్షజాలం , జంతుజాలంసవరించు

1989లో పశ్చిమ చంపారణ్ జిల్లాలో 336 చ.కి.మీ వైశాల్యంలో రెండు వన్యప్రాణి శాక్చ్యురీలు ఏర్పాటు చేయబడ్డాయి.[4] ఒకటి వాల్కిమి రెండవది ఉదయపూర్ వన్యప్రాణి అభయారణ్యం.[4]

విభాగాలుసవరించు

 • జిల్లాలో 3 విభాగాలు ఉన్నాయి :- బెటియా, బాఘా, నర్కతియాగంజ్.
 • మండలాలు :-బెత్తీహ్, సిక్త, మైనతంద్, చంపత్తీ, బైరీ, లౌరీ, బగహ - బగహ, మధుబని, గౌనహ, నర్కతీగంజ్, మంఝౌలీ, నౌతన్, జొగపత్తి, రాంనగర్, తక్రహ, భితహ, పిప్రసి

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,922,780,[5]
ఇది దాదాపు. లిబరియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. ఒరగాన్ నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 63 వ స్థానంలో ఉంది.[5]
1చ.కి.మీ జనసాంద్రత. 750 [5]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.89%.[5]
స్త్రీ పురుష నిష్పత్తి. 906:1000 [5]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 58.06%.[5]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
లౌరియా మండలం 87.12%

రావాణాసౌకర్యాలుసవరించు

 • జిల్లా రహదారి, రైలు మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.
 • జాతీయ రహదారి 28బి జిల్లాలోని బఘ, చౌతర్వా, లౌరియా నందన్‌గర్ నుండి జిల్లా కేంద్రం బెటియా చేరుకుంటుంది.
 • జిల్లాలో గోరక్‌పూర్ నర్కతియాగంజ్ ముజాఫర్‌పూర్ మాగ్రంలో 13 స్టేషన్లు ఉన్నాయి. నర్కతియాగంజ్ దర్భంగా మార్గంలో 4 స్టేషన్లు ఉన్నాయి. నర్కతియాగంజ్ భిఖనా మార్గంలో 5 స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో నర్కతియాగంజ్ జంక్షన్ మాత్రమే ఉంది.

భాషలుసవరించు

జిల్లాలో బిహారీ భాషా కుటుంబానికి చెందిన భోజ్‌పురి భాష 40 000 000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఇది దేవనాగరి, కైథిలి లిపిలో వ్రాయబడుతుంది. [8]

సంస్కృతిసవరించు

నగరం గొప్ప సాంస్కృతిక సంపద కలిగి ఉంది. ప్రముఖ కవి గోపాల్ సింగ్ నేపాలీకి ఇది జన్మస్థలం. రాజేంద్రప్రసాద్, అనుగ్రహ్ బాబు, బ్రాజ్కిషోర్ ప్రసాద్ వంటి నాయకులతో చేరి గాంధీజి 1917లో మొదటిసారిగా ఇక్కడి నుండి సత్యాగ్రహ ఉద్యమం ఆరంభించాడు.

 • మహాత్మా మహాత్మా గాంధీ ప్రారంభించాడు సత్యాగ్రహ ఆందోళన్
 • వాల్మీకి ఋషి ఇక్కడ రామాయణం రాశారు.
 • హిందీ కవి గోపాల్ సింగ్ నేపాలి, బెత్తీహ్.
 • రమేష్ చంద్ర ఝా
 • కృష్ణ కుమార్ మిశ్రా,కెహునీ
 • గౌరీ శంకర్ పాండే, బెత్తీహ్
 • మనోజ్ బాజ్ పాయ్,బెత్తీహ్
 • ప్రకాష్ ఝా,బెత్తీహ్
 • జంషెడ్ ఆలీ, బెత్తిహ్

• ఫజ్లుర్ రహ్మన్ కంధ్వలీ కార్మిక మంత్రి

 • మనికంత్ తివారీ @ జమునియ బజార్
 • .ఎం.డి షమీం తైయబ్, పురాని బజార్, రాంనగర్.

మూలాలుసవరించు

 1. http://tirhut-muzaffarpur.bih.nic.in
 2. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th సంపాదకులు.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
 3. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Amund Ringnes Island 5,255km2 horizontal tab character in |quote= at position 21 (help); Cite web requires |website= (help)
 4. 4.0 4.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: Bihar". మూలం నుండి 2011-08-23 న ఆర్కైవు చేసారు. Retrieved September 25, 2011. Cite web requires |website= (help)
 5. 5.0 5.1 5.2 5.3 5.4 5.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)
 7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
 8. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: extra text (link)

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు